CAT 2021 KNOW EXAM PATTERN AND FOLLOW THESE TIPS FOR GOOD SCORE EVK
CAT 2021: వచ్చే వారం క్యాట్ పరీక్ష.. లాస్ట్మినెట్ టిప్స్
(ప్రతీకాత్మక చిత్రం)
CAT Exam: మేనేజ్మెంట్ కోర్సుల్లో మెరుగైన విద్యాసంస్థల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ ( Common Admission Test). ఈ ఏడాది ఐఐఎం అహ్మదాబాద్ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష నవంబర్ 28, 2021న ఉంటుంది. ఈ పరీక్ష ఉత్తీర్ణత సాధించడానికి ఏం చేయాలో తెలుసుకోండి.
మేనేజ్మెంట్ కోర్సుల్లో మెరుగైన విద్యాసంస్థల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ ( Common Admission Test). ఈ ఏడాది ఐఐఎం అహ్మదాబాద్ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష నవంబర్ 28, 2021న ఉంటుంది. లక్షల్లో పరీక్ష రాస్తున్నా.. కేవలం కొద్ది మందికి మాత్రమే అర్హత సాధిస్తున్నారు. క్యాట్ ద్వారా ఎంపికై ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం వంటి మేనేజ్ మెంట్ కోర్సులను ప్రముఖ బీస్కూల్స్‌లో చదివిన ప్రతిభావంతులకు కార్పొరేట్ కంపెనీలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తాయి. ముఖ్యంగా ఐఐఎం (IIM)ల్లో ఎంబీఏ పూర్తి చేస్తే.. కార్పొరేట్ (Corporate) కంపెనీలకు అడిగి మరీ అవకాశాలు ఇస్తాయి. అందుకే పేరున్న ఇన్స్టిట్యూట్స్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం.. పరీక్షకు సంబంధించి లాస్ట్మినట్స్ టిప్స్ తెలుసుకుందాం.
పరీక్ష విధానం
Step 1: ఈ ఏడాది క్యాట్ 2.30 లక్షల మంది రాయనున్నారు. ఈ సంఖ్యం గతంలో కంటే కాస్తా ఎక్కువ. గతేడాది 2.27 లక్షల మంది పరీక్ష రాశారు.
Step 2: క్యాట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (Computer Based Test) విధానంలో నిర్వహిస్తారు.
Step 3: ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి. వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగంలో 26 ప్రశ్నలు వస్తాయి. క్వాంటిటేటీవ్ ఎబిలిటీలో 26 ప్రశ్నలు వస్తాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్‌లో 24 ప్రశ్నలు వస్తాయి. మొత్తం పరీక్షలో 76 ప్రశ్నలు ఉంటాయి.
Step 4: పరీక్షలో నెగిటీవ్ మార్కింగ్ (Negative Marking) విధానం ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి. తప్పు ప్రశ్నకు ఒక మార్క్ నెగిటీవ్ మార్క్ అవుతుంది. అయితే కొన్ని ప్రశ్నలకు మల్టీపుల్ చాయిస్ ఉండవు వాటికి నెగిటీవ్ మార్క్ ఉండదు.
Step 5: ఈ పరీక్ష పాసైన వారికి గ్రూప్ డిస్కషన్(జీడీ), రిటెన్ ఎబిలిటీ టెస్ట్(వాట్), పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
క్యాట్ ఉత్తీర్ణత సాధించాలంటే ఏం అవసరం..
- క్యాట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే, క్యాట్ సిలబస్‌పై మంచి అవగాహన ఉండాలి.
- ఎక్కువగా మోడల్ పేపర్లను పరిష్కరించడం ద్వారా పరీక్ష రాసే విధానంపై పట్టు సాధించవచ్చు.
- నమూనా ప్రశ్న పత్రాలను పరిష్కరించడం అనేది మీరు ఒక సబ్జెక్ట్‌కి ఎంత సమయం కేటాయించవచ్చో కూడా నిర్ణయించడంలో సహాయపడుతుంది.
- క్యాట్ పరీక్షలో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (VARC) చాలా ముఖ్యమైన విభాగం.
- CAT పాస్ అవ్వడానకి ఈ విభాగంలో ఎక్కువగా ప్రావీణ్యం సాధించాలి.
- ఎక్కువగా ఇంగ్లీష్ పేపర్లు, నవలు చదవడం ద్వారా భాషపై పట్టు సాధించవచ్చు.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్ (Quantitative Aptitude)కి ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు మరియు థియరీని ప్రాక్టీస్ చేయడం అవసరం.
- ఈ విభాగంలో మ్యాథ్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగం CAT పరీక్షలో కఠినమైన విభాగం. CAT పరీక్షలో అత్యధిక స్కోరింగ్ విభాగం కూడా ఇదే అనడంలో సందేహం లేదు.
- ఈ విభాగంలో ఆల్జీబ్రా, త్రికోణమితి, జ్యామితి, మెన్సురేషన్ ప్రశ్నలు ఎక్కువగా అడుతారు. కచ్చితత్వం
ఆహారం.. ఆరోగ్యం ముఖ్యం
చాలా మంది విద్యార్థులు పరీక్ష దరఖాస్తు చేసినప్పటి నుంచి నిరంతరం చదువుతుంటారు. ఎక్కువ సమయం చదువపై దృష్టిపెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఇది సరైంది కాదు. కంటి నిండా నిద్ర అవసరం. ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా ఉండాలి. పరీక్ష సమయానికి ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి ఆహారపు అలవాట్లు ముఖ్యం. మంచి ఆరోగ్యం ధృడమైన మనసుని ఇస్తుంది. తోపాటు వేగంగా లెక్కులు
ఈ తప్పులు చేయకండి..
- పరీక్షలో ఏదైనా విభాగం మీకు కఠినంగా ఉంటే మీరు భయపడకూడదు.
- బాగా వచ్చినవి మాత్రమే అటెప్ట్ చేయండి. దాని వల్ల నెగిటీవ్ మార్కింగ్ తగ్గుతుంది.
- కచ్చితత్వం వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది.
- కఠినంగా అనిపిస్తే ఆవేశంలో ఎక్కువ మిస్టేక్స్ అవుతాయి.
- నిర్ణిత సమయంలో ఎన్ని కరెక్టుగా చేయగలుగుతారో అన్ని మాత్రమే చేయండి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.