హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career Plan: ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు అలర్ట్.. ఈ కెరీర్ ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి

Career Plan: ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు అలర్ట్.. ఈ కెరీర్ ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్కూల్ ఎడ్యుకేషన్ (School Education) నుంచే విద్యార్థులకు కెరీర్‌పై (Career) స్పష్టమైన అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు. అందుబాటులో ఉన్న కోర్సులు, అవకాశాలను విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

స్కూల్ ఎడ్యుకేషన్ (School Education) నుంచే విద్యార్థులకు కెరీర్‌పై (Career) స్పష్టమైన అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు. అందుబాటులో ఉన్న కోర్సులు, అవకాశాలను విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలి. అయితే ఇంటర్ పూర్తయిన తర్వాత కెరీర్ ఆప్షన్స్‌ గురించి న్యూస్‌18 (News18) సమాచారం అందిస్తోంది. ఈ వారం ‘కెరీర్ వైజ్’ కాలమ్‌లో భాగంగా, జైపూర్‌లోని ఆర్చ్ కాలేజ్ ఆఫ్ డిజైన్ అండ్ బిజినెస్ డీన్, డిజైన్ కల్చర్ ప్రొఫెసర్ భార్గవ్ మిస్త్రీ గైడెన్స్‌తో డిజిటల్‌ డిజైన్‌ రంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో డిజిటల్ డిజైనింగ్ ఒకటి. ఈ రంగంలో కెరీర్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ డిజైన్ అనేది ఒక రకమైన గ్రాఫిక్ డిజైన్. ఇందులో కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్ (CAD) సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఇమేజ్‌లు, యానిమేషన్‌లు, ఇతర విజువల్ కంటెంట్‌ను క్రియేట్‌ చేస్తారు.

అడ్వర్టైజింగ్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫోటోగ్రఫీ, వీడియో గేమ్‌లతో సహా పలు రకాల పరిశ్రమలలో డిజిటల్ డిజైనర్లు పని చేస్తుంటారు. క్రియేటివ్‌ అంశాలపై ఆసక్తి, ఆర్ట్‌ను టెక్నాలజీతో కలిపి ఫలితాలను రాబట్టే అభిరుచి ఉన్నవాళ్లు డిజిటల్ డిజైనింగ్‌లో రాణిస్తారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లేదా ప్రోగ్రామింగ్‌పై ఆసక్తి ఉంటే, డిజిటల్ డిజైనింగ్‌కు బదులుగా కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించవచ్చు.

IIT Madras: ఐఐటీ మద్రాస్ స్పెషల్ కోర్సు .. అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ కంప్యూటింగ్‌పై రెండు వారాల ప్రోగ్రామ్

అర్హతలు

డిజిటల్‌ డిజైన్‌ రంగంలో చాలా ఉద్యోగాలకు గ్రాఫిక్ డిజైన్ లేదా కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ అవసరం. కొన్ని కంపెనీలు అదే రంగంలో లేదా టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరమని కోరవచ్చు. చాలా మంది యజమానులు కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు అవకాశాలు ఇస్తారు.

అవసరమైన నైపుణ్యాలు

క్రియేటివిటీ, ఇన్నొవేషన్‌ ఈ రంగానికి కీలకమైన నైపుణ్యాలు. విజయవంతమైన డిజిటల్ డిజైనర్‌గా మారడానికి డిజైన్ థింకింగ్, స్ట్రాంగ్‌ ప్రాబ్లం సాల్వింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించి, బడ్జెట్ లిమిట్‌లో ఉంచుతూ క్లయింట్ అవసరాలను తీర్చే క్రియేటివ్ సొల్యూషన్స్‌ అందించాలి. గడువు తేదీలు, బడ్జెట్‌లకు లోబడి బెస్ట్‌ రిజల్ట్స్‌ అందించాలి. స్ట్రాంగ్‌ కమ్యూనికేషన్ స్కిల్స్‌ కూడా అవసరం. మల్టిపుల్‌ ప్లాట్‌ఫారమ్‌లలో (ఇమెయిల్/ఫోన్ కాల్‌లు) క్లయింట్‌లతో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది.

డిజిటల్ డిజైనింగ్‌కు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌, ప్రోగ్రామింగ్ స్కిల్స్‌ అవసరం. టీమ్ వర్క్ కూడా చాలా ముఖ్యం. గ్రాఫిక్స్ డిజైన్‌లో స్పెషలైజేషన్ ఉంటే, కంప్యూటర్ కోడింగ్ ప్రొఫెషనల్స్‌, ఇతర సంబంధిత టెక్నాలజీ డొమైన్‌లతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. డిజిటల్ డిజైనింగ్‌కు డిజైన్ థియరీ, ప్రిన్సిపుల్స్‌పై పరిజ్ఞానం అవసరం. గ్రాఫిక్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్‌పై కోర్సుల ద్వారా దీనిని నేర్చుకోవచ్చు. ఈ ఫీల్డ్‌కు ఫోటోషాప్ లేదా ఇలస్ట్రేటర్ వంటి సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలలో నైపుణ్యం అవసరం. గ్రాఫిక్ డిజైన్ లేదా ఇండస్ట్రియల్ డిజైన్‌లో డిగ్రీ ఈ అంశాలపై అవగాహన కల్పిస్తుంది.

కెరీర్ ఆప్షన్లు

డిజిటల్ డిజైనర్‌ల కోసం గ్రాఫిక్ డిజైనర్, వెబ్ డిజైనర్, ప్రొడక్ట్ డిజైనర్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైనర్, ఇంటర్‌ఫేస్ డిజైనర్ వంటి అనేక కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. మీడియా పరిశ్రమలో కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం కంటెంట్‌ని సృష్టించడానికి డిజిటల్‌ డిజైనర్లను నియమించుకుంటున్నారు. గేమింగ్ పరిశ్రమలో కూడా మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి.

జాబ్ రోల్స్

డిజిటల్ డిజైనర్‌గా కెరీర్‌లో వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు, సాఫ్ట్‌వేర్ టూల్స్, గేమ్‌లు మొదలైన అప్లికేషన్‌లకు యూజర్ ఇంటర్‌ఫేస్‌లను క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది. నేటి పోటీ మార్కెట్‌లో HTML5, CSS3 వంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలను ఉపయోగించి విజువల్‌గా ఆకట్టుకునే డిజైన్‌లను రూపొందించడానికి అసాధారణ నైపుణ్యాలు అవసరం. జావాస్క్రిప్ట్, ఫ్లాష్, PHP, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్‌ ల్యాంగ్వేజెస్‌లో పట్టు సాధించాలి. డిజైన్‌పై ఆసక్తి ఉన్న వ్యక్తులు డిజైనర్‌గా లేదా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లేదా మార్కెటింగ్ సంస్థలో పని చేయవచ్చు. ఇక్కడ కంపెనీ బ్రాండింగ్ గుర్తింపును ప్రతిబింబించే బ్రోచర్‌లు లేదా వెబ్‌సైట్‌ల వంటి మార్కెటింగ్ మెటీరియల్‌లను క్రియేట్‌ చేయాలి.

డిజిటల్ డిజైనర్ శాలరీ?

అనుభవం, నైపుణ్యాలు, డిమాండ్, బాధ్యతలు, కంపెనీలపై ఆధారపడి శాలరీ ఉంటుంది. యావరేజ్‌గా స్టార్టింగ్‌ శాలరీ సంవత్సరానికి సుమారు రూ.4 లక్షల పరిధిలో ఉంటుంది. అనుభవం ఉన్నవారికి రూ.6 లక్షల వరకు కూడా ఉండవచ్చు. అనుభవం సంపాదించే కొద్దీ సంపాదన చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది.

First published:

Tags: Career and Courses

ఉత్తమ కథలు