Home /News /jobs /

CAT 2022 REGISTRATIONS STARTED KNOW HOW TO GET ADMISSION IN TOP BUSINESS SCHOOLS WITHOUT CAT BA GH

CAT 2022 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అర్హత, డాక్యుమెంట్స్ వివరాలు.. క్యాట్ లేకుండా బిజినెస్ స్కూల్‌లో చేరడానికి మార్గాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంట్రన్స్ కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)- 2022 కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు (IIM Banglore) ఈ ప్రక్రియను ప్రారంభించింది.

మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంట్రన్స్ కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)- 2022 కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు (IIM Banglore) ఈ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14, 2022 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా, క్యాట్ పరీక్ష నవంబర్ 27న జరగనుంది.

క్యాట్-2022 అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస క్యుములేటివ్ గ్రేడ్ 50 శాతం ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే 45 శాతం ఉండాలి. CAT కోసం దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి లేదు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్-2022 అర్హత ప్రమాణాలు లేని అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. ముందుగా వారికి మాత్రమే.. ఇలా చేస్తే చాలు !



దరఖాస్తుకు అవసరమయ్యే డాక్యుమెంట్స్
క్యాట్-2022 రిజిస్ట్రేషన్ ఫారమ్ పూరించడానికి ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం, వ్యక్తిగత సమాచారం, అకడమిక్ సమాచారం, పేమెంట్ వివరాలు.. వంటి డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.

TCS Internship: బీటెక్ విద్యార్థులకు అలర్ట్... టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్... అప్లై చేయండిలా


రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత అప్లికేషన్ ఫారమ్‌ను ఎడిట్ చేయడానికి ఐఐఎం బెంగళూరు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ఎడిట్ విండో ఆప్షన్‌‌కు సమయం కేటాయించనుంది. స్కాన్ చేసిన ఫొటో, సంతకం లేదా క్యాట్ పరీక్షా కేంద్రం ప్రాధాన్యతలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎడిట్ చేయవచ్చు. అంతేకాకుండా ఎగ్జామ్ సిటీ సెలక్షన్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా సైన్ ఇన్ చేసి, అవసరమైన ఇమేజ్ సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది.

IIT Madras:విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ బంపర్ ఆఫర్.. డేటా సైన్స్ లో కొత్త కోర్సులు.. ఇది చదివితే జాబ్ గ్యారెంటీ!



కాగా, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో క్యాట్ నిర్వహిస్తారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్, దేశంలో ఉన్న బిజినెస్ స్కూల్స్ ప్రతి ఏటా క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎమ్స్ తోపాటు ఎస్‌పీజేఐఎంఆర్, ఐఐటీస్, ఐఎంఐ, ఎండీఐ, జేబీఐఎంఎస్, ఎఫ్‌ఎంఎస్ వంటి టాప్ ఎంబీఏ కాలేజీలు, 1000 కంటే ఎక్కువగా ఉన్న బిజినెస్ స్కూల్స్ కోసం ప్రతి ఏడాది క్యాట్‌ను నిర్వహిస్తారు. 

ఐఐఎంలలో ఎంబీఏ చేయడం చాలా మంది విద్యార్థుల కల. ఇందుకు క్యాట్‌‌ క్వాలిఫై కావడం తప్పనిసరి. అయితే దేశంలోని టాప్ బిజినెస్ స్కూల్స్‌లో క్యాట్‌తో సంబంధం లేకుండా ప్రవేశం పొందవచ్చు. కొన్ని టాప్ బి- స్కూల్స్ 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (IPM)ను కూడా అందిస్తున్నాయి. ఐదేళ్ల పాటు ఈ కోర్సులను చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు రెండు డిగ్రీలను పొందడానికి అవకాశం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ద్వారా BBA ప్లస్ MBA డిగ్రీని కూడా పూర్తిచేయవచ్చు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు