హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career Wise: స్టాక్‌ మార్కెట్‌ బేస్డ్‌ కెరీర్‌ కోరుకుంటున్నారా? ఈ కోర్సుల వివరాలు మీ కోసమే..

Career Wise: స్టాక్‌ మార్కెట్‌ బేస్డ్‌ కెరీర్‌ కోరుకుంటున్నారా? ఈ కోర్సుల వివరాలు మీ కోసమే..

Career Wise: స్టాక్‌ మార్కెట్‌ బేస్డ్‌ కెరీర్‌ కోరుకుంటున్నారా? ఈ కోర్సుల వివరాలు మీ కోసమే..

Career Wise: స్టాక్‌ మార్కెట్‌ బేస్డ్‌ కెరీర్‌ కోరుకుంటున్నారా? ఈ కోర్సుల వివరాలు మీ కోసమే..

Career Wise: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని వినే ఉంటారు. కానీ అదెలా చేయాలో కొంత మందికే తెలుసు. సరైన అవగాహన లేక అడుగు పెట్టి డబ్బు పోగొట్టుకున్న వాళ్లే ఎక్కువగా ఉంటారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కొద్ది రోజుల్లోనే విద్యార్థుల (Students)కు బోర్డు పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించారు. విద్యార్థులు పాఠశాలల నుంచి కళాశాలలకు మారేందుకు, ఉన్నత చదువులకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. కెరీర్‌ను మలచుకోవడంలో ఈ దశలో తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. నచ్చిన కెరీర్‌ వైపు అడుగులు వేయడానికి అవసరమైన గైడెన్స్‌ ఇవ్వడానికి ప్రతి వారం న్యూస్‌18 కెరీర్‌ వైజ్‌ పేరిట వివరాలను అందిస్తోంది. ప్రత్యేకమైన వృత్తిని, ఆ వృత్తిలో ఉద్యోగాన్ని చేపట్టడంలో సహాయపడే ఒక రోడ్‌మ్యాప్‌ను తీసుకొస్తోంది. ఈ వారం స్టాక్‌మార్కెట్‌లో కెరీర్‌ కోరుకుంటున్న వారి కోసం సమగ్ర సమాచారం అందిస్తోంది. ఏవైనా ఇతర ప్రశ్నలు ఉంటే లేదా ఏదైనా కోర్సు గురించి వివరాలు అందించాలని కోరుకుంటుంటే @News18dotcomలో ట్విట్టర్‌ ద్వారా సంప్రదించవచ్చు.

* స్టాక్‌ మార్కెట్‌లో కెరీర్‌

స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని వినే ఉంటారు. కానీ అదెలా చేయాలో కొంత మందికే తెలుసు. సరైన అవగాహన లేక అడుగు పెట్టి డబ్బు పోగొట్టుకున్న వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఏదైనా వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టినప్పుడు, దానిలో వచ్చే లాభాలలో కూడా ఆ వ్యక్తికి వాటా ఉంటుంది. ఆ భాగాన్ని షేర్ అంటారు. అదేవిధంగా ఇప్పటికే నడుస్తున్న లేదా కొత్త కంపెనీ షేర్లను కొనుగోలు చేసే ఎవరైనా దాని వాటాదారు అవుతారు. కంపెనీ షేర్లను విక్రయించే, కొనుగోలు చేసే వారి మధ్య బ్రోకర్లు కూడా పని చేస్తారు. షేర్ మార్కెట్‌లో పనిచేయాలంటే ముందుగా ఆ రంగాన్ని అధ్యయనం చేయాలి.

* షేర్ మార్కెట్ కోర్సులు

* డిప్లొమా ఇన్ స్టాక్ మార్కెట్

కోర్సు కాలవ్యవధి 12 నెలలు. ఈ కోర్సు పూర్తి చేసిన వారి జీతం ప్రారంభంలో రూ.25,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా ఇన్‌క్లూజన్ థియరీ, ప్రాక్టికల్, ఫండమెంటల్, టెక్నికల్ బోధిస్తారు.

* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్(NIFM)

NIFMను 1993లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీని ద్వారా స్టాక్ మార్కెట్ కోర్సులు అందిస్తారు. పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్‌ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌, పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా రీసెర్చ్ అనాలిసిస్, ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌- FPM, NIFM సర్టిఫైడ్ ఫండమెంటల్ అనాలిసిస్, NIFM సర్టిఫైడ్ టెక్నికల్ అనలిస్ట్, NIFM సర్టిఫైడ్ స్మార్ట్ ఇన్వెస్టర్, NIFM సర్టిఫైడ్ ప్రిపరేషన్ మాడ్యూల్ వంటి కోర్సులను ఆఫర్‌ చేస్తోంది.

ఇది కూడా చదవండి : ఆన్‌లైన్‌ కోర్సులపై సర్వే.. ఎక్కువ మంది నేర్చుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ కోర్సులు ఇవే..!

* బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అకాడమీ(BSE అకాడమీ)

స్టాక్‌ మార్కెట్‌లో కెరీర్‌ వెతుక్కుంటున్న వారి కోసం BSE కూడా అనేక కోర్సులను అందిస్తోంది. మార్కెట్ ఇన్వెస్టర్లు, మార్కెట్ గురించి తమ పరిజ్ఞానాన్ని మెరుగుపరచు కోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఒక కోర్సును ఆఫర్‌ చేస్తోంది. కొన్ని సర్టిఫికేషన్‌ కోర్సులను కూడా అందిస్తోంది. రిస్క్ మేనేజ్‌మెంట్, ఫండమెంటల్‌ అనాలసిస్‌, టెక్నికల్‌ అనాలసిస్‌, స్టాక్‌ మార్కెట్‌, బాండ్‌ మార్కెట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, ఈక్విటీ రీసెర్చ్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

* నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అకాడమీ(NSE అకాడమీ)

NES వివిధ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తోంది. అందులో.. NSE అకాడమీ సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ (NCMP), NSE అకాడమీ సర్టిఫికేషన్ ఇన్‌ ఫైనాన్షియ్‌ మార్కెట్స్‌(NCFM), NCFM ఫౌండేషన్, ఇంటర్మీడియట్, అధునాతన అడ్వాన్స్‌డ్‌ కోర్సెస్, NSE ఫిన్‌బేసిక్ అండ్‌ 5- సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్ NCMP, ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ కోర్సెస్‌ ఉన్నాయి. ఈ కోర్సులను ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆన్‌లైన్ టెస్టింగ్, ఫైనాన్షియల్ మార్కెట్ నిర్వహణపై అవగాహన పరిధిని పెంచేందుకు రూపొందించారు.

First published:

Tags: CAREER, Career and Courses, EDUCATION, JOBS, Stock Market

ఉత్తమ కథలు