హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Admit card Released: అభ్యర్థులకు అలర్ట్.. ఆ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల..

Admit card Released: అభ్యర్థులకు అలర్ట్.. ఆ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల..

Admit card Released: అభ్యర్థులకు అలర్ట్.. ఆ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల..

Admit card Released: అభ్యర్థులకు అలర్ట్.. ఆ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల..

CAT 2022 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు శుభవార్త. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM బెంగళూరు) కామన్ అడ్మిషన్ టెస్ట్ 2022 కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది.

  • Advertorial
  • Last Updated :
  • Telangana, India

CAT 2022 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు శుభవార్త. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM బెంగళూరు) కామన్ అడ్మిషన్ టెస్ట్ 2022 కోసం అడ్మిట్ కార్డ్‌ను(Admit Cards) విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి.. అభ్యర్థులు లాగిన్ పోర్టల్‌ని సందర్శించి, అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు CAT 2022 పరీక్షను 27 నవంబర్ 2022న నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 150 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షను మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్టు ఉదయం 8:30 నుంచి రాత్రి 10:30 వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, మూడో షిప్టు సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు జరుగుతాయి.

అభ్యర్థులు పరీక్షకు వెళ్లేటప్పుడు అడ్మిట్ కార్డును తీసుకెళ్లడం మర్చిపోవద్దని గుర్తుంచుకోవాలి. అడ్మిట్ కార్డు లేకుండా పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. IIMలు CAT 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను 3 ఆగస్టు 2022న ప్రారంభించాయి. ఇది 21 సెప్టెంబర్ 2022న ముగిసింది.

NTPC Recruitment 2022: 864 పోస్టులతో NTPC నుంచి నోటిఫికేషన్.. జీతం రూ. లక్షల్లో..

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా

Step 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inని సందర్శించండి

Step 2: తర్వాత అభ్యర్థి CAT 2022 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి

Step 3: ఆ తర్వాత CAT 2022 అప్లికేషన్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి అభ్యర్థిని లాగిన్ చేయండి

Step 4: తర్వాత CAT 2022 అడ్మిట్ కార్డ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

Step 5: ఇప్పుడు అభ్యర్థులు Next ఆప్షన్ పై క్లిక్ చేసి CAT 2022 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Step 6: చివరగా అభ్యర్థులు CAT 2022 పరీక్ష యొక్క అడ్మిట్ కార్డ్ నుండి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

బెస్ట్ స్కోర్ ఇలా..

దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో(Business Schools) ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT) నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది నవంబర్ 27న ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(Aptitude), కాంప్రహెన్షన్ రీడింగ్(Compression Reading) వంటివి కీలకమైన విభాగాలు. వీటిపై మంచి పట్టు ఉంటే క్యాట్‌లో టాప్ స్కోర్ సొంతం చేసుకోవచ్చు. ఈ పరీక్షకు కేవలం నెల రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో క్యాట్ ఎగ్జామ్‌లో బెస్ట్ స్కోర్ కోసం ప్రిపరేషన్ టిప్స్‌ పరిశీలిద్దాం.

వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్

ఈ సెక్షన్‌లో మంచి స్కోర్ చేయాలంటే క్రమం తప్పకుండా RC, VA ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తుండాలి. పాసేజ్‌లు చేయడం, పారా జంబుల్, పారా కంప్లీషన్, సమ్మరీ, క్రిటికల్ రీజనింగ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్ అనేవి ప్రిపరేషన్‌కు బేస్ కావాలి. బేసిక్ గ్రామర్, పదజాలం, పదబంధాలపై కొంచెం దృష్టి కేంద్రీకరించడం వల్ల రీడింగ్ స్పీడ్, అవగాహన స్థాయి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో ఈ సెక్షన్‌లో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది.

డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (DILR)..

ఈ సెక్షన్‌లో బెస్ట్ స్కోర్ కోసం రోజూ ప్రాక్టీస్ చేయాలి. అయితే టైమ్ బౌండ్‌లో ఆన్సర్ రాబట్టడం ముఖ్యం. అభ్యర్థులు లెటెస్ట్ ప్యాట్రన్ మాక్ టెస్ట్‌లను ఎక్కువ‌గా ప్రాక్టీస్ చేయాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు పరిష్కరించడానికి కఠినంగా ఉంటాయి. దీంతో ఇవి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి ఏమి ఇచ్చారు, ఏమి కావాలి అనే ఒకే అంశం మీద దృష్టి కేంద్రీకరించి, ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు.

SSC Notification 2022: పదో తరగతి అర్హతతో.. SSC నుంచి 24,369 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (QA)..

క్యాట్‌లో అత్యంత కఠినమైన విభాగం క్యూఏ. చాలా మంది విద్యార్థులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటేనే ఆందోళనకు గురవుతారు. చాలా మంది విద్యార్థులకు ఫండమెంటల్స్‌పై మంచి పట్టు ఉన్నా.. అప్లికేషన్ బేస్డ్ ప్రశ్న వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యాట్ పరీక్షలో థిరిటికల్ నాలెడ్జ్‌కు ప్రయారిటీ ఉండదు. ఇది బేసిక్ కాన్సెప్ట్స్ అప్లికేషన్ రూపంలో ఉంటుంది. కాబట్టి బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్, ప్రపోర్షనాలిటి టూల్స్, నంబర్స్, ఎలిమెంటరీ కాంబినేటరిక్స్, అల్ జీబ్రా, జామెట్రీ వంటి టాపిక్స్‌పై మంచి పట్టు తెచ్చుకోవాలి. దీంతో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో బెస్ట్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలో టైమ్ మేనేజ్‌మెంట్ కూడా కీలకం. కాబట్టి కష్టమైన ప్రశ్నతో టైమ్ వేస్ట్ చేసుకోకుండా సులువుగా ఉన్న వాటిని మొదటగా సాల్వ్ చేయాలి. దీంతో టైమ్ సేవ్ అవుతుంది.

First published:

Tags: Career and Courses, Cat, Cat admit, JOBS

ఉత్తమ కథలు