ప్రస్తుతం అన్ని రంగాలు డిజిటలైజేషన్ బాట పడుతున్నాయి. దీంతో స్మార్ట్‌వేర్ వినియోగం పెరిగింది. తద్వారా ఎర్రర్స్ ఐడెంటిఫై చేయడానికి, బగ్స్ కనుగొనడానికి సాఫ్ట్‌వేర్ (Software) టెస్టింగ్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. న్యూస్ 18 అందిస్తున్న వీక్లీ కాలమ్ కెరీర్ వైజ్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనలిస్ట్‌గా కెరీర్ ఎలా ఉంటుంది? అర్హత ప్రమాణాలు, అవసరమైన స్కిల్స్, జాబ్ ప్రొఫైల్ తదితర విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
* టెస్టింగ్ కీలకం
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లోని దశల్లో టెస్టింగ్ కూడా కీలకం. సాఫ్ట్‌వేర్ క్రిటికల్ డేటా ఆధారంగా రన్ అవుతుంది. ఇందులో ఏవైనా సమస్యలు ఉంటే రిజల్ట్స్‌పై ప్రభావం కనిపిస్తుంది. అందుకే మార్కెట్‌లోకి సాఫ్ట్‌వేర్‌ని లాంచ్ చేయడానికి ముందే అన్ని విధాలుగా టెస్ట్ చేశారు. వివిధ రకాల ఇన్‌పుట్‌లను ఇచ్చి సరైన రిజల్ట్స్‌ని అందిస్తుందో? లేదో? పరిశీలిస్తారు. సాఫ్ట్‌వేర్‌లోని అన్ని విభాగాల మధ్య సమర్వయం ఎలా ఉందో పరీక్షిస్తారు. అన్ని విభాగాలు విజయవంతంగా పని చేస్తున్నాయని, నిర్ధారించుకున్న తర్వాత సాఫ్ట్‌వేర్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తారు.
* అర్హత ప్రమాణాలు
సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనలిస్ట్‌గా సేవలందించాలంటే BE , BTech (ఎనీ స్ట్రీమ్), BCA, MCA, ENTC చేసి ఉండాలి. లేదా బీఎస్సీ, ఎంఎస్సీలో IT, టెలికాం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ చేసి ఉండాలి. కమ్యూనికేట్ చేసే విధంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై పట్టు ఉండాలి.
* జాబ్ ప్రొఫైల్
సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనలిస్ట్‌గా సవాళ్లను వివిధ మార్గాల్లో ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రధానంగా బాధ్యతలు ఇలా ఉంటాయి. సాఫ్ట్‌వేర్ ఉపయోగం, ప్రయోజనాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ వినియోగ సందర్భాల్లో సాఫ్ట్‌వేర్ సజావుగా రన్ అవుతుందని నిర్ధారించడానికి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ రిపోర్ట్స్ విశ్లేషించడం, ద్వారా సాఫ్ట్‌వేర్ ఎర్రరస్, బగ్స్ గురించి స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉంటుంది.
* అవసరమైన స్కిల్స్
సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ రంగంలో రాణించాలంటే ఔత్సాహికులకు టెక్- నాన్-టెక్ స్కిల్స్‌పై మంచి అవగాహన ఉండాలి. టెక్ స్కిల్స్ పరంగా డేటా ఎలా స్టోర్ అవుతుందో అర్థం చేసుకోవాలి. డేటా బ్యాకెండ్‌లో స్టోర్ అయిందని నిర్ధారించుకోవడానికి SQLను ఉపయోగిస్తారు. సాఫ్ట్‌వేర్ మేనేజ్‌మెంట్, ఎర్రర్ ట్రాకింగ్, ఆటోమేషన్ టూల్స్‌పై లోతైన అవగాహన ఉండాలి. . C#, JavaScript, Perl వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నాన్ టెక్ స్కిల్స్ పరంగా... రిపోర్ట్ విశ్లేషణను సమగ్రంగా వివరించడానికి తప్పనిసరిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
* కెరీర్ పాత్
QA అనలిస్ట్ .. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ రంగంలో ఇది స్టార్టింగ్ స్టేజ్. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ నిపుణులుగా వారికి ఎటువంటి అనుభవం ఉండదు. సాఫ్ట్‌వేర్ పని సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను టెస్ట్ చేయడంద్వారా QA అనలిస్ట్‌లు నేర్చుకుంటారు.
ఇది కూడా చదవండి : ఏప్రిల్ 6 నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు.. ప్రిపరేషన్ టిప్స్, బెస్ట్ బుక్స్ ఇవే
QA అనలిస్ట్ (సీనియర్): ఒక సీనియర్ QA అనలిస్ట్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ రంగంలో 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
QA టీమ్ కో-ఆర్డినేటర్: టీమ్ కోఆర్డినేటర్ ప్రధాన బాధ్యత నిపుణుల మధ్య వర్క్‌ను చక్కగా మేనేజ్ చేయడం, అనలైజ్ రిపోర్ట్స్ సజావుగా పనిచేయడం, బగ్-రహిత సాఫ్ట్‌వేర్‌ను సమయానికి అందజేయడం వంటి బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది.
టెస్ట్ మేనేజర్: టెస్ట్ మేనేజర్ ప్రోగ్రామ్ సక్సెస్‌ను నిర్ధారిస్తారు. QA అనలిస్ట్‌లు, టీమ్-కో-ఆర్డినేటర్స్ టాస్క్‌లను పరిశీలిస్తుంటారు. ప్రధానంగా QA అనలిస్ట్‌లు నిర్వహించే టాస్క్‌లను అఫ్రూవ్, మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఒక టెస్ట్ మేనేజర్ సాధారణంగా 8-11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
* ఎక్స్‌పెక్టెడ్ శాలరీ
భారతదేశంలో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ప్రొఫెషనల్ సగటు వార్షిక జీతం సంవత్సరానికి రూ.3.6 లక్షలు. ప్రారంభ పే ప్యాక్ సంవత్సరానికి రూ.1.7 లక్షల నుంచి రూ.7.8 లక్షల వరకు ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్, వర్క్ రేంజ్ తదితర అంశాలపై జీతం ఆధారపడి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Career and Courses, EDUCATION, JOBS, Software