విద్యార్థులు తమ కలలను నిజం చేసుకొనే మార్గంలో ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు కీలకం. మంచి ర్యాంకు సాధిస్తే ప్రతిష్ఠాత్మక కళాశాలలో ప్రవేశం పొందవచ్చు. అర్హత సాధించలేకపోతే మరి కొంతకాలం నిరీక్షించక తప్పదు. దేశంలోని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో ఎంబీఏ (MBA) ప్రవేశాల కోసం కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) నిర్వహిస్తారు. క్యాట్-2022 పరీక్ష ఇటీవల నవంబర్ 27న జరిగింది. ఐఐఎం బెంగళూరు క్యాట్-2022 పరీక్షను మూడు స్లాట్లలో సక్సెస్‌పుల్‌గా నిర్వహించింది. గత పదేళ్లలో క్యాట్‌ను నిర్వహించిన ఐఐఎంల జాబితా ఇలా ఉంది. 2021లో ఐఐఎం అహ్మదాబాద్, 2020- ఐఐఎం ఇండోర్, 2019- ఐఐఎం కోజికోడ్, 2018- ఐఐఎం కలకత్తా, 2017- ఐఐఎం లక్నో, 2016- ఐఐఎం బెంగళూరు, 2015- ఐఐఎం అహ్మదాబాద్, 2014- ఐఐఎం ఇండోర్, 2013- ఐఐఎం ఇండోర్, 2012- ఐఐఎం కోజికోడ్, 2011- ఐఐఎం కోల్కత్తా నిర్వహించాయి.
ప్రస్తుతం క్యాట్ అభ్యర్థులు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వారంలో క్యాట్-2022 ఆన్సర్ కీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఫలితాలు రానున్నాయి. అయితే ఇప్పటికే చాలా కోచింగ్ సెంటర్లు తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఆన్సర్ కీను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటి ఆధారంగా అభ్యర్థులు తమ ఫర్ఫార్మెన్స్‌పై ఓ అంచనాకు రావచ్చు. IMS ఇండియా ఎక్స్‌ఫర్ట్స్ రూపొందించిన చార్ట్ ఆధారంగా ఎక్స్పెక్టెడ్ పర్సంటైల్-బేస్డ్ కట్-ఆఫ్స్‌ను అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.
పర్మనెంట్‌గా ఇక వారానికి 3 రోజులు సెలవులు, 4 రోజులే పని.. ఈ కంపెనీలన్నీ ఓకే!
IMS ఇండియా నిపుణులు.. క్యాట్-2022కు సంబంధించిన స్లాట్-3పరీక్ష ముగియడానికి ముందే, స్లాట్-1, స్లాట్-2 కోసం కటాఫ్ పర్సంటైల్ చార్ట్‌ను సిద్ధం చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వారు దీన్ని రూపొందించారు. IMS ఇండియా అంచనా ప్రకారం.. ఓవరాల్ 101 స్కోర్ పొందిన అభ్యర్థులు 99.5వ పర్సంటైల్‌లో ఉంటారని, 91 స్కోర్ వచ్చిన వారు 99వ పర్సంటైల్‌లో ఉండే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన ఓ రిపోర్ట్‌ను కూడా NDTV వెల్లడించింది.
98వ పర్సంటైల్‌లో ఉన్నవారి ఓవరాల్ స్కోర్ 80గా ఉండే అవకాశం ఉందని, 95 పర్సంటైల్‌లో ఉన్నవారు 66 స్కోర్‌తో ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అత్యల్ప కటాఫ్ 80వ పర్సంటైల్‌గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందుకు విద్యార్థులు ఓవరాల్‌గా 40 మార్కుల స్కోర్ సాధించి ఉండాలి.
డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులకు గుడ్ న్యూస్? వారిపై ఎఫెక్ట్!
ప్రతి ఐఐఎం తన వెబ్సైట్లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచుతుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లెటర్లను సెండ్ చేస్తాయి. దీంతో క్యాట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు తదుపరి ఇంటర్వ్యూ రౌండ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఐఐఎంలు ఇంటర్వ్యూ చేసే సమయంలో అభ్యర్థులు తమ మార్కు షీట్లతో పాటు, వారి అర్హతకు సంబంధించి ప్రూఫ్‌గా అటెస్టెడ్ కాపీలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ తీసుకునే సమయంలో ధ్రువీకరణ కోసం ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, ప్రతి సెమిస్టర్‌కు సంబంధించిన మార్క్ షీట్లతో పాటు అటెస్టెడ్ కాపీలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.