Home /News /jobs /

CAT 2021: గతేడాది కంటే టఫ్‌గా క్యాట్ ఎగ్జామ్.. కటాఫ్ 95 శాతానికి పైగా ఉండే అవకాశం!

CAT 2021: గతేడాది కంటే టఫ్‌గా క్యాట్ ఎగ్జామ్.. కటాఫ్ 95 శాతానికి పైగా ఉండే అవకాశం!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

CAT Exam 2021: క్యాట్ 2020తో పోల్చినప్పుడు ఇందులో ప్రశ్నల సంఖ్య తగ్గింది. వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ (VARC) సెక్షన్ లో మార్నింగ్ స్లాట్‌లో 24 ప్రశ్నలు ఉన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రెండు ప్రశ్నలు తగ్గాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ (RC) పాసేజ్‌లు గతేడాది పేపర్‌ల మాదిరిగానే నాలుగు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
ఐఐఎం (IIM)లు, ప్రముఖ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(Common Admission Test) నిర్వహిస్తుంటారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ క్యాట్‌ ద్వారా కేవలం వేలలోనే సీట్లు కేటాయిస్తారు కాబట్టి పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏటా లక్షల మంది రాసే ఈ పరీక్ష (Exam)లో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టం. ఈసారి నవంబర్ 28న క్యాట్ 2021 పరీక్షను నిర్వహించారు. క్యాట్ 2020తో పోల్చినప్పుడు ఇందులో ప్రశ్నల సంఖ్య తగ్గింది. వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ (VARC) సెక్షన్ లో మార్నింగ్ స్లాట్‌లో 24 ప్రశ్నలు ఉన్నాయి. గత ఏడాది పోల్చుకుంటే ఈసారి రెండు ప్రశ్నలు తగ్గాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ (Reading Comprehension) పాసేజ్‌లు గతేడాది పేపర్‌ల మాదిరిగానే నాలుగు ఉన్నాయి. అయితే ఈ సెక్షన్ లో గతేడాది 18 ప్రశ్నల ఉంటే ఈసారి 16 ప్రశ్నలే ఉన్నాయి. క్యాట్ 2020తో పోల్చినప్పుడు క్యాట్ 2021 మార్నింగ్ స్లాట్‌లో ప్రశ్నాపత్రం కాస్తా డిఫికల్ట్ గా ఉందని T.I.M.E అకడమిక్ హెడ్ ప్రదీప్ పాండే చెప్పారు.

క‌టాఫ్ వివ‌రాలు..
బైజూస్‌ (BYJU's) ప్రకారం, డేటా ఇంటర్‌ప్రెటేషన్ & లాజికల్ రీజనింగ్ (DILR), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (QA) సెక్షన్ డిఫికల్టీ లెవెల్ మోస్తరుగా ఉండగా.. VARC సెక్షన్ డిఫికల్టీ లెవెల్ నార్మల్‌గానే ఉంది. వీఏఆర్సీ (VARC) సెక్షన్ లో కట్-ఆఫ్ 50-53 మధ్య ఉంటుందని బైజూస్‌ అంచనా వేసింది. డీఐఎల్ఆర్ (DILR) సెక్షన్ లో కట్-ఆఫ్ 40-45గా, క్యూఏ(QA)లో కట్-ఆఫ్ 43-46 మార్కుల మధ్య ఉంటుందని అంచనా. మొత్తం మీద కటాఫ్ అనేది 124-132 మధ్య ఉంటుందని..

DCCB Recruitment 2021: క‌డ‌ప‌ డీసీసీబీలో 75 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, జీతం వివ‌రాలు


అగ్రశ్రేణి బీ-స్కూల్స్ కట్-ఆఫ్ దాదాపు 95-99 పర్సంటైల్ గా ఉండవచ్చని బైజూస్‌ అంచనా వేయడం గమనార్హం. 95-99 పర్సంటైల్ సాధించిన వారికే టాప్ బిజినెస్ స్కూళ్ల (Top Bussiness Schools) లో ప్రవేశాలు లభిస్తాయంటే.. ఈసారి ఎంతటి టఫ్ పోటీ నెలకొందో అర్థం చేసుకోవచ్చు.

షార్ట్ లెంగ్త్, సాధారణ కాంప్రహెన్షన్ కారణంగా వెర్బల్ ఎబిలిటీ సెక్షన్ లో PFQ లలో రెండు మూడు ప్రశ్నలు ఈజీగా ఉన్నాయని పాండే చెప్పారు. ఈసారి రీడింగ్ కాంప్రహెన్షన్ (RC) పాసేజ్‌లు సాల్వ్ చేయడం చాలా కష్టంగా ఉందని అన్నారు. ఒక్క పాసేజ్‌ ఆన్సర్ చేయడం కూడా చాలా కష్టంగా మారిందని.. ఎందుకంటే ప్రతి ప్యాసేజ్ కూడా చదవడానికే చాలా కష్టంగా ఉందని ఆయన వివరించారు. OMO ప్రశ్నలు మరింత టఫ్ గా ఉన్నాయని కానీ ఇవి non-McQలు కావడంతో విద్యార్థులు గెస్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చన్నారు.

BEL Recruitment 2021: "బెల్‌"లో రిసెర్చ్ స్టాఫ్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు,అప్లికేష‌న్ ప్రాసెస్‌


గత సంవత్సరం కంటే వీఏఆర్సీ సెక్షన్ ఈజీగా ఉండగా మార్నింగ్ స్లాట్‌లోని డీఐఎల్ఆర్ సెక్షన్ గత సంవత్సరం పేపర్‌తో పోలిస్తే కష్టంగా ఉందని బైజూస్‌ తెలిపింది. క్యాట్ 2020 లాగా ఐదు సెట్‌లకు బదులుగా ఇప్పుడు నాలుగు సెట్‌లు మాత్రమే ఉండటం వల్ల కొంతమందికి ఇది మరింత ఛాలెంజింగ్ గా అనిపించి ఉండవచ్చు. సెట్‌లోని రెండు ప్రశ్నలను కాస్త ఈజీగా పరిష్కరించగలిగినప్పటికీ, మిగిలిన రెండు ప్రశ్నలను సాల్వ్ చేయడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. బార్ గ్రాఫ్‌లపై ప్రశ్నలు CAT LRDI పేపర్‌లలో అత్యంత సులభమైనవి. గణిత, బీజగణితం(ఆల్జీబ్రా) నుంచి ఎక్కువ ప్రశ్నలతో క్వాంట్ సెక్షన్ ప్రశ్నలు పెద్దగా ఉన్నాయి. త్రిభుజం, ట్రెపీజియం నుంచి కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అయితే బీజగణితం సెక్షన్ కష్టంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి.
Published by:Sharath Chandra
First published:

Tags: EDUCATION, Exams, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు