హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career Options: యోగాకి మాంచి డిమాండ్.. ప్రకృతి వైద్యంతో ఊహించని అవకాశాలు.. ఈ కోర్సులపై ఓ లుక్కేయండీ..!

Career Options: యోగాకి మాంచి డిమాండ్.. ప్రకృతి వైద్యంతో ఊహించని అవకాశాలు.. ఈ కోర్సులపై ఓ లుక్కేయండీ..!

యోగాకి మంచి డిమాండ్

యోగాకి మంచి డిమాండ్

ప్రాచీన కాలం నుంచి యోగాకు భారత్‌లో విశిష్ట స్థానం ఉండేది. నేచురోపతి చిక్సిత విధానాలు ప్రాచీన భారతీయ సాహిత్యంలో బాగా హైలైట్ అయ్యాయి. భూమి, అగ్ని, నీరు, గాలి అనే సహజ మూలకాలు ప్రకృతి వైద్యంలో ఎంతో కీలకం. అయితే ఈ రంగాల్లో కెరీర్‌ ఆప్షన్స్‌కు ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది.

ఇంకా చదవండి ...

ఇటీవల కాలంలో యోగా, ప్రకృతి వైద్యం(నేచురోపతి)కి డిమాండ్ బాగా పెరిగింది. కరోనా కారణంగా చాలా మంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం కోసం యోగా, ప్రకృతి వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రాచీన కాలం నుంచి యోగాకు భారత్‌లో విశిష్ట స్థానం ఉండేది. నేచురోపతి చిక్సిత విధానాలు ప్రాచీన భారతీయ సాహిత్యంలో బాగా హైలైట్ అయ్యాయి. భూమి, అగ్ని, నీరు, గాలి అనే సహజ మూలకాలు ప్రకృతి వైద్యంలో ఎంతో కీలకం. అయితే ఈ రంగాల్లో కెరీర్‌ ఆప్షన్స్‌కు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. యోగా, నేచురోపతిలో కెరీర్‌ను ఎలా డెవలప్ చేసుకోవాలో పరిశీలిద్దాం.

* యోగా & నేచురోపతిలో కోర్సులు

యోగా, నేచురోపతిని కెరీర్‌గా కొనసాగించాలంటే అభ్యర్థులు 10+2 సైన్స్ కోర్సుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. నేచురల్ మెడిసిన్ సమగ్ర అధ్యయనం, ప్రస్తుత చికిత్సా విధానాలు, పాఠ్యాంశాల్లో భాగంగా ఉంటాయి. వైద్య చరిత్ర, థియరీతో పాటు ప్రాక్టికల్ వర్క్‌షాప్‌లతో ప్రకృతివైద్యం, యోగాలో సమగ్ర విద్యను అభ్యసించవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సుల నుంచి ఎంపిక చేసుకోవచ్చు.

* బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్(BNYS)

ఇది మెడికల్ డిగ్రీ ప్రోగ్రామ్. నేచురోపతి మెడిసిన్ అండ్ థెరప్యూటిక్ యోగాపై దృష్టి సారిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి 5.5 సంవత్సరాలు పడుతుంది. ఇందులో 4.5 సంవత్సరాలపాటు కోర్సు, ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ కోర్సులో ప్రవేశం పొందాలంటే నీట్ యూజీ ఉత్తీర్ణత తప్పనిసరి.

ఇదీ చదవండి: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !


* బీఎస్సీ ఇన్ యోగా అండ్ నేచరోపతి

బీఎస్సీలో యోగా అండ్ నేచురోపతి ద్వారా బ్యాచిలర్ డిగ్రీ పొందవచ్చు. ఈ కోర్సు ప్రకృతి వైద్యంపై దృష్టి సారిస్తుంది. అంతేకాకుండా వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి యోగాను ఉపయోగిస్తారు. ఈ కోర్సులో అడ్మిషన్ పొందాలంటే విద్యార్థులు 10+2 పరీక్షల్లో కనీసం 50% మార్కులు సాధించాలి.

* డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్

ఈ డిప్లొమా కోర్సు చేయాలంటే విద్యార్థులు, ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 లేదా అందుకు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి . అలాగే ఏ ఫీల్డ్‌లోనైనా కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.

డిప్లొమా ఇన్ యోగా అండ్ నేచురోపతి మూడేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్. ఇది ప్రాక్టికల్, థిరిటికల్ నాలెడ్జ్‌తో సబ్జెక్టుపై పూర్తి అవగాహనను అందిస్తుంది. కోర్సు పూర్తయిన తర్వాత, విద్యార్థులు యోగా & నేచురోపతి కేంద్రాలు, ఆయుష్, క్లినిక్స్ & హాస్పిటల్స్, హెల్త్ క్లబ్, ఈవెంట్ & స్పోర్ట్స్ సెంటర్లు, అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌లలో పని చేయవచ్చు.

ప్రధానంగా ప్రకృతి వైద్యుడు, యోగా ట్రైనర్, ఆయుర్వేద కన్సల్టెంట్, అసిస్టెంట్ ఆయుర్వేద డాక్టర్, ఆయుష్ ప్రాక్టీషనర్, ఆయుష్ ప్రొఫెసర్, హెల్త్ క్లబ్ ఇన్‌స్ట్రక్టర్, పరిశోధకుడు, థెరపిస్ట్, డైట్ & ఆయుర్వేద స్పెషలిస్ట్, ప్రకృతి వైద్యుడు, ఫిట్‌నెస్ ట్రైనర్, యోగా-ఏరోబిక్ ట్రైనర్, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, పారా-క్లినికల్ స్పెషలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, సేవలు అందించవచ్చు.

Published by:Mahesh
First published:

Tags: Career and Courses, JOBS, Nature, Yoga

ఉత్తమ కథలు