హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CAT 2021: "క్యాట్‌" రాస్తున్నారా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

CAT 2021: "క్యాట్‌" రాస్తున్నారా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

క్యాట్ ప‌రీక్ష‌

క్యాట్ ప‌రీక్ష‌

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో మెరుగైన విద్యాసంస్థ‌ల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్ ( Common Admission Test). ఈ ఏడాది ఐఐఎం అహ్మదాబాద్ నిర్వ‌హిస్తోంది. ఈ ప‌రీక్ష న‌వంబ‌ర్ 28, 2021న ఉంటుంది. ఈ ప‌రీక్ష ఉత్తీర్ణ‌త సాధించ‌డానికి ఏం చేయాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో మెరుగైన విద్యాసంస్థ‌ల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్ ( Common Admission Test). ఈ ఏడాది ఐఐఎం అహ్మదాబాద్ నిర్వ‌హిస్తోంది. ఈ ప‌రీక్ష న‌వంబ‌ర్ 28, 2021న ఉంటుంది. ల‌క్ష‌ల్లో ప‌రీక్ష రాస్తున్నా.. కేవలం కొద్ది మందికి మాత్ర‌మే అర్హ‌త సాధిస్తున్నారు. క్యాట్ ద్వారా ఎంపికై ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం వంటి మేనేజ్‌ మెంట్‌ కోర్సులను ప్రముఖ బీస్కూల్స్‌లో చదివిన ప్రతిభావంతులకు కార్పొరేట్‌ కంపెనీలు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నాయి. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తాయి. ముఖ్యంగా ఐఐఎం (IIM)ల్లో ఎంబీఏ పూర్తి చేస్తే.. కార్పొరేట్‌ (Corporate) కంపెనీలకు అడిగి మ‌రీ అవ‌కాశాలు ఇస్తాయి. అందుకే పేరున్న ఇన్‌స్టిట్యూట్స్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష విధానం.. ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం.

  ప‌రీక్ష విధానం

  Step 1: ఈ ఏడాది క్యాట్ 2.30 ల‌క్ష‌ల మంది రాయ‌నున్నారు. ఈ సంఖ్యం గ‌తంలో కంటే కాస్తా ఎక్కువ‌. గ‌తేడాది 2.27 లక్షల మంది పరీక్ష రాశారు.

  ISB Online Course: ఫైనాన్స్​ విద్యార్థులకు ఐఎస్​బీ హైదరాబాద్​ గుడ్​న్యూస్.. "టాలెంట్​ స్ప్రింట్" భాగస్వామ్యంతో కొత్త ఆన్​లైన్​ కోర్స్‌


  Step 2: క్యాట్‌ పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్ (Computer Based Test) విధానంలో నిర్వ‌హిస్తారు.

  Step 3: ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి. వ‌ర్బ‌ల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్ష‌న్ విభాగంలో 26 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. క్వాంటిటేటీవ్ ఎబిలిటీలో 26 ప్రశ్న‌లు వ‌స్తాయి. డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ అండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్‌లో 24 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. మొత్తం ప‌రీక్ష‌లో 76 ప్ర‌శ్న‌లు ఉంటాయి.

  Step 4: ప‌రీక్ష‌లో నెగిటీవ్ మార్కింగ్ (Negative Marking) విధానం ఉంటుంది. ప్ర‌తీ ప్ర‌శ్న‌కు మూడు మార్కులు ఉంటాయి. త‌ప్పు ప్ర‌శ్న‌కు ఒక మార్క్ నెగిటీవ్ మార్క్ అవుతుంది. అయితే కొన్ని ప్ర‌శ్న‌ల‌కు మ‌ల్టీపుల్ చాయిస్ ఉండ‌వు వాటికి నెగిటీవ్ మార్క్ ఉండ‌దు.

  Free Course: జాబ్‌ కోసం ఫ్రీ కోర్సు చేయాల‌నుకొంటున్నారా.. అయితే ట్రై చేయండి


  Step 5: ఈ ప‌రీక్ష పాసైన వారికి గ్రూప్‌ డిస్కషన్‌(జీడీ), రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌(వాట్‌), పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వ‌హించి ఎంపిక చేస్తారు.

  క్యాట్ ఉత్తీర్ణ‌త సాధించాలంటే ఏం అవ‌స‌రం..

  - క్యాట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే, క్యాట్ సిలబస్‌పై మంచి అవగాహన ఉండాలి.

  - ఎక్కువ‌గా మోడ‌ల్ పేప‌ర్‌ల‌ను పరిష్కరించడం ద్వారా ప‌రీక్ష రాసే విధానంపై ప‌ట్టు సాధించ‌వ‌చ్చు.

  - నమూనా ప్రశ్న పత్రాలను పరిష్కరించడం అనేది మీరు ఒక సబ్జెక్ట్‌కి ఎంత సమయం కేటాయించవచ్చో కూడా నిర్ణయించడంలో సహాయపడుతుంది.

  - క్యాట్ పరీక్షలో వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (VARC) చాలా ముఖ్యమైన విభాగం.

  - CAT పాస్ అవ్వ‌డాన‌కి ఈ విభాగంలో ఎక్కువ‌గా ప్రావీణ్యం సాధించాలి.

  - ఎక్కువ‌గా ఇంగ్లీష్ పేప‌ర్‌లు, న‌వ‌లు చ‌ద‌వ‌డం ద్వారా భాష‌పై ప‌ట్టు సాధించ‌వ‌చ్చు.

  - క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్ (Quantitative Aptitude)కి ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు మరియు థియరీని ప్రాక్టీస్ చేయ‌డం అవసరం.

  - ఈ విభాగంలో మ్యాథ్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగం CAT ప‌రీక్ష‌లో క‌ఠినమైన విభాగం. CAT పరీక్షలో అత్యధిక స్కోరింగ్ విభాగం కూడా ఇదే అన‌డంలో సందేహం లేదు.

  - ఈ విభాగంలో ఆల్జీబ్రా, త్రికోణమితి, జ్యామితి, మెన్సురేషన్ ప్ర‌శ్న‌లు ఎక్కువ‌గా అడుతారు. క‌చ్చిత‌త్వం

  ఆహారం.. ఆరోగ్యం ముఖ్యం

  చాలా మంది విద్యార్థులు ప‌రీక్ష ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్ప‌టి నుంచి నిరంత‌రం చ‌దువుతుంటారు. ఎక్కువ స‌మ‌యం చ‌దువ‌పై దృష్టిపెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఇది స‌రైంది కాదు. కంటి నిండా నిద్ర అవ‌స‌రం. ఆహార‌పు అలవాట్లు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప‌రీక్ష స‌మ‌యానికి ఒత్తిడి నుంచి త‌ట్టుకోవ‌డానికి ఆహార‌పు అల‌వాట్లు ముఖ్యం. మంచి ఆరోగ్యం ధృడ‌మైన మ‌న‌సుని ఇస్తుంది. తోపాటు వేగంగా లెక్కులు

  Published by:Sharath Chandra
  First published:

  Tags: EDUCATION, Exams, Study

  ఉత్తమ కథలు