ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (Indian Institute of Management) లో ప్రవేశం పొందడం అనేది చాలా మంది విద్యార్థుల కల, ముఖ్యంగా ఎంబీఏ డిగ్రీ కోసం ఎదురుచూస్తున్న వారికి అందులో చేరడం ఓ ఆశయంలా ఉంటుంది. ఇందులో ప్రవేశం పొందడానికి కామన్ అడ్మిషన్ టెస్ట్ (Common Admission Test) పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష దేశంలో నిర్వహించే కఠిన పరీక్షల్లో ఒకటి. అయితే ఒక్క పరీక్ష మాత్రమే ఐఐఎంలో చేరాడనికి సరిపోదు. పరీక్ష అనంగతరం వ్రిటన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (WAT), గ్రూప్ డిస్కషన్ (GD) మరియు పర్సనల్ ఇంటర్వ్యూ (PI) లో కూడా విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రాయకుంటే ఇక ఐఐఎంలో ప్రవేశం లేనట్టే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అలాంటిదేం లేదు క్యాట్ కాకుండా ఐఏఎంలో చేరేందుకు ఇతర పరీక్షలూ ఉన్నాయి.
క్యాట్ కాకుండా ఇతర మార్గాలు..
ఒక వేళ క్యాట్ రాయకుంటే ఐఐఎంలోకి ప్రవేశం లేనట్టేనా.. క్యాట్ ఉత్తీర్ణత సాధించకుంటే టాప్ బిజినెస్ స్కూల్లో చేరాలనే కళ వదిలేయాల్సిందేనా.. ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. IIM లో చేరడానికి CAT పరీక్ష మాత్రమే మార్గం కాదు. ఐఐఎంల వివిధ ప్రోగ్రామ్లలో ప్రవేశం పొందడానికి మీకు సహాయపడే GMAT మరియు JIPMAT పరీక్షలు ఉన్నాయి.
Skill Development : నిరుద్యోగులకు శుభవార్త.. తక్కువ ఫీజుతో స్కిల్స్ కోర్సుల్లో శిక్షణ
మీరు 12 వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఈ పరీక్షలను తీసుకోవచ్చు. IIM లో భాగం కావాలనుకునే విద్యార్థులు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (GMAT) లో కూడా పాల్గొనవచ్చు. GMAT స్కోర్లను 200 కి పైగా ప్రోగ్రామ్లు మరియు 140 బిజినెస్ స్కూల్స్ ఆమోదిస్తున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, కోల్కతా, ఇండోర్, కోజికోడ్, లక్నోతో సహా ఇతర విద్యాసంస్థల్లో ఈ స్కోర్ల ఆధారంగా విద్యార్థులు ప్రవేశం పొందవచ్చు.
ఇంటర్ తర్వాత నేరుగా చేరొచ్చు..
విద్యార్థులు ఐఐఎం (IIM) లలో ప్రవేశం పొందేందుకు కచ్చితంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్ అవ్వగానే చేరొచ్చు. దేశంలోని టాప్ న్స్టిట్యూట్లు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (Integrated Program in Management) కూడా ఇంటర్ తర్వాత ఈ కోర్సును అందించే అవకాశం ఉంటుంది. ఈ కోర్సును ఇంటర్ అయిపోగానే పొందవచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు పొందడానికి దేశంలో ఉన్న ఐఐఎం జమ్మూ, ఐఐఎం బోధగయ, ఐఐఎమ్ రోహ్తక్, ఐఐఎం ఇండోర్. కోర్సులో ప్రవేశాలు పొందడానికి, విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ టెస్ట్ (JIPMAT) పాస్ అవ్వాలి.
NEET 2021 : నీట్ టాప్ 10 కాలేజీలు ఇవే.. వాటి ప్రవేశాలకు కట్ ఆఫ్ వివరాలు తెలుసుకోండి
ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి..
ప్రముఖ ఐఐఎం (IIM)లు కూడా ఆన్లైన్లో కూడా కోర్సులు చేసే అవకాశాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా బిజినెస్ కోర్సు సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. ఇలా ఆన్లైన్లో కోర్సు చేయాలనుకొన్నవారు. Coursera, edX ఈ లర్నింగ్ ప్లాట్ ఫాంలను సందర్శించాలి. అంతే కాకుండా దాదాపు అన్ని ఐఐఎం అధికారిక వెబ్సైట్లలో కూడా ఆన్లైన్ కోర్సులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆ కోర్సుల్లో నమోదు చేసుకొని ఇంటి నుంచే ఏడాది కోర్సులను పూర్తి చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cat, EDUCATION, Exams, Online Education