CAREER TIPS ARE YOU TRYING FOR A GOOD PERFORMANCE IN THE INTERVIEW THEN TRY THESE COURSES EVK
Career Tips: ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో తెలిట్లేదా.. అయితే ఈ కోర్సు ట్రై చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
Career Tips | కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి, ఉన్న ఉద్యోగం మారాలి అనుకొనే వారికి ఇంటర్వ్యూ చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ (Graduation) పూర్తయిన తరువాత జాబ్ రావాలంటే స్కిల్స్‌తో పాటు ఎంతో ముఖ్యమైంది.
కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి, ఉన్న ఉద్యోగం మారాలి అనుకొనే వారికి ఇంటర్వ్యూ చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ (Graduation) పూర్తయిన తరువాత జాబ్ రావాలంటే స్కిల్స్‌తో పాటు ఎంతో ముఖ్యమైంది. ఇంగ్లీష్‌పై పట్టు. మంచి అకడమిక్ మార్కులు ఉన్నా సరే ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకపోవడంతో ఎంతో ఉద్యోగ సాధనలో వెనుకబడి పోతున్నారు. అందుకే, విద్యార్థుల్లో ఇంగ్లీష్, జాబ్ ఇంటర్వ్యూ స్కిల్స్ (Interview Skills) పెంపొందించేందుకు ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీ సఫల్టా (Safalta) ఓ సరికొత్త కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా మంచి ఇంగ్లీష్ నైపుణ్యాన్ని మీరు పొందొచ్చు. కేవలం రూ. 99లకే ఇంగ్లీష్, జాబ్ ఇంటర్వ్యూకు (Job Interview) అవసరమయ్యే కోర్సును ఆఫర్ చేస్తుంది.
విద్యార్థులు వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి, ఉద్యోగానికి సిద్ధమవ్వడానికి అతి తక్కువ ఫీజుతోనే ఈ కోర్సును అందజేస్తుంది. సెమీ- అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
24 గంటలు లైవ్ క్లాస్‌లు..
విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడం ద్వారా ఉద్యోగాల వేటలో వారిని ముందుంచాలనే లక్ష్యంతో సఫల్టా పనిచేస్తుంది. సఫల్టా ప్లాట్‌ఫాంలో ఇంగ్లీష్ అండ్ జాబ్ ఇంటర్వ్యూ కోర్సు ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభించింది. రోల్-ప్లేల ద్వారా విద్యార్థులు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకునేలా కోర్సును డిజైన్ చేసింది. వారి సెల్ఫ్ అవేర్నెస్ను పెంచడానికి, ఉద్యోగ ఇంటర్వ్యూలకు వారిని సిద్ధం చేయడానికి తగిన బాడీ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తుంది.
అందరికీ అందుబాటులో..
సఫల్టా ప్లాట్‌ఫారమ్ 8 గంటల కంటే ఎక్కువ నిడివి గల డౌన్లోడ్ మెటీరియల్‌ని కూడా అందిస్తుంది. ఈ మెటీరియల్ ద్వారా సులభంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు. జాబ్ ఇంటర్వ్యూ అండ్ ఇంగ్లీష్ స్కిల్స్ కోర్సుపై సఫల్టా సహ వ్యవస్థాపకుడు/సీఈఓ హిమాన్షు గౌతమ్ మాట్లాడుతూ, “ప్రస్తుత జాబ్ మార్కెట్లో ఇంగ్లీషు లాంగ్వేజ్‌కు ప్రాధాన్యత పెరిగింది. అనేక కంపెనీలు ఇంగ్లీష్ నైపుణ్యాలను చూసే జాబ్ ఆఫర్ చేస్తున్నాయి.
అందుకే, ఇంగ్లీష్‌లో వెనుకబడిన వారికి అవకాశాలు దక్కడం లేదు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు కాంపిటీషన్లో వెనుకబడిపోతున్నారు. అందుకే, వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కేవలం రూ. 99 ఫీజుతోనే సఫల్టాలో కోర్సును ప్రారంభిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకొని విద్యార్థులు, నిరుద్యోగులు జాబ్ మార్కెట్లో రాణిస్తారని ఆశిస్తున్నాం.” అని చెప్పారు.
భారత్‌లో డిసెంబరు 21 నాటికి 53 మిలియన్ల మంది నిరుద్యోగులున్నారు. ఈ కోర్సు ద్వారా నిరుద్యోగం, ఉపాధికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని, సెమీ-అర్బన్, గ్రామీణ భారతదేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.