MBA Admissions: ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరి కొందరు గేట్, క్యాట్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ల ద్వారా ఎంటెక్, ఎంబీఏ కోర్సుల్లో చేరుతున్నారు. ఇండియాలోని టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో ఎంబీఏ చేయాలని ఎక్కువ మంది కోరుకుంటారు. ఇందుకు జాతీయ స్థాయిలో ఏటా నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT) రాయాల్సి ఉంటుంది. అత్యంత కఠినమైన పరీక్షల్లో క్యాట్ ఒకటి. ఎగ్జామ్ రాసిన అందరికీ క్యాట్‌లో సీటు లభించకపోవచ్చు. అయితే వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. క్యాట్-2022 ఎగ్జామ్ నవంబర్ 27న జరిగింది. ఈ పరీక్షకు దాదాపు 2.3 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే క్యాట్ అర్హత లేకుండా ఇతర ప్రవేశ పరీక్షల ద్వారా కూడా మేనేజ్మెంట్ కాలేజీల్లో సీటు సాధించవచ్చు. కొన్ని ప్రతిష్ఠాత్మక ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు నిర్వహిస్తున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
IIFT-MBA
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(IIFT) ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం మేజ్మెంట్ ఆప్టిట్యూట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఢిల్లీ , కోల్కత్తా, కాకినాడలో మాత్రమే నిర్వహిస్తారు.
జేవియర్ అడ్మిషన్ టెస్ట్ (XAT)
XLRI జంషెడ్పూర్ అందిస్తున్న మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షగా జేవియర్ అడ్మిషన్ టెస్ట్ (XAT)ను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. డెసిషన్ మేకింగ్, వెర్బల్ & లాజికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ & డేటా ఇంటర్‌ప్రెటేషన్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 160 ఇతర మేనేజ్మెంట్ కాలేజీలు కూడా అడ్మిషన్స్ కల్పిస్తాయి.
SNAP
సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SNAP Test)ను సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్) యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ యూనివర్సిటీకి చెందిన 15 మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో MBA/PGDM కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ టెస్ట్‌ను నిర్వహిస్తారు. SNAP టెస్ట్‌లో జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్- డేటా ఇంటర్‌ప్రెటేషన్ & డేటా సఫిషియెన్సీ, ఎనలిటికల్ & లాజికల్ రీజనింగ్‌ను కవర్ చేస్తూ 60 ప్రశ్నలు ఉంటాయి.
Gujarat Polling : సైకిల్‌కు సిలిండర్ కట్టుకుని వెళ్లి ఓటు వేసిన ఎమ్మెల్యే
AIMA - MAT
మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) అనేది జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. ఆలిండియా మేనేజ్మెంట్ అసోషియేషన్(AIMA) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. దీనిద్వాఆర దేశవ్యాప్తంగా 600 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో MBA ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను కల్పిస్తారు.
AICTE- CMAT
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇన్స్టిట్యూట్లలో MBA కోర్సుల్లో జాయిన్ కావడానికి అర్హత పరీక్షగా కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT) నిర్వహిస్తారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Mba