హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Fashion Designing: ఫ్యాషన్ డిజైనింగ్‌లో కెరీర్ స్టార్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే..

Fashion Designing: ఫ్యాషన్ డిజైనింగ్‌లో కెరీర్ స్టార్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే..

Fashion Designing

Fashion Designing

Fashion Designing: స్కూల్స్ నుంచి కాలేజీలకు మారే సమయంలో ప్రతి విద్యార్థి కెరీర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉండే కోర్సులను ఎంచుకోవాలి. ఇలా ఫ్యూచర్ డిమాండ్ ఉండే కోర్సుల్లో ఒకటిగా నిలుస్తోంది ఫ్యాషన్ డిజైనింగ్. ఈ రంగంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

స్కూల్స్ నుంచి కాలేజీలకు మారే సమయంలో ప్రతి విద్యార్థి (Student) కెరీర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉండే కోర్సులను ఎంచుకోవాలి. ఇలా ఫ్యూచర్ డిమాండ్ (Demand) ఉండే కోర్సుల్లో ఒకటిగా నిలుస్తోంది ఫ్యాషన్ డిజైనింగ్ (Fashion Designing). ఈ రంగంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో తెలుసుకుందాం.

ఫ్యాషన్ డిజైనింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ద్వారా ఈ సెక్టార్‌లోకి ఎంటర్ కావచ్చు. ఫ్యాషన్ అండ్ అప్పెరల్ డిజైనింగ్, ఫ్యాషన్ బిజినెస్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్, లైఫ్‌స్టైల్ అండ్ యాక్సెసరీ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, నిట్వేర్ డిజైన్ స్ట్రీమ్స్‌ను విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఫ్యాషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ నుంచి డిజైనింగ్‌లో బ్యాచిలర్స్ (BDes) వరకు విద్యార్థులు తమ అభిరుచులకు తగ్గట్టు అనేక డిగ్రీ ప్రోగ్రామ్స్ చేయవచ్చు.

* కోర్సుల వ్యవధి ఎంతంటే?

కోర్సులు మూడు నుంచి నాలుగు సంవత్సరాల డ్యూరేషన్‌తో ఉంటాయి. కొన్ని సమయాల్లో ఇన్‌స్టిట్యూట్స్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి పోటీ పరీక్షలను సైతం నిర్వహిస్తుంటాయి. షార్ట్‌టర్మ్ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు, డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సుల ద్వారా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయవచ్చు. అయితే వీటితో ఉద్యోగ అవకాశాలు, ప్లేస్‌మెంట్స్ తక్కువగా ఉంటాయి.

* కెరీర్ ఆప్షన్స్

ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవారికి కెరీర్ ఆప్షన్స్‌ చాలా ఉంటాయి. బయర్, క్రియేటివ్ డైరెక్టర్, ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్, గ్రాఫిక్ డిజైనర్, పర్సనల్ స్టైలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్, ట్రెండ్ ఫోర్‌కాస్టర్, ఫ్యాషన్ జర్నలిస్ట్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ వంటి జాబ్ రోల్స్‌లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కోర్సును బట్టి నిబంధనలు వేర్వేవేరుగా ఉంటాయి. ఫ్యాషన్ డిజైన్‌లో బీఎస్సీ చేయాలంటే, 12వ తరగతిలో సైన్స్, గణితం తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి. ఫ్యాషన్ డిజైన్‌లో బీఏ చేయాలనుకుంటే ఏదైనా స్ట్రీమ్‌లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కాలేజీలను బట్టి కూడా కొన్ని నియమాలు మారవచ్చు.

ఇది కూడా చదవండి : స్టూడెంట్స్‌కు అలర్ట్.. ఈ నెలలో అప్లై చేసుకోవాల్సిన స్కాలర్‌షిప్స్ ఇవే..!

* నేర్చుకునే అంశాలు

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులు గార్మెంట్ కన్‌స్ట్రక్షన్, ప్యాట్రన్ మేకింగ్, డ్రేపింగ్, సర్ఫేస్ ఆర్నమెంటేషన్, ఫ్యాబ్రిక్స్, థ్రెడ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్‌వేర్, గ్రాఫిక్ డిజైన్ వంటి అంశాలకు సంబంధించిన వర్క్‌ను నేర్చుకోనున్నారు. అస్థెటిక్ గార్మెంట్స్, యాక్సెసరీస్ డిమాండ్ సప్లై నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి ఫ్యాషన్ క్యాపిటల్‌లో ట్రెండ్స్, సీజన్స్, డ్రెస్సింగ్, హై డ్రెస్సింగ్ విలువలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలి. ఈ పరిశ్రమలో నిపుణులకు డిమాండ్ బాగా ఉంటుంది. ఫ్యాషన్ నిపుణుల వీడియోలు, ఫ్యాషన్ డిజైనర్ల ఇంటర్వ్యూలు, ఫ్యాషన్ పరిశ్రమ వెబ్‌సైట్స్, సోషల్ మీడియా పేజీలను తరచూ చూస్తుండాలి.

* క్రియేటివిటిలో గ్రాఫిక్ డిజైన్ కీలకం..

ఫ్యాషన్ డిజైనింగ్‌లో సాఫ్ట్‌వేర్‌ పరంగా క్రియేటివిటీ ప్రదర్శించాలంటే CAD, గ్రాఫిక్ డిజైన్ కీలకం. ఏదైనా పెద్ద ఫొటోకు సంబంధించిన కలెక్షన్స్ టెక్నాలజీ సహాయంతో పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్రాఫిక్ డిజైన్ పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాఫిక్ డిజైన్ పరంగా రీసెర్చ్ చేయడానికి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, Fashion, JOBS

ఉత్తమ కథలు