హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CAT 2021: క్యాట్ ప‌రీక్షకు 2.30 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు.. ప‌రీక్ష విధానం ఇదే

CAT 2021: క్యాట్ ప‌రీక్షకు 2.30 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు.. ప‌రీక్ష విధానం ఇదే

క్యాట్‌ పరీక్ష

క్యాట్‌ పరీక్ష

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో మెరుగైన విద్యాసంస్థ‌ల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్ ( Common Admission Test). ఈ ఏడాది ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సెప్టెంబర్ 22 న ముగిసింది. ఈ ఏడాది సుమారు 2.31 లక్షల మంది అభ్యర్థులు ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొన్నారు.

ఇంకా చదవండి ...

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో మెరుగైన విద్యాసంస్థ‌ల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్ ( Common Admission Test). ఈ ఏడాది ఐఐఎం అహ్మదాబాద్‌.. క్యాట్‌–2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప‌రీక్షకు సంబంధించి ఇప్ప‌టికే ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సెప్టెంబర్ 22 న ముగిసింది. క్యాట్ ద్వారా ఎంపికై ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం వంటి మేనేజ్‌ మెంట్‌ కోర్సులను ప్రముఖ బీస్కూల్స్‌లో చదివిన ప్రతిభావంతులకు కార్పొరేట్‌ కంపెనీలు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నాయి. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తాయి. ముఖ్యంగా ఐఐఎం (IIM)ల్లో ఎంబీఏ పూర్తి చేస్తే.. కార్పొరేట్‌ (Corporate) కంపెనీలకు అడిగి మ‌రీ అవ‌కాశాలు ఇస్తాయి. అందుకే పేరున్న ఇన్‌స్టిట్యూట్స్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది.

ద‌ర‌ఖాస్తు స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం

క్యాట్‌లో స్కోర్‌ (CAT Score) తోపాటు మలిదశలో ప్రతిభ చూపితేనే వీటిల్లో అడ్మిషన్‌ ఖాయం అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు CAT 2021 కోసం హాజరు కావడానికి దాదాపు 2.31 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 159 న‌గ‌రాల్లో  ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్రవేశ పరీక్ష నవంబర్ 28, 2021న నిర్వ‌హిస్తారు. ఈ సెప్టెంబర్ 25, ఉదయం 10 నుంచి సెప్టెంబర్ 27, సాయంత్రం 5 గంటల వరకు అభ్య‌ర్థుల‌కు మూడు రోజుల అప్లికేష‌న్ ఫాం కరెక్షన్ విండో (Correction Window) అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో ఏమైనా త‌ప్పులు ఉంటే స‌రి చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా ఫోటోగ్రాఫ్ (Photo graph), సంతకం మరియు టెస్ట్ సిటీ (Test city) ప్రాధాన్యత ఫీల్డ్‌లను సవరించవచ్చు.

SSC Recruitment 2021: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 3,261 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల


ప‌రీక్ష విధానం

Step 1:  ఈ ఏడాది క్యాట్ 2.30 ల‌క్ష‌ల మంది రాయ‌నున్నారు. ఈ సంఖ్యం గ‌తంలో కంటే కాస్తా ఎక్కువ‌. గ‌తేడాది 2.27 లక్షల మంది పరీక్ష రాశారు.

Step 2:  క్యాట్‌ పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్  (Computer Based Test) విధానంలో నిర్వ‌హిస్తారు.

Step 3:  ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి. వ‌ర్బ‌ల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్ష‌న్ విభాగంలో 26 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. క్వాంటిటేటీవ్ ఎబిలిటీలో 26 ప్రశ్న‌లు వ‌స్తాయి. డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ అండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్‌లో 24 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. మొత్తం ప‌రీక్ష‌లో 76 ప్ర‌శ్న‌లు ఉంటాయి.

Step 4:  ప‌రీక్ష‌లో నెగిటీవ్ మార్కింగ్ (Negative Marking) విధానం ఉంటుంది. ప్ర‌తీ ప్ర‌శ్న‌కు మూడు మార్కులు ఉంటాయి. త‌ప్పు ప్ర‌శ్న‌కు ఒక మార్క్ నెగిటీవ్ మార్క్ అవుతుంది. అయితే కొన్ని ప్ర‌శ్న‌ల‌కు మ‌ల్టీపుల్ చాయిస్ ఉండ‌వు వాటికి నెగిటీవ్ మార్క్ ఉండ‌దు.

Step 5:  ఈ ప‌రీక్ష పాసైన వారికి గ్రూప్‌ డిస్కషన్‌(జీడీ), రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌(వాట్‌), పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వ‌హించి ఎంపిక చేస్తారు.

First published:

Tags: CAREER, EDUCATION, Exams, New course, Study

ఉత్తమ కథలు