హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career Guidance: కాస్మొటాలజిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? ఈ గైడెన్స్ మీకోసమే..!

Career Guidance: కాస్మొటాలజిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? ఈ గైడెన్స్ మీకోసమే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూస్ 18 అందిస్తున్న కెరీర్ గైడెన్స్ కాలమ్, కెరీర్‌వైజ్‌లో భాగంగా.. కాస్మొటాలజిస్ట్‌గా కెరీర్ ఎలా ఉంటుంది..? ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి..? తదితర విషయాలను పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

కెరీర్ (Career) పరంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన ఉండదు. కాబట్టి ఏదైనా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే ముందు అన్ని విధాలుగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే ఎక్స్‌ఫర్ట్ సహాయం తీసుకోవడం బెటర్. న్యూస్ 18 అందిస్తున్న కెరీర్ గైడెన్స్ కాలమ్, కెరీర్‌వైజ్‌లో భాగంగా.. కాస్మొటాలజిస్ట్‌గా కెరీర్ ఎలా ఉంటుంది..? ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి..? తదితర విషయాలను పరిశీలిద్దాం. ఇటీవల కాలంలో భారత్‌లో బ్యూటీ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. సిటీలతో పాటు పట్టణాల్లోనూ కాస్మోటిక్ క్లినిక్స్ అందుబాటులోకి వచ్చాయి. స్కిన్ అండ్ బ్యూటీ కేర్, మేకప్, హెయిర్ కేర్‌లో నైపుణ్యం ఉన్న వ్యక్తులను కాస్మొటాలజిస్ట్ అంటారు. బ్యూటీ ట్రీట్‌మెంట్‌ను అధ్యయనం చేయడాన్ని కాస్మొటాలజీ అంటారు. అనేక పద్ధతుల ద్వారా బ్యూటీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల దీని పరిధి మరింత పెరిగింది. జుట్టు, చర్మం, శరీర ఇతర భాగాలకు చికిత్స చేయడానికి విస్తరించింది. అలాగే అందానికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ భాగాలకు కూడా విస్తరించింది.

కాస్మొటాలజిస్ట్‌‌కు ఇవి తప్పనిసరి

ఒక కాస్మొటాలజిస్ట్‌కు హెయిర్‌స్టైలిస్ట్, బ్యూటీషియన్, స్కిన్-కేర్ స్పెషలిస్ట్, మేక్-ఓవర్ ఆర్టిస్ట్, నెయిల్-ఆర్ట్ స్పెషలిస్ట్, ఐ-బ్రో స్పెషలిస్ట్ గా సేవలు అందించవచ్చు. కాస్మొటాలజిస్ట్‌గా ఎదగాలంటే లక్షణాలు ఇలా ఉండాలి. ముఖ్యంగా ఈ ఫీల్డ్‌పై మక్కువ ఉండాలి. కస్టమర్లను హ్యాండిల్ చేసే సామర్థ్యం, ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఈ రంగానికి సంబంధించిన కోర్సులు చేస్తే అవకాశాలను త్వరగా అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు చేస్తూ అప్‌గ్రేడ్ అయ్యే వారికి ఎక్కడైనా అవకాశాలు వస్తాయి. అందుకే బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌ అందించే కోర్సులపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి.

Scholarship: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. రూ.50వేల స్కాలర్‌షిప్‌.. అర్హతలు ఇవే..

కాస్మొటాలజీకి సంబంధించి అనేక కోర్సులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అప్రెంటిస్‌గా మంచి పేరున్న క్లినిక్‌లో పనిచేసి ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి కాస్మొటాలజీలో డిప్లొమా చేయవచ్చు.

ఉపాధి అవకాశాలు

ఒక కాస్మొటాలజిస్ట్.. స్కిన్ కేర్ స్పెషలిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, నెయిల్స్ స్పెషలిస్ట్, ఆరోగ్య సంరక్షణ నిపుణుడిగా సిటీలతో పాటు పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రంగంలో చేరవచ్చు. పార్ట్‌టైమ్ కాస్మొటాలజిస్ట్‌గా సేవలందిస్తూ ఇతర ఉద్యోగాలను సైతం చేసుకోవచ్చు.

హై-ఎండ్ సెలూన్స్, స్ప్లెండర్ పార్లర్స్‌లో..

కాస్మొటాలజిస్ట్‌గా మీరు హై-ఎండ్ సెలూన్స్, స్ప్లెండర్ పార్లర్స్, విలాసవంతమైన హోటళ్లు/రిసార్ట్‌లలో పని చేయవచ్చు. యాడింగ్ ఏజెన్సీ, టీవీ, సినీ పరిశ్రమల్లో మేకప్ ఆర్టిస్టులుగా మంచి ఉద్యోగం పొందవచ్చు. ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నవారు బ్యూటీ థెరపీ క్లినిక్స్, స్కిన్ క్లినిక్స్, హాస్పిటల్స్ మొదలైన వాటిల్లో పని చేయవచ్చు.

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు