Home /News /jobs /

CAT 2022 NOTIFICATION RELEASE IN JULY MBA ENTRANCE EXAM HELD BY NOVEMBER UMG GH

CAT 2022: ఈ నెలలోనే క్యాట్ ఎగ్జామ్ నోటిఫికేషన్.. పరీక్షలు మాత్రం అప్పుడే..!!

క్యాట్ 2022 (ప్రతీకాత్మక చిత్రం)

క్యాట్ 2022 (ప్రతీకాత్మక చిత్రం)

ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM)లతో పాటు టాప్ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాల కోసం కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందే పరీక్షను నిర్వహించే సంస్థ పేరును ప్?

ఇంకా చదవండి ...
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM)లతో పాటు టాప్ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాల కోసం కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందే పరీక్షను నిర్వహించే సంస్థ పేరును ప్రకటించనున్నారు. క్యాట్- 2022 పరీక్ష నవంబర్‌ చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. అయితే ఏ తేదీన పరీక్ష జరుగుతుంది అనేది నోటిఫికేషన్ విడుదలైన తరువాత తెలుస్తుంది. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

CAT- 2022 నోటిఫికేషన్ జులై చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా CATను ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకత్తా, ఐఐఎం లక్నో, ఐఐఎం కోజికోడ్, ఐఐఎం ఇండోర్ రొటేషనల్ పద్దతిలో నిర్వహిస్తున్నాయి. అయితే ఐదేళ్ల విరామం తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌ గతేడాది ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. దీనిబట్టి CAT -2022 నిర్వహణ బాధ్యతను ఈసారి ఐఐఎం బెంగళూరు లేదా ఐఐఎం లక్నోకు ఇవ్వవచ్చు. కాగా, ఐఐఎం బెంగళూరు చివరిసారిగా 2016లో CATను నిర్వహించగా, ఐఐఎం లక్నోలో 2017లో చేపట్టింది.

ఇదీ చదవండి: నీట్ ఎగ్జామ్ వాయిదాకు డిమాండ్.. విద్యాశాఖ మంత్రి స్పందన ఏంటంటే..?


* గత పదేళ్లలో క్యాట్‌ను నిర్వహించిన ఐఐఎంల జాబితా

2021 - ఐఐఎం అహ్మదాబాద్
2020 - ఐఐఎం ఇండోర్
2019 - ఐఐఎం కోజికోడ్
2018 - ఐఐఎం కలకత్తా
2017 - ఐఐఎం లక్నో
2016 - ఐఐఎం బెంగళూరు
2015 - ఐఐఎం అహ్మదాబాద్
2014 - ఐఐఎం ఇండోర్
2013 - ఐఐఎం ఇండోర్
2012 - ఐఐఎం కోజికోడ్
2011 - ఐఐఎం కలకత్తా

గతేడాది క్యాట్‌ పరీక్షలో సవరణలు చేశారు. ఆ ప్రకారం.. క్యాట్-2022లో మొత్తం 66 ప్రశ్నలను మూడు సెక్షన్‌లుగా విభజించే అవకాశం ఉంది. మొదటి సెక్షన్‌గా వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రెహెన్షన్ (VARC), రెండో సెక్షన్‌గా డేటా ఇంటర్‌ప్రెటేషన్ & లాజికల్ రీజనింగ్ (DILR), ఇక చివరి మూడో సెక్షన్‌లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ (QA) నుంచి ప్రశ్నలు వస్తాయి. క్యాట్ ప్రవేశ పరీక్షలో MCQ, నాన్-MCQ ప్రశ్నలు ఉంటాయి. దీన్ని కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు కాగా, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తీసివేస్తారు.



ఐఐఎంలు మాత్రమే కాకుండా ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్... ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఐఐటీల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు, SPJIMR (ముంబై)తో సహా, ఇతర ప్రముఖ ప్రైవేట్ కాలేజీలు కూడా క్యాట్ ఆధారంగా అడ్మిషన్లను చేపడుతున్నాయి.

మరోవైపు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఉదయ్‌పూర్, ఇటీవల వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (PGDBA-WE) ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఈ కోర్సు 20-నెలల పాటు జరగనుంది. ఈ కోర్సు ద్వారా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు కనీసం మూడు సంవత్సరాల పుల్- టైమ్ పోస్ట్-క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఈ కోర్సు వారాంతాల్లో ఆన్‌లైన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. అలాగే ప్రతి రెండు వారాలకోసారి ఆన్-క్యాంపస్ మాడ్యూల్స్‌లో తరగతులు ఉంటాయి.
Published by:Mahesh
First published:

Tags: Cat, Entrance exams, JOBS, Mba

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు