హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career Advice: మీరు డిటెక్టివ్‌లా ఆలోచిస్తారా..? అయితే మీ పంట పండినట్లే.. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో మీకోసం స్పెషల్ జాబ్స్..!

Career Advice: మీరు డిటెక్టివ్‌లా ఆలోచిస్తారా..? అయితే మీ పంట పండినట్లే.. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో మీకోసం స్పెషల్ జాబ్స్..!

మీరు డిటెక్టివ్‌లా ఆలోచిస్తారా..? అయితే మీ పంట పండినట్లే..

మీరు డిటెక్టివ్‌లా ఆలోచిస్తారా..? అయితే మీ పంట పండినట్లే..

ఒక సాఫ్ట్‌వేర్‌లో మిస్సయిన లింక్‌లు, సాంకేతిక లోపాలు గుర్తించడంలో నైపుణ్యం ఉంటే, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కెరీర్ ఎంచుకోవచ్చు. అలానే విశ్లేషణ సామర్ధ్యాలు, సమర్థవంతంగా కమ్యూనికేట్ అయ్యే స్కిల్స్, జడ్జిమెంట్ ఇవ్వగల శక్తి, సాంకేతిక నైపుణ్యాలు వంటి డిటెక్టివ్ స్కిల్స్ ఉన్నవాళ్ల కోసమే ఈ జాబ్స్.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

గత కొద్దిరోజులుగా అన్ని బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత విద్యార్థులు ఏ కెరీర్ ఎంచుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. అయితే ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌ (Software Testing)లో కెరీర్‌ (Career) అనేది ఉత్తమంగా నిలుస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో కెరీర్ అనేది కోడింగ్, డెవలపర్ వంటి బెస్ట్ కెరీర్లకు ఏ మాత్రం తీసిపోదు. సాధారణంగా ఒక డెవలపర్ గొప్ప సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేయొచ్చు కానీ అందులో లోపాలు అనేవి కచ్చితంగా ఉంటాయి. వాటిని కనిపెట్టేందుకు సాఫ్ట్‌వేర్ టెస్టర్ తప్పనిసరి. ఛాలెంజ్‌లను ఇష్టపడే, పజిల్‌ని సాల్వ్ చేసే, రహస్యాలను ఛేదించే, స్వతహాగా ఉత్సుకత ఉన్నవారికి ఈ కెరీర్‌కి మించింది మరేదీ ఉండదని చెప్పవచ్చు. మరి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌ అంటే ఏంటి? ఈ కెరీర్‌లో లభించే అవకాశాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక సాఫ్ట్‌వేర్‌లో మిస్సయిన లింక్‌లు, సాంకేతిక లోపాలు గుర్తించడంలో నైపుణ్యం ఉంటే, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కెరీర్ ఎంచుకోవచ్చు. అలానే విశ్లేషణ సామర్ధ్యాలు, సమర్థవంతంగా కమ్యూనికేట్ అయ్యే స్కిల్స్, జడ్జిమెంట్ ఇవ్వగల శక్తి, సాంకేతిక నైపుణ్యాలు వంటి డిటెక్టివ్ స్కిల్స్ కూడా ముఖ్యం. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ చేసే వారిని క్వాలిటీ అస్యూరెన్స్ (QA) టీమ్స్, టెస్టర్లు అని కూడా పిలుస్తారు. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో సరైన పద్ధతులతో క్వాలిటీని అందించడానికి, సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను గుర్తించడానికి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లతో కలిసి వీరు పని చేస్తారు. QA బృందాలు సాఫ్ట్‌వేర్‌ క్వాలిటీని చెక్ చేసిన తర్వాతే అది మార్కెట్‌లోకి రిలీజ్ అవుతుంది. అలా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్వాలిటీ విషయంలో డెవలపర్లు, టెస్టర్లు సమానమైన పాత్రను పోషిస్తారు. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ప్రధాన లక్ష్యం వ్యాపార అవసరాలు, కస్టమర్ అంచనాలకు అనుగుణంగా స్కేలబుల్, రిలయబిల్, హై-క్వాలిటీతో సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దటం. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, టెస్టర్లు ఐటీ ఇండస్ట్రీలోని వ్యాపారాల కోసం క్వాలిటీ ఉత్పత్తులను తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

ఇదీ చదవండి: ఓరి నీ సర్ప్రైజ్ పాడుగాను.. హారం పోయిందని పెళ్లికొడుకు నాటకం.. చివరికి ఏం జరిగిందంటే !


కోవిడ్ తర్వాత అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ

కోవిడ్ తర్వాత సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఇండస్ట్రీ అసాధారణ వేగంతో అభివృద్ధి చెందుతోంది. కొత్త, వేగవంతమైన డిజిటల్ పరిష్కారాల అవసరం సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ డిమాండ్‌ను పెంచింది. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ నిపుణుల అవసరం పెరిగింది. టెక్నావియో ప్రకారం, గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ సర్వీసెస్ మార్కెట్ వాటా 2020 నుంచి 2025 వరకు 34.49 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.

మీరు సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా ఎలా మారవచ్చు?

సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ప్రొఫెషనల్స్‌గా మారాలంటే తప్పనిసరిగా BTech, BE, MCA, BCA లేదా BSc-కంప్యూటర్‌ చేసి ఉండాలి. వీటితో పాటు తగిన స్కిల్స్ ఉండాలి. బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, కొత్త QA- సంబంధిత కాన్సెప్ట్స్‌ నేర్చుకోవాలనే ఉత్సాహం, కమ్యూనికేషన్ స్కిల్స్, కొత్త టెక్నాలజీలతో అప్-టు-డేటెడ్ ఉన్న వారెవరైనా సాఫ్ట్‌వేర్ టెస్టర్ కావచ్చు.

జీతం ప్యాకేజీ వర్క్ ఎక్స్‌పీరియన్స్, సాంకేతిక పరిజ్ఞానం, పని స్థానం మొదలైన వాటితో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, భారతదేశంలో ఒక ఫ్రెషర్ సాఫ్ట్‌వేర్ టెస్టర్ సగటు ప్రారంభ శాలరీ ప్యాకేజీ సుమారు రూ.3.6-5 LPAగా ఉంది. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో అభివృద్ధికి ఆస్కారం ఉంది. ఈ కెరీర్‌లో ఎంట్రీ లెవల్ QA, జూనియర్ QA, సీనియర్ QA, టీమ్ లీడ్, మేనేజర్ QA, సీనియర్ మేనేజర్ QA, టెస్ట్ ఆర్కిటెక్ట్ వంటి అనేక ఇతర జాబ్స్‌తో ముందుకు సాగవచ్చు.

First published:

Tags: IT Employees, JOBS, Software, Software developer

ఉత్తమ కథలు