CAT 2021 HAVE YOU WRITTEN THE CAT 2021 EXAM KNOW ADMISSION PROCESS AND TOP B SCHOOL DETAILS EVK
CAT 2021: క్యాట్-2021 పరీక్ష రాశారా.. అడ్మిషన్ ప్రక్రియ.. టాప్ బీ-స్కూల్ వివరాలు
(ప్రతీకాత్మక చిత్రం)
CAT 2021 | మేనేజ్మెంట్ కోర్సుల్లో మెరుగైన విద్యాసంస్థల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ ( Common Admission Test). ఈ ఏడాది ఐఐఎం అహ్మదాబాద్.. క్యాట్–2021 పరీక్ష నిర్వహించింది. క్యాట్- 2021 ఫలితాలు జనవరి 3, 2022న విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్మిషన్ విధానం.. టాప్ బీ-స్కూల్ల వివరాలు తెలుసుకోండి.
మేనేజ్మెంట్ కోర్సుల్లో మెరుగైన విద్యాసంస్థల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ ( Common Admission Test). ఈ ఏడాది ఐఐఎం అహ్మదాబాద్.. క్యాట్–2021 పరీక్ష నిర్వహించింది. క్యాట్- 2021 ఫలితాలు జనవరి 3, 2022న విడుదల కావచ్చని భావిస్తున్నారు, ఈ నేపథ్యంలో పరీక్ష ఫలితాలు ఎలా చూసుకోవాలో పరీక్ష నిర్వహించిన ఐఐటీ అహ్మదాబాద్ తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు స్కోర్ కార్డు పొందేందుకు iimcat.ac.inలో వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వ్రాత సామర్థ్య పరీక్ష (Written Ability Test) నిర్వహిస్తారు. అనంతరం గ్రూప్ డిస్కషన్ (GD), మరియు పర్సనల్ ఇంటర్వ్యూలు (PI) ఉంటాయి. CAT 2021 నవంబర్ 28న నిర్వహించబడింది. ఆ తర్వాత జవాబు కీ డిసెంబర్ 8న విడుదల చేశారు. దాదాపు 158 పరీక్ష నగరాల్లో, 1.9 లక్ష మంది విద్యార్థులకు పైగా పరీక్ష రాశారు. ఈ పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించారు.
రిజిల్ట్ ఇలా చెక్ చేసుకోవాలి..
Step 1. IIM CAT 2021 యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Step 2. మీ అప్లికేషన్ ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
Step 3. మీ CAT 2021 ఫలితాలు స్క్రీన్‌పై చూపిస్తుంది.
Step 4. భవిష్యత్తు సూచన కోసం స్కోర్‌కార్డ్‌ని డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
అడ్మిషన్లు పొందే విధానం..
IIMలలో చేరడానికి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితా ఉంటుంది. ప్రతి IIM నేరుగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేఖలను పంపుతుంది. “IIMలు అభ్యర్థుల మునుపటి విద్యా పనితీరు, సంబంధిత వంటి ఇతర అంశాలను అదనంగా పరిశీలిస్తాయి. అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్, ర్యాంకింగ్‌లో పని అనుభవం ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకొంటారు. ముఖ్యంగా అకడమిక్ కట్-ఆఫ్‌లు, వారికి కేటాయించిన వెయిటేజీలను పరిశీలిస్తారు.
భారతదేశంలో ఉత్తమ B-స్కూల్స్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకింగ్ National Institute of Framework Ranking) 2021 ఆధారంగా ఇండియాలోని టాప్ 15 B-స్కూల్స్ ఇవే..
Rank 1: IIM అహ్మదాబాద్
Rank 2: IIM బెంగళూరు
Rank 3: IIM కలకత్తా
Rank4: IIM కోజికోడ్
Rank 5: IIT ఢిల్లీ
Rank 6: IIM ఇండోర్
Rank 7: IIM లక్నో
Rank 8: జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్ (XLRI)
Rank 9: IIT ఖరగ్‌పూర్
Rank 10: IIT బాంబే
Rank 11: మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, హర్యానా
Rank 12: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ముంబై
Rank 13: ఐఐటీ మద్రాస్
Rank 14: IIT రూర్కీ
Rank 15: IIM రాయ్‌పూర్
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.