హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Garment Industry: కెరీర్ పరంగా కొత్తగా దూసుకువెళ్లాలనుకుంటున్నారా..? అయితే, ఈ ఆప్షన్ మీ కోసమే..

Garment Industry: కెరీర్ పరంగా కొత్తగా దూసుకువెళ్లాలనుకుంటున్నారా..? అయితే, ఈ ఆప్షన్ మీ కోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Garment Industry: ఇప్పుడు యువతరం కొత్తగా ఆలోచిస్తోంది. డిమాండ్ ఉండే సెక్టార్స్‌పై కాకుండా.. తమకు నచ్చిన రంగంలో సెటిల్ అవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి వారికి ఓ బెస్ట్ కెరీర్ ఆప్షన్ మీ ముందుకు తీసుకువస్తున్నాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కాలేజీల్లో చేరే విద్యార్థులు (Students) కెరీర్ పరంగా కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రంగాన్ని ఎంచుకుంటే భవిష్యత్తు (Future) బాగుంటుందో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు యువతరం కొత్తగా ఆలోచిస్తోంది. డిమాండ్ ఉండే సెక్టార్స్‌పై కాకుండా.. తమకు నచ్చిన రంగంలో సెటిల్ అవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి వారికి బెస్ట్ కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది గార్మెంట్ టెక్నాలజీ (Garment Industry). ఈ రంగంలో అవకాశాలు, సవాళ్లు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.
ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పుడు టెక్నాలజీతో లింక్ అవుతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీతో డిజైన్ ఎడ్యుకేషన్ కలపడం వల్ల దుస్తుల ఉత్పత్తికి సంబంధించిన టెక్నికల్ విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. అయితే దుస్తుల ఉత్పత్తి సక్రమంగా సాగుతుందా లేదా అని నిర్ధారించే వ్యక్తి గార్మెంట్ టెక్నాలజిస్ట్. ఈ రంగంలో వీరి బాధ్యతలు ఎంతో కీలకం. అయితే వస్త్ర ఉత్పత్తిలో టెక్నాలజీ వినియోగంతో ఇది మరో కొత్త స్థాయికి చేరుకుంటుంది.
* భవిష్యత్తుకు భరోసా
గార్మెంట్ టెక్నాలజీ పరిధి విస్తృతమైనది. ఇది వివిధ రకాల స్పెషల్ టెక్నాలజీల కలయికగా ఉంటుంది. ప్రతి టెక్నాలజీ దుస్తులను ప్రత్యేకంగా రూపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెబ్ 1.0 నుంచి న్యూ ఏజ్ టెక్నాలజీ వెబ్ 4.0ను విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో ఉద్యోగ కల్పన కూడా భారీగా పెరిగింది. వస్త్ర తయారీ పరిశ్రమలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సాంకేతికతతో, ఈ రంగంలో సాంకేతికత భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉండనుంది.


మెషిన్ లెర్నింగ్, సప్లై చైన్ అడ్వాన్స్‌మెంట్స్, ర్యాపిడ్ డేటా అనలిటిక్స్, 3D క్యాపబులిటీస్, బెస్పోక్ ప్రొడక్షన్ వంటివి ప్రస్తుతం దుస్తుల తయారీలో ఐదు హాట్ ట్రెండింగ్ టెక్నాలజీలు. గార్మెంట్ టెక్నాలజీ కోర్సు సాధారణంగా, ఫ్యాషన్ డిజైనింగ్ సాంకేతిక రంగంలో వృత్తిని కొనసాగించాలనుకునే విద్యార్థుల కోసం ఉద్దేశించినది. కోర్సు విజయవంతంగా పూర్తయిన తర్వాత, వస్త్ర ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక అంశాలకు విద్యార్థులు బాధ్యత వహిస్తారు.
* బాధ్యతలు
గార్మెంట్ టెక్నాలజిస్ట్ అంటే వస్త్ర సాంకేతిక నిపుణుడు. దుస్తుల తయారీలో వివిధ దశలలో వీరు పనిచేస్తారు. డిజైన్ సాధ్యమా కాదా అని నిర్ణయించడం నుంచి వస్త్రాన్ని తయారు చేయడానికి ఉత్తమమైన పద్ధతిని ఎంచుకోవడం వరకు అన్ని చూసుకుంటారు. అవసరమైతే డిజైన్‌ను మారుస్తారు.
అత్యుత్తమ వస్త్రాన్ని గుర్తించడం నుంచి ఉత్పత్తి బడ్జెట్‌లో ఉండేలా చూసుకోవడంలో గార్మెంట్ టెక్నాలజిస్ట్ ఎంతో చురుకుగా వ్యవహరించాలి. దుస్తుల తయారీ, గార్మెంట్ స్టైలింగ్, ఆపరేషన్స్ అండ్ మెయిన్‌టెన్స్ వరకు ప్రతి అంశం చూస్తారు. డిజైన్ టీం, ప్యాట్రన్ కట్టర్స్, కస్టమర్‌లతో కూడా కలిసి పని చేయాల్సి ఉంటుంది. బ్రాండ్, తయారీదారుల మధ్య అనుసంధానకర్తగా వ్యహరిస్తారు.
* గార్మెంట్ టెక్నాలజీ కోర్సులు
గార్మెంట్ టెక్నాలజీ కోర్సులు స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సుల నుంచి ఉన్నత స్థాయి డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, B.Des., BSc, B.A., M.Des, M.Sc వంటి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల వరకు ఉంటాయి.
ఇది కూడా చదవండి : ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్.. శ్రీరామ్స్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్ కీలక నిర్ణయం
గార్మెంట్ స్వింగ్, గార్మెంట్ మ్యానుఫ్యాక్చర్, ది హిస్టరీ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ డిజైనింగ్, సైన్స్ అండ్ లిబరల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టైలింగ్, డిజైన్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ ఆర్ట్ అండ్ స్కెచింగ్, ప్రొడక్షన్ ఆఫ్ టెక్స్‌టైల్, అపెరల్ ప్యాటర్న్ మేకింగ్, ట్రెండ్స్ అండ్ ఫోర్‌క్యాస్టింగ్ ఫర్ అఫరల్, డిజైన్ ప్రాసెస్, ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్, రిటైలింగ్ అండ్ మార్కెటింగ్ వంటి వాటిపై స్పెషలైజేషన్ చేయవచ్చు. ఇవన్నీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో కవర్ అవుతాయి. ఫ్యాషన్ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత వచ్చి చేరుతుండడంతో గార్మెంట్ టెక్నాలజిస్ట్‌లకు డిమాండ్ పెరుగుతుంది.
గార్మెంట్ టెక్నాలజిస్ట్ ముందుగా ఆర్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌పై రిసెర్చ్ చేయాలి. ప్యాట్రన్-కటింగ్ విజయవంతంగా పూర్తి చేయడానికి ముందు బాడీ షేప్, ఫాబ్రిక్ ఫర్ఫార్మెన్స్, కన్‌స్ట్రక్షన్ వంటి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాషన్ లేదా టెక్స్‌టైల్స్‌లో అర్హత సాధించిన తర్వాత, గార్మెంట్ టెక్నాలజీ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించి.. ఫ్యూచర్‌లో సాంకేతిక నిపుణులుగా మారవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు