ఇండియాలోని టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ కోసం ఏటా కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) నిర్వహిస్తుంటారు. ఈ ఎగ్జామ్‌ను ప్రతి సంవత్సరం ఒక్కో ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తుంది. ఈసారి టెస్టును ఐఐఎం బెంగళూరు నిర్వహిస్తోంది. అయితే CAT- 2022కి ప్రిపేర్ అవుతున్న వారికి ఒక లేటెస్ట్ న్యూస్ చెప్పింది ఈ సంస్థ. ఈ ఏడాది ఎంబీఏ ఎంట్రన్స్‌కు రిజిస్టర్ చేసుకున్న వారికి క్యాట్ మాక్ టెస్ట్ పేపర్లను విడుదల చేసినట్లు ప్రకటించింది. అభ్యర్థులు iimcat.ac.in అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ID, పాస్వర్డ్ సాయంతో మాక్ టెస్ట్ పేపర్‌ను యాక్సెస్ చేయవచ్చు.
‘గత సంవత్సరం ఎగ్జామ్ ప్యాట్రన్ ఆధారంగా మాక్ టెస్ట్ సిద్ధం చేశాం. నాన్-పీడబ్ల్యుడీ అభ్యర్థికి, మూడు విభాగాలకు 40 నిమిషాలు చొప్పున మొత్తం 120 నిమిషాలు ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. CAT 2022 ఎగ్జామ్ పూర్తి ప్యాట్రన్‌ను రివీల్ చేయడం ఈ మాక్ టెస్ట్ లక్ష్యం కాదు. అసలు పరీక్షలో ఇలాంటి ప్రశ్నలు ఉండొచ్చు, ఉండకపోవచ్చని అభ్యర్థులు గమనించాలి. పీడబ్ల్యుడీ అభ్యర్థులకు 40 నిమిషాల అదనపు సమయం ఉంటుంది’ అని అధికారిక నోటీసు పేర్కొంది.
SSC GD Constable Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 24వేల కానిస్టేబుల్ జాబ్స్ .. వయోపరిమితిపై కీలక నిర్ణయం
మాక్ టెస్ట్ ఎలా చెక్ చేయాలి..?
అభ్యర్థులు ముందు IIM CAT అధికారిక వెబ్సైట్ iimcat.ac.in ఓపెన్ చేయాలి. ఈ పోర్టల్‌లో CAT 2022 మాక్ టెస్ట్ లింక్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీ అప్లికేషన్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. క్యాట్ ఎగ్జామ్‌లో సాధారణంగా అడిగే వివిధ రకాల ప్రశ్నలను అభ్యర్థులకు పరిచయం చేయడం మాక్ టెస్ట్ లక్ష్యమని అధికారిక నోటీసు పేర్కొంది.
CAT మాక్ టెస్ట్ పేపర్లను అభ్యర్థులు సాల్వ్ చేయడం మంచిది. ఎందుకంటే వీటిలో మునుపటి సంవత్సరం పేపర్లలో అడిగిన ప్రశ్నలు ఉంటాయి. అందుకే వీటిని సాల్వ్ చేస్తే, అసలు ఎగ్జామ్‌లో అడిగే ప్రశ్నల రకం, సమాధానాలు రాసే పద్ధతిపై ఒక అవగాహన వస్తుంది. మీ స్కోరింగ్ సెక్షన్స్ ఏవో, ఎక్కడ వెనుకబడుతున్నారో గుర్తించి, వాటిపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. తద్వారా బెస్ట్ స్కోర్ సాధించవచ్చు. కాగా, CAT 2022 ఎగ్జామ్ నవంబర్ 27న, మూడు షిఫ్ట్‌లలో జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, ఆఖరి షిఫ్ట్ సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JOBS