Home /News /jobs /

CAT NOT NEEDED APPLICATIONS OPEN AT IIM CALCUTTA FOR BUSINESS ANALYTICS COURSE HERE FULL DETAILS NS GH

IIM Calcutta: CAT అవసరం లేని మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం.. బిజినెస్ అనలిటిక్స్ కోర్సుకు IIM కలకత్తా దరఖాస్తుల ఆహ్వానం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బిజినెస్ అనలిటిక్స్ కోర్సును (Business Analytics Course) ఆఫర్ చేస్తోంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) కలకత్తా. సీనియర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (SMPBA) కోర్సు నెక్స్ట్ బ్యాచ్‌కు సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఇంకా చదవండి ...
మేనేజ్‌మెంట్‌ విభాగంలో కెరీర్‌ (Career) సెట్ చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. CAT ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండానే బిజినెస్ అనలిటిక్స్ కోర్సును (Course) (Business Analytics Course) ఆఫర్ చేస్తోంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) కలకత్తా. సీనియర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (SMPBA) కోర్సు నెక్స్ట్ బ్యాచ్‌కు సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 9 నెలల డ్యూరేషన్ ఉండే ఈ కోర్సును ఎరుడిటస్‌ (Eruditus) అనే ఆన్‌లైన్ ఎడ్ టెక్ ప్లాట్‌ఫాం సాయంతో అందించనుంది. బిజినెస్ డిసిజన్స్ కోసం డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించాలనుకునే మీడియం, హై లెవల్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం, స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనే వ్యక్తుల కోసం ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ బ్యాచ్ కోసం అప్లికేషన్లు మార్చి 30 వరకు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని ఐఐఎం కలకత్తా కోరింది.

రెగ్యులర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్ మాదిరిగా కాకుండా, ఈ కోర్సు కోసం అభ్యర్థులు కామన్ అడ్మిషన్స్ టెస్ట్ (CAT) క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విభాగంలో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు, ఈ స్ట్రీమ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో మూడు ఆన్-క్యాంపస్ ఇమ్మర్షన్స్ ఉన్నాయి. లైవ్ ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ సెషన్స్, రియల్ వరల్డ్ కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, సిమ్యులేషన్స్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ గెస్ట్ స్పీకర్స్ ఉంటాయి.
IGNOU: సామాజిక సేవను ఉద్యోగంగా మార్చే కోర్సు... మీరూ ఆన్‌లైన్‌లో చేయొచ్చు

SMPBA ప్రోగ్రామ్.. బిజినెస్ అనలిటిక్స్ యాస్పెక్ట్స్‌ను టెక్నాలజీ ఓరియంటెడ్ యాస్పెక్ట్స్‌తో కలిపి అందిస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత.. IIM కలకత్తా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పూర్వ విద్యార్థుల హోదాకు అర్హులవుతారు. ఈ కోర్సు గురించి IIM కలకత్తా ప్రొఫెసర్ పీయూష్ మెహతా మాట్లాడారు. ప్రస్తుత బిజినెస్ ఎన్విరాన్‌మెంట్‌లో రిలవెంట్‌గా ఉండటానికి గత ఐదేళ్లలో చాలా సంస్థలు విశ్లేషణాత్మక సామర్థ్యాలపై దృష్టి పెట్టాయని చెప్పారు. మెరుగైన బిజినెస్ డిసిజన్స్ తీసుకోవడానికి, డేటా అనలిటిక్స్ టూల్స్‌ ద్వారా భవిష్యత్తు నిర్ణయాలను అంచనా వేయడానికి బిజినెస్ ఎనలిటిక్స్‌ను సంస్థలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని పేర్కొన్నారు.
IIT Madras: మొబైల్​ వైర్​లైస్​ నెట్​వర్క్​పై ఐఐటీ మద్రాస్​ ఆరు నెలల సర్టిఫికెట్​ కోర్సు.. అర్హత, కోర్సు వివరాలివే..

IIM కలకత్తా ప్రొఫెసర్ సైబల్ చటోపాధ్యాయ మాట్లాడుతూ.. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే సీనియర్ ఎక్స్‌పర్ట్స్‌కు ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం బిజినెస్, కార్పొరేట్ చట్టంలో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను కూడా IIM కలకత్తా అందిస్తుంది. ఈ కోర్సు ఫీజును రూ. 2 లక్షలుగా నిర్దేశించింది. దీనికి GST కూడా వర్తిస్తుంది. కార్పొరేట్ మేనేజర్స్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్, కార్పొరేట్ సెక్రటేరియల్ నిపుణులు, CAలు, CSలు, వ్యాపారవేత్తలకు ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CAREER, Career and Courses, EDUCATION, New course

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు