హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career-wise: కమ్యూనికేషన్ డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అవసరమైన స్కిల్స్, జాబ్ రోల్స్ ఇవే..

Career-wise: కమ్యూనికేషన్ డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అవసరమైన స్కిల్స్, జాబ్ రోల్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడే కెరీర్‌ను ఎంచుకోవడం ప్రధానం. ఈ నిర్ణయంపైనే విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు న్యూస్18 Career-wiseలో భాగంగా కమ్యూనికేషన్ డిజైనర్‌గా స్థిరపడాలంటే ఎలా? ప్రస్తుతం అవకాశాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Career-wise : ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడే కెరీర్‌ను ఎంచుకోవడం ప్రధానం. ఈ నిర్ణయంపైనే విద్యార్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే ఏదైనా రంగాన్ని సెలక్ట్‌ చేసుకునే ముందు ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అవకాశాలను కూడా పరిశీలించాలి. ఇప్పుడు న్యూస్18 Career-wiseలో భాగంగా కమ్యూనికేషన్ డిజైనర్‌గా స్థిరపడాలంటే ఎలా? ప్రస్తుతం అవకాశాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలు తెలుసుకుందాం.

కమ్యూనికేషన్ డిజైన్ అనేది సమాచారానికి సంబంధించినది. కమ్యూనికేషన్ డిజైన్ చేసిన వారిని కమ్యూనికేషన్ డిజైనర్స్ అంటారు. గత పదేళ్ల కాలంలో కమ్యూనికేషన్ డిజైనర్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఈ రంగాన్ని కెరీర్‌గా చాలా మంది ఎంచుకుంటున్నారు. పైగా అవకాశాలు ఏటేటా పెరుగుతున్నాయి.

పరిమితంగానే క్వాలిఫైడ్ డిజైనర్స్

ప్రస్తుతం దేశంలో హై క్వాలిఫైడ్ కమ్యూనికేషన్ డిజైనర్స్ కేవలం ఐదు వేల మంది మాత్రమే ఉన్నారు. అత్యుత్తమ కెరీర్‌ను అందించే ఈ రంగంలో ప్రస్తుతం 60,000 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ మార్కెట్ ట్రెండ్స్ కారణంగా కమ్యూనికేషన్ డిజైన్ రంగంలో విస్తారమైన అవకాశాలు, వైవిధ్యానికి భవిష్కత్‌లో మంచి స్కోప్ ఉంది. అభ్యర్థులకు లభించే జీతం ఉద్యోగ ప్రొఫైల్, నైపుణ్య స్థాయి, అకడమిక్ రికార్డ్‌ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇది ఫీల్డ్ నుంచి ఫీల్డ్‌కు మారుతూ ఉంటుంది. సాధారణంగా కమ్యూనికేషన్ డిజైనర్స్‌కు రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య జీతం ఉంటుంది.

కోర్సుల వివరాలు

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రంగంలో డిగ్రీ, డిప్లొమా లేదా సర్టిఫికేట్-స్థాయి కోర్సులను అభ్యసించవచ్చు. యూజీ, పీజీ లెవల్‌లో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ లేదా ఆన్‌లైన్ మోడ్‌లలో కోర్సులను అభ్యసించవచ్చు. కమ్యూనికేషన్ డిజైన్ కోర్సుల్లో ప్రధానంగా బ్యాచిలర్ ఇన్ డిజైన్ (BDes) ఉంది. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్ల ఉంటుంది. అదే విధంగా బ్యాచిలర్ ఇన్ అప్లైడ్ ఆర్ట్స్ (BFA) నాలుగేళ్లు, బ్యాచిలర్ ఇన్ వొకేషన్ (BVoc) మూడేళ్లు ఉంటాయి. మాస్టర్స్ లెవల్స్‌లో మాస్టర్ ఇన్ డిజైన్ (MDes), మాస్టర్ ఇన్ ఆర్ట్స్ (MA), మాస్టర్ ఇన్ వొకేషన్ (MVoc) కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఇవన్నీ రెండేళ్ల కోర్సులు. అంతేకాకుండా యూజీ, పీజీ లెవల్‌లో ఒకటి నుంచి రెండేళ్ల సర్టిఫికేషన్ కోర్సులను సెలక్ట్ చేసుకోవచ్చు.

ఈ స్కిల్స్ తప్పనిసరి

ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమలో భాగం కావాలంటే తప్పనిసరిగా కొన్ని నైపుణ్యాలను అలవర్చుకోవాలి. క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, వివిధ సాఫ్ట్‌వేర్ల పరిజ్ఞానం, అటెన్షన్ టూ డీటైల్, టీమ్ ప్లేయర్ వంటి వాటిపై పూర్తి అవగాహన ఉండాలి. కమ్యూనికేషన్ డిజైన్ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ ఇండస్ట్రీలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.

కమ్యూనికేషన్ డిజైన్‌లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారికి అవకాశాలు

అడ్వర్టైజింగ్ డిజైనర్

ఇమేజినేషన్‌పై మంచి పట్టు ఉన్న డిజైనర్లకు యాడ్స్‌ విలువైన అవకాశాలను అందిస్తాయి. అడ్వర్టైజింగ్ డిజైనర్స్ విజువల్ కమ్యూనికేషన్ గ్రూప్‌ టాస్క్‌పై పని చేస్తారు. ప్రమోషన్ డిజైనర్ వారి ఆబ్జెక్టివ్ మార్కెట్‌ను ఎక్స్‌ప్లోర్ చేయడానికి, విజువల్ కరస్పాండెన్స్ తెలియజేయడానికి టెక్నాలజీని క్రియేట్ చేస్తారు.

DigiYatra: డిజియాత్ర అంటే ఏమిటి? ఫేస్‌, బోర్డింగ్ పాస్‌లా ఎలా పనిచేస్తుంది?  ఈ సర్వీస్‌ ఫుల్‌ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి

 గ్రాఫిక్ డిజైనర్

గ్రాఫిక్ డిజైనర్స్.. రీజనింగ్‌కు సంబంధించిన అన్ని విషయాలపై ప్రత్యేకమైన దృష్టితో మొత్తం ప్రెజెంటేషన్ ప్రక్రియపై సమాచారాన్ని కలిగి ఉంటారు. గ్రాఫిక్ డిజైనర్స్ పుస్తకాలు, మ్యాగజైన్స్, ఫ్లైయర్స్ లేఅవుట్‌ను డిజైన్ చేస్తారు.

డిజైన్ డైరెక్టర్

డిజైన్ డైరెక్టర్ UI/UX, ప్రింట్, డిస్ట్రిబ్యూషన్, పబ్లిషింగ్ వంటి వాటిని విజువల్ కరస్పాండెన్స్ ప్లాన్‌తో అనుసంధానిస్తూ పరిశోధించాల్సి ఉంటుంది.

కమ్యూనికేషన్ డిజైన్ చేయడం వల్ల ఇన్ఫర్మెషన్ డిజైనర్, యానిమేషన్ అండ్ ఆన్‌లైన్ అండ్ వీడియో గేమ్ డిజైనర్, వెబ్ డిజైనర్‌గా కూడా కెరీర్‌లో స్థిరపడవచ్చు.

First published:

Tags: Career and Courses