హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET Medical Exam Scam: నీట్ ఎగ్జామ్ లో భారీ కుంభకోణం.. రూ. 50 లక్షలిస్తే పరీక్ష రాయకున్నా సీటు.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు..

NEET Medical Exam Scam: నీట్ ఎగ్జామ్ లో భారీ కుంభకోణం.. రూ. 50 లక్షలిస్తే పరీక్ష రాయకున్నా సీటు.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ పరీక్షకు(NEET Exam) సంబంధించి సీబీఐ భారీ కుంభకోణాన్ని (Scam) గుర్తించింది. ఈ విషయంపై ఇప్పటికే సదరు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తో పాటు, తప్పుడు దారిలో లబ్ధిపొందుదామని ప్రయత్నించిన కొందరు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ(CBI) వర్గాలు వెల్లడించాయి.

ఇంకా చదవండి ...

  దేశంలోని ప్రముఖ వైద్యశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష(NEET Exam) కుంభకోణానికి(NEET Scam) సంబంధించి అనేక షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. మహారాష్ట్రకు(Maharashtra)కు చెందిన ఆర్కే ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ అనే ఓ కోచింగ్ సెంటర్ ఈ కుంభకోణానికి యత్నించినట్లు సీబీఐ(CBI) గుర్తించింది. దీంతో కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అయిన పరిమల్ కోట్పల్లివార్ పాటు కొందరు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.  ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ఇప్పిస్తామని ఆ కోచింగ్ సెంటర్ నీట్ అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఫేక్ వ్యక్తులతో పరీక్ష రాయించేందుకు రూ. 50 లక్షలు ఇవ్వాలని డీల్ చేసుకున్నట్లు నిర్ధారించారు అధికారులు. ఇందుకోసం ముందుగానే విద్యార్థుల నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్ లను తీసుకుని.. అందులో వారి ఫొటోలను మార్చినట్లు తేల్చారు. ఇంకా విద్యార్థుల దగ్గర నుంచి ఈ-ఆధార్ కార్డులను(e aadhaar) కార్డులను తీసుకుని వాటితో ఫేక్ ఐడీ కార్డుల(Fake ID Cards)ను సైతం తయారు చేసినట్లు గుర్తించారు. ఇది కుదరకపోతే.. ఆన్సర్ కీని కూడా ఇస్తామని.. అలా కాకపోతే ఓఎంఆర్ షీట్ల(OMR Sheets)ను అయినా మారుస్తామని సదరు కోచింగ్ సెంటర్ విద్యార్థులతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడైంది.

  ఇందుకోసం దాదాపు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 50 లక్షలు డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు వారి తల్లిదండ్రులు కోచింగ్ సంటర్ తో ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. ఇదిలా ఉంటే.. ఈ నెల 12న నీట్ ఎగ్జామ్ ను నిర్వహించారు. మొత్తం ఐదు పరీక్షా కేంద్రాల్లో ఈ కుంభకోణం చేసి భారీగా డబ్బులు దండుకునేందుకు సదరు కోచింగ్ సెంటర్ కుట్ర చేసింది. అయితే.. ఈ విషయం సీబీఐకి చేరడంతో పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు కాపుకాశారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద సదరు కోచింగ్ సెంటర్ల ఆటలు సాగలేదు.

  CTET Dec 2021 : టీచర్ కావాలనుకుంటున్నారా.. సీటెట్ 2021 దరఖాస్తు చేసుకోండి

  ఇదిలా ఉంటే.. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలు కల్పించే దిశగా తమిళనాడు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 13న నీట్‌ను (NEET) తమిళనాడు నుంచి శాశ్వతంగా మినహాయించాలని డీఎంకే సర్కారు ఒక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును తమిళనాడు (Tamil Nadu) శాసన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లు చట్టంగా మారడానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయాల్సి ఉంది.

  American Corner: అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్స్‌కు శుభవార్త.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ సందడి

  నీట్‌ను రద్దు చేసి.. 12వ తరగతి మార్కుల ప్రాతిపదికన విద్యార్థులకు వైద్యవిద్యలో ప్రవేశాలు కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. మెడికల్ ప్రవేశాలకు నీట్ ఒక్కటే మార్గం కాకూడదని స్టాలిన్‌ సర్కార్ నిర్ణయించుకుంది. అలాగే మెడికల్ కాలేజీల్లో 7.5% సీట్ల రిజర్వేషన్‌ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాలని ప్రతిపాదించింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Exams, Fraud, Maharashtra, NEET 2021

  ఉత్తమ కథలు