ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్( IIM)లో ఎంబీఏ(MBA) చేయడం చాలా మంది విద్యార్థుల కల. ఇందుకోసం జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT)కు హాజరు కావాల్సి ఉంటుంది. ముందుగా రాతపూర్వక ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో(Aptitude Test) ఉత్తీర్ణత సాధించాలి. ఆ తరువాత గ్రూప్ డిస్కషన్(Group Discussion), పర్సనల్ ఇంటర్వ్యూ(Personal Interview) ఉంటుంది. ఈ స్టేజీలను దాటిన తరువాత ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దేశంలోని అగ్రశ్రేణి బిజిసెస్ స్కూల్స్‌ల్లో ప్రవేశించడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాం.
ZipMat
జిప్‌మ్యాట్... దేశంలోని అత్యుత్తమ బిజినెస్ స్కూల్లో చేరాలనే లక్ష్యం ఉన్న విద్యార్థులు, ఐఐఎమ్‌లలో ప్రవేశం పొందేందుకు తమ గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేయడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని అగ్రశ్రేణి సంస్థలు 12వ తరగతి పూర్తయిన వెంటనే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (IPM) కోర్సులను అందిస్తున్నాయి. ఇది ఐదేళ్ల పాటు నిర్వహిస్తారు. ఏకకాలంలో రెండు డిగ్రీలను చేయవచ్చు. మేనేజ్మెంట్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు BBA ప్లస్ MBA డిగ్రీ సంవత్సరానికి ఐదు లేదా మూడు టర్మ్‌లతో ఉంటుంది.
IIM జమ్మూ, IIM బోద్ గయా, IIM రోహ్తక్, IIM ఇండోర్‌తో సహా అనేక IIMలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ కళాశాలల్లో అడ్మిషన్లు పొందడానికి విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ టెస్ట్ (జిప్‌మ్యాట్)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. గతంలో IIM ఇండోర్, రోహ్తక్ మాత్రమే JIPMAT ద్వారా ఇంటిగ్రేటెడ్ కోర్సు కోసం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేవారు. అయితే 2021లో IIM రాంచీ, జమ్మూ, బోధ గయా కూడా ఈ విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టాయి.
GMAT
ఒక ఏడాది పుల్టైం ఎంబీఏ ప్రోగ్రామ్ కోసం IIMలు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (GMAT) స్కోర్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తాయి. కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థులు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. స్కోర్ ఆధారంగా IIM అహ్మదాబాద్, IIM బెంగళూరు, కోల్‌కతా, ఇండోర్, కోజికోడ్, లక్నో తదితర ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ తీసుకోవచ్చు.
ఆన్లైన్ కోర్సులు
ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా కొన్ని ఐఐఎంలు విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఆన్లైన్ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. Coursera, edX వంటి ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లను సందర్శించడం లేకపోతే IIMల అధికారిక వెబ్సైట్లను పరిశీలించి ఈ కోర్సుల కోసం పేరును నమోదు చేసుకోవచ్చు. ఇలాంటి కోర్సులు ఏడాది పొడవునా నిర్వహిస్తుంటారు. ప్రధానంగా IIM కలకత్తా ద్వారా మేనేజ్మెంట్ సైన్స్, IIM అహ్మదాబాద్ ద్వారా మానవ వనరుల నిర్వహణ, IIM జమ్మూ ద్వారా మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులను అందిస్తున్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.