హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Cars24 Employees: 600 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన కార్స్24 కంపెనీ.. ప్రతినిధులు ఏమన్నారంటే..

Cars24 Employees: 600 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన కార్స్24 కంపెనీ.. ప్రతినిధులు ఏమన్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ సెకండ్ హ్యాండ్ కార్ల ఈ-కామర్స్ కంపెనీ కార్స్24 (Cars24) తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సమర్థవంతంగా పని చేయడం లేదంటూ ఏకంగా ఆరు వందల మందిని కొలువుల నుంచి తొలగించింది.

ప్రముఖ సెకండ్ హ్యాండ్ కార్ల(Second Hand Cars) ఈ-కామర్స్(E Commerce) కంపెనీ కార్స్24 (Cars24) తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సమర్థవంతంగా పని చేయడం లేదంటూ ఏకంగా ఆరు వందల మందిని కొలువుల నుంచి తొలగించింది. గత కొద్ది నెలలుగా స్టార్టప్‌ల కంపెనీలు లేఆఫ్స్ (Layoffs) ప్రకటిస్తూ ఉద్యోగులను ఉన్నపళంగా ఇంటికి పంపిచేస్తున్నాయి. ఆన్‌లైన్ ఆటోమొబైల్ మార్కెట్‌ప్లేస్ కార్స్24 కూడా ఇదే బాట పట్టింది. అయితే మిగతా కంపెనీలన్నీ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తే.. కార్స్24 మాత్రం ఉద్యోగులు (Employees) పేలవమైన ప్రదర్శనలను (Poor Performance) కారణంగా చూపి తొలగించింది. సరిగా పని చేయకపోతే ఉద్యోగాల నుంచి తీసేయడం వ్యాపారంలో ఎప్పుడూ జరిగేదేనని, ఉద్యోగుల తొలగింపులు సాధారణమేనని ఈ కంపెనీ తేలికగా చెబుతోంది. అయితే కొలువులు కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.

"పనితీరు బాగోలేకపోతే జాబ్స్ నుంచి తీసేయడం ప్రతి సంవత్సరం బిజినెస్ రంగంలో జరిగేదే" అని కార్స్24 కంపెనీ ప్రతినిధి మీడియాకి చెప్పుకొచ్చారు. ఈ తొలగింపులతో కార్స్24 తన మొత్తం 9,000 మంది సిబ్బందిలో 6.6 శాతం మందిని వదులుకుంది. దీంతో నిధుల మందగమనం, కఠినమైన గ్లోబల్ మార్కెట్ నేపథ్యంలో ఉద్యోగులను తొలగించిన అన్‌అకాడమీ, వేదాంతు, మీషో, Furlenco, ట్రేల్, ఓకేక్రెడిట్ వంటి స్టార్టప్‌ల జాబితాలో కార్స్24 కంపెనీ చేరింది. అయితే తొలగించిన ఉద్యోగులను జూనియర్ స్థాయిలకు వెళ్లాలని కంపెనీ యాజమాన్యం సూచించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ ఉన్న ఎక్కువ మందిని నియమించుకునే ప్రక్రియలో భాగంగా సరిగా పనిచేయని వారిని కంపెనీ తీసేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సెకండ్ హ్యాండ్ కార్ల కంపెనీ వ్యాపారం ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా వంటి ప్రాంతాలలో వృద్ధిని నమోదు చేస్తుంది. తన బిజినెస్‌ను మరింత విస్తరించేందుకు ప్రస్తుతం కంపెనీ కృషి చేస్తోంది.

Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 72,000 పోస్టుల్ని తొలగించిన భారతీయ రైల్వే

డిసెంబర్ 2021లో కార్స్24 300 మిలియన్ డాలర్ల సిరీస్ G ఈక్విటీ రౌండ్‌తో పాటు 400 మిలియన్ రౌండ్ ఫండింగ్‌ను క్లోజ్ చేసింది. అలాగే విభిన్న ఆర్థిక సంస్థల నుండి 100 మిలియన్ల రుణాన్ని సేకరించింది. ఈ ప్లాట్‌ఫామ్ విలువ ఇప్పుడు 3.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ విలువ సెప్టెంబర్ 2021లో దాని మునుపటి వాల్యూ కంటే రెట్టింపు. కంపెనీ అనేక అత్యాధునిక 'మెగా రిఫర్బిష్‌మెంట్ ల్యాబ్‌ (MRL)లను' ఏర్పాటు చేసింది. తమ అత్యుత్తమ సాంకేతికతను మెరుగుపరచడం,

ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వాడిన కార్ల కోసం గోల్డ్ స్టాండర్స్ నిర్మించడం కొనసాగుతుందని పేర్కొంది. ఈ కంపెనీ ఇండియాలో ఏడు ఎంఆర్ఎల్‌లను, యూఏఈలో ఒకటి ప్రారంభించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. రాబోయే 18 నుండి 24 నెలల్లో కార్స్24 మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తున్న సమయంలో ఉద్యోగులు తొలగించడం జరిగింది. కార్స్24 ప్లాట్‌ఫామ్‌లో సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు లేదా ఫైనాన్స్ తీసుకోవచ్చు.

First published:

Tags: Career and Courses, Employees, Job, Lay offs

ఉత్తమ కథలు