CAT 2021 Cut-off: క్యాట్ 2021 రిజల్ట్ ఫైనల్ ఆన్సర్ కీ పై ఆధారపడి ఉంటుంది. మార్కుల ఆధారంగా ప్రీమియం ఐఐఎంలతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బిజినెస్ స్కూళ్లలో ప్రవేశం పొందేందుకు అభ్యర్థులు అర్హత సాధిస్తారు. అయితే ఈ ఏడాది క్యాట్ కటాఫ్ తగ్గే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ విద్యాసంస్థల్లో మేనేజ్మెంట్ విద్య కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష క్యాట్-2021 (Common Aptitude Test) ఇటీవలే పూర్తయింది. త్వరలోనే ఈ ఎగ్జామ్ కు సంబంధించిన సమాధానాల 'కీ' (Answer Key) ని విడుదల చేయనున్నారు. డిసెంబరు రెండో వారంలో ఆన్సర్ కీ వచ్చే అవకాశముందని నివేదికలు స్పష్టం చేశాయి. దీని ఆధారంగానే విద్యార్థులు తమ స్కోర్లను అంచనా వేసుకుంటారు. అంతేకాకుండా కీ విడుదలైన తర్వాత విద్యార్థులు తమ అభ్యంతరాలను తెలిపేందుకు ఓ విండోను అందిస్తారు. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది సమాధానాలతో కూడిన 'ఫైనల్ కీ' (Final Key)ని విడుదల చేస్తారు. క్యాట్ 2021 రిజల్ట్ ఫైనల్ ఆన్సర్ కీ పై ఆధారపడి ఉంటుంది. మార్కుల ఆధారంగా ప్రీమియం ఐఐఎంలతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బిజినెస్ స్కూళ్ల (Business Schools) లో ప్రవేశం పొందేందుకు అభ్యర్థులు అర్హత సాధిస్తారు.
అయితే ఈ ఏడాది క్యాట్ కటాఫ్ (CAT Cut off) తగ్గే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. "గత సంవత్సరంతో పోలిస్తే పరీక్షలో తక్కువ ప్రశ్నలు వచ్చాయి. తక్కువ ఆఫ్షన్ల వల్ల పేపర్ కష్టంగా వచ్చింది. VARC, LRDI సెట్స్ లోని సుదీర్ఘ ప్యాసేజులు ఎక్కువ సమయం తీసుకున్నాయి. దీని వల్ల కటాఫ్ తగ్గే అవకాశముంది. ప్రతి విభాగంలో మినిమం పర్సంటైల్ కటాఫ్ స్కోర్ దాదాపు 85 శాతం ఉండవచ్చు." అని టైమ్ సీనియర్ రీజనల్ హెడ్ అమిత్ పొద్దార్ తెలిపారు.
అన్ రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులకు ఐఐఎం అహ్మదాబాద్ (IIM Ahmadabad) లో సీటు రావాలంటే 80 పర్సంటైల్, ఐఐఎం బెంగళూరుకు 85, ఐఐఎం కోజికోడ్‌కు 60 పర్సంటైల్ కటాఫ్ ఉంటుందని కాలేజ్ దిశ ఇన్స్టిట్యూట్ సహా వ్యవస్థాపకులు దిలీప్ జైస్వాల్ అన్నారు. ఐఐటీ దిల్లీ, ఐఐటీ మద్రాస్ (IIT Madras) మేనేజ్మెంట్ స్కూల్స్‌లో అయితే 95 శాతం కటాఫ్ ఉంటుందని ఆయన చెప్పారు.
ఎస్పీ జైన్, ఎండీఐ, ఎఫ్ఎంఎస్ లాంటి అగ్రశ్రేణి బీ స్కూల్స్ లో అడ్మిషన్ పొందాలంటే కటాఫ్ మార్కులను కనీస అవసరంగా పరిగణిస్తారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 95 పర్సంటైల్‌కు మించి కటాఫ్ ఉండవచ్చు. ఐఎంటీ, ఐఎంఐ, ఎక్స్ఐఎం, డీఎస్ఈ లాంటి కళాశాలలో, కొన్ని ఐఐటీల్లో ఇంటర్వ్యూ (Interview) కాల్స్ కోసం దాదాపు 90 పర్సంటైల్ కటాఫ్ అవసరం.
తక్కువ స్కోర్లు వచ్చినవారికి ఉండే ఆప్షన్లు..
ఎవరికైనా 85 పర్సంటైల్ రేంజ్ కటాఫ్ స్కోరు ఉంటే.. వారు FORE, GLIM, TAPMI, LBS, IMT NAGPUR, BIMTECH, IFMR, LIBA లాంటి కళాశాలలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 నుంచి 70 పర్సంటైల్ స్కోర్ ఉన్నవారు ఇతర ఎంబీఏ ప్రవేశ పరీక్షలైన SNAP, NMAT, CMAT లాంటి వాటిలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అమిత్ పొద్దార్ అన్నారు.
ఐఐఎంలలో మొత్తం 5100 సీట్లు అందుబాటులో ఉంటాయి. కానీ 2,31,000 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారని రిక్స్ యూనివర్సిటీ ఆచార్యులు అనుపమ్ సక్సేనా తెలిపారు. అంటే కేవలం 2.21 శాతం మంది మాత్రమే సక్సెస్ అవుతారని, ఎవరైనా క్యాట్ లో బాగా స్కోర్ చేయలేకపోతే వారు ప్రత్యామ్నాయ ఆప్షన్ల గురించి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎంబీఏ ప్రోగ్రామ్స్ భారత్ లో ఉన్నాయని, అంతేకాకుండా విదేశాల్లో చదువుకోవడం ఖర్చే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరమని ఆయన అన్నారు. కాబట్టి భారత్ లో చాలా కోర్సులు ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పారు. క్యాట్ 2021 ఎగ్జామ్‌ను దేశవ్యాప్తంగా 156 నగరాల్లో 438 పరీక్షా కేంద్రాల్లో నవంబరు 28న నిర్వహించారు. మూడు షిఫ్టుల్లో జరిగిన ఈ పరీక్షకు 2.30 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఇందులో 83 శాతం అంటే 1.92 లక్షల మంది హాజరయ్యారు. 35 శాతం మహిళలు కాగా.. 65 శాతం పురుషులు ఇందులో ఉన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.