హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CAT: క్యాట్‌ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ మీ టార్గెటా..? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ ప్రిపరేషన్ ఇలా..

CAT: క్యాట్‌ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ మీ టార్గెటా..? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ ప్రిపరేషన్ ఇలా..

CAT: క్యాట్‌ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ మీ టార్గెటా..? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ ప్రిపరేషన్ ఇలా..

CAT: క్యాట్‌ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ మీ టార్గెటా..? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ ప్రిపరేషన్ ఇలా..

క్యాట్ ఎగ్జామ్‌కు కేవలం నెల రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షలో బెస్ట్ స్కోర్ కోసం ప్రిపరేషన్ టిప్స్‌ పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

Written by, Pradeep Pandey, Academic Head, T.I.M.E.

దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో(Business Schools) ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT) నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది నవంబర్ 27న ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(Aptitude), కాంప్రహెన్షన్ రీడింగ్(Compression Reading) వంటివి కీలకమైన విభాగాలు. వీటిపై మంచి పట్టు ఉంటే క్యాట్‌లో టాప్ స్కోర్ సొంతం చేసుకోవచ్చు. ఈ పరీక్షకు కేవలం నెల రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో క్యాట్ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ కోసం ప్రిపరేషన్ టిప్స్‌ పరిశీలిద్దాం.

వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్

ఈ సెక్షన్‌లో మంచి స్కోర్ చేయాలంటే క్రమం తప్పకుండా RC, VA ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తుండాలి. పాసేజ్‌లు చేయడం, పారా జంబుల్, పారా కంప్లీషన్, సమ్మరీ, క్రిటికల్ రీజనింగ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్ అనేవి ప్రిపరేషన్‌కు బేస్ కావాలి. బేసిక్ గ్రామర్, పదజాలం, పదబంధాలపై కొంచెం దృష్టి కేంద్రీకరించడం వల్ల రీడింగ్ స్పీడ్, అవగాహన స్థాయి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో ఈ సెక్షన్‌లో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది.

IGNOU Admissions 2022: ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు మరోసారి పెంపు.. ఎప్పటివరకంటే..

* డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (DILR)

ఈ సెక్షన్‌లో బెస్ట్ స్కోర్ కోసం రోజూ ప్రాక్టీస్ చేయాలి. అయితే టైమ్ బౌండ్‌లో ఆన్సర్ రాబట్టడం ముఖ్యం. అభ్యర్థులు లెటెస్ట్ ప్యాట్రన్ మాక్ టెస్ట్‌లను ఎక్కువ‌గా ప్రాక్టీస్ చేయాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు పరిష్కరించడానికి కఠినంగా ఉంటాయి. దీంతో ఇవి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి ఏమి ఇచ్చారు, ఏమి కావాలి అనే ఒకే అంశం మీద దృష్టి కేంద్రీకరించి, ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (QA)

క్యాట్‌లో అత్యంత కఠినమైన విభాగం క్యూఏ. చాలా మంది విద్యార్థులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటేనే ఆందోళనకు గురవుతారు. చాలా మంది విద్యార్థులకు ఫండమెంటల్స్‌పై మంచి పట్టు ఉన్నా.. అప్లికేషన్ బేస్డ్ ప్రశ్న వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యాట్ పరీక్షలో థిరిటికల్ నాలెడ్జ్‌కు ప్రయారిటీ ఉండదు. ఇది బేసిక్ కాన్సెప్ట్స్ అప్లికేషన్ రూపంలో ఉంటుంది. కాబట్టి బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్, ప్రపోర్షనాలిటి టూల్స్, నంబర్స్, ఎలిమెంటరీ కాంబినేటరిక్స్, అల్ జీబ్రా, జామెట్రీ వంటి టాపిక్స్‌పై మంచి పట్టు తెచ్చుకోవాలి. దీంతో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో బెస్ట్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలో టైమ్ మేనేజ్‌మెంట్ కూడా కీలకం. కాబట్టి కష్టమైన ప్రశ్నతో టైమ్ వేస్ట్ చేసుకోకుండా సులువుగా ఉన్న వాటిని మొదటగా సాల్వ్ చేయాలి. దీంతో టైమ్ సేవ్ అవుతుంది.

AP Jobs 2022: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నాన్ టీచింగ్ ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల.. 

బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్ అనేది QA విభాగంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి ఇతర డైమెన్షన్స్ కూడా ఎంతో కీలకం. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితిలో పని చేసే సామర్థ్యం, ​​పరిశీలన నైపుణ్యం, డెసిషన్ మేకింగ్, ప్రశ్నలను గ్రహించే సామర్థ్యం వంటివి అలవర్చుకుంటే ఈజీగా ఈ విభాగంలో బెస్ట్ స్కోర్ సాధించవచ్చు.

Computer Operator Jobs : కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలిలా..

అలాగే ఈ సెక్షన్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ను దశల వారీగా స్వాల్ చేయడానికి ప్రయత్నించాలి. దీంతో టైమ్ సేవ్ అవుతుంది. ముఖ్యంగా మూడు దశల్లో ప్రయత్నించాలి. మొదటి దశలో బేసిక్ అల్గారిథమ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు ఉంటాయి. వీటిని ముందుగా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రెండో దశ ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించినది. అంటే ప్రశ్నకు తగ్గట్టు ఏం అవసరమో గుర్తించాల్సి ఉంటుంది. మూడో దశ‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ముందు ఆబ్జర్వేషన్ లేదా ఎక్స్‌ట్రీమ్ కేసెస్ అనాలసిస్ ద్వారా ఆన్సర్‌కు సంబధించిన ఆప్షన్ ఎలిమినేషన్ అవకాశాలను అన్వేషించాలి. ఈ నైపుణ్యాల సెట్‌ను అలవరచుకోవడానికి అభ్యర్థులు నిరంతరం కఠినమైన ప్రాక్టీస్ చేస్తుండాలి.

First published:

Tags: Aptitude, Career and Courses, Cat, JOBS

ఉత్తమ కథలు