CAT 2022: దేశంలోని టాప్ మేనేజ్మెంట్ స్కూల్స్‌లో అడ్మిషన్ కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్- CAT 2022కు అంతా సిద్ధమైంది. ఇండియాలోని ఐఐఎంలతో పాటు బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి ఈ పరీక్ష ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను(Entrance Exam) రేపు, అంటే నవంబర్ 27న నిర్వహించనున్నారు. ఈసారి పరీక్షను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- బెంగళూరు(IIM Bangalore) నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా 151 నగరాల్లో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
క్యాట్ ఎగ్జామ్ మొత్తం మూడు షిఫ్టుల్లో జరుగుతుంది. మొదటి స్లాట్ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, తదుపరి స్లాట్ మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, చివరిది సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు జరుగుతుంది. అభ్యర్థులకు పంపిన SMS, ఇ-మెయిల్లో పేర్కొన్న రిపోర్టింగ్ టైమ్ ప్రకారం ఎగ్జామ్ సెంటర్లో రిపోర్ట్ చేయాలి. మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాసేవారు ఉదయం 8:15 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌కు మధ్యాహ్నం 12:15 గంటలకు, సాయంతం సెషన్‌కు 4:15 గంటల లోపు సెంటర్‌కు చేరుకోవాలి.
వీటికి నో ఎంట్రీ
ఎగ్జామ్ ల్యాబ్‌లోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇతర నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వాచ్‌లు, కాలిక్యులేటర్లు, సొంత స్టేషనరీ, పెన్నులు, వాలెట్లు, గాగుల్స్‌ను కూడా తీసుకెళ్లకూడదు. ఎగ్జామ్ ల్యాబ్ లోపల అభ్యర్థులు ఎలాంటి ఆభరణాలు ధరించకూడదు. పొడవాటి హై హీల్స్ ఉన్న చెప్పులు, పెద్ద బటన్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. లేదంటే ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనుమతించరు. CAT 2022 పరీక్షను ఒకటి కంటే ఎక్కువసార్లు రాయడానికి అవకాశం లేదు. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షకు హాజరైనట్లు తేలితే, వారి అభ్యర్థిత్వం రద్దు అవుతుంది.
ఎగ్జామ్ సెంటర్‌కు ఏమేం తీసుకెళ్లాలి?
- అభ్యర్థులు అడ్మిట్ కార్డులను తప్పనిసరిగా ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. iimcat.ac.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని హార్డ్ కాపీని A4 పేపర్‌పై ప్రింట్ చేయాలి.
- అడ్మిట్ కార్డ్‌పై అభ్యర్థి ఫోటో, సంతకం, ఇతర వివరాలు సరిగ్గా ప్రింట్ కాకపోతే, దాన్ని ఎగ్జామ్ సెంటర్లో ఆమోదించరు. ఇవన్నీ ముందే చెక్ చేసుకోవాలి. అప్లికేషన్ టైమ్‌లో అప్లోడ్ చేసిన ఫోటోను, అడ్మిట్ కార్డుపై అందించిన స్పేస్‌లో అతికించి వెరిఫికేషన్ కోసం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- ఎగ్జామ్ సెంటర్లో అభ్యర్థులకు ఒక పెన్ను, ఒక స్క్రైబుల్ ప్యాడ్ ఇస్తారు. పరీక్ష అయిపోయిన తర్వాత అడ్మిట్ కార్డ్‌తో పాటు పెన్, స్క్రైబుల్ ప్యాడ్ అన్ని పేజీలను బాక్సుల్లో వేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Cat admit