ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్(Smart Phone) ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేని యువత లేరనేది అతిశయోక్తి కాదు. ఈ స్మార్ట్ ఫోన్ తో.. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా(Social Media), ఇంటర్నెట్‌పైనే (Internet) ఆధారపడుతున్నారు. ఇలా పెరుగుతున్న ఇంటర్నెట్ ప్రభావం వల్ల ప్రపంచం మరింత దగ్గరవుతోంది. సామాజిక మాధ్యమాలు, సామాజిక వేదికలు చాలా మందికి ఉపాధిని అందుబాటులోకి తెచ్చాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. అందువల్ల ఇంటర్నెట్ అండ్ డిజిటల్‌గా బలంగా ఉన్న వ్యక్తులకు అనేక కెరీర్ అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి కెరీర్‌ని సంపాదించుకునే కొన్ని రంగాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
బ్లాగర్
మీరు చదవడం , రాయడంలో మంచి ప్రామిణ్యత ఉంటే.. ఈ బ్లాగర్ ను స్టార్ట్ చేసుకోవచ్చు. మీ అభిప్రాయాన్ని లక్షలాది మందికి సాధారణ పదాలలో తెలియజేయాలనుకుంటే, మీరు దానిని బ్లాగ్ ద్వారా చేయవచ్చు. ఈ ఫీల్డ్‌లోని ఉద్యోగాలలో కంటెంట్ రైటింగ్, ఎడిటింగ్ మరియు ప్రమోషన్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. వీటిలో జీతం ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయి.. లేదా సొంతంగా కూడా బ్లాక్ తయారు చేసుకొని సంపాదించవచ్చు.
SEO టెక్నాలజీ
ఇంటర్నెట్లో మిలియన్ల కొద్దీ వెబ్సైట్లు ఉన్నాయి. కానీ కొన్ని వెబ్సైట్లు ప్రజల వద్దకు తీసుకెల్లి.. వారిని చదివే విధంగా ప్రోత్సహిస్తాయి. దీని కోసం తమ వెబ్ సైట్ కు సంబంధించి ఆర్టికల్ ను సెర్చ్ ఇంజన్లలో మొదటగా కినిపించే విధంగా ప్రయత్నిస్తారు. దీని కోసం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) నిపుణుడు అవసరం అవుతుంది. ఈ ఇంటర్నెట్ రంగంలో ఈ ఉద్యోగాలను కూడ పొందే అవకాశం ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చే ఇనిస్టిట్యూట్స్ కూడా ఉన్నాయి.
డిజిటల్ మార్కెటింగ్..
మార్కెటింగ్ రంగంలో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారింది. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ లేదా మేనేజర్ ఏదైనా కంపెనీ ఆన్లైన్ మార్కెటింగ్, ఇమెయిల్ మార్కెటింగ్, Facebook మరియు ఇతర సోషల్ మీడియా మార్కెటింగ్‌ని మెరుగుపరచడానికి పని చేస్తారు. ఈ రంగంలో కూడా సంవత్సరానికి రూ. లక్షల్లో ప్యాకేజీ ఉంటుంది.
డిజిటల్ యాడ్స్..
డిజిటల్ మార్కెటింగ్ లాగానే, డిజిటల్ అడ్వర్టైజింగ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా మీరు ఫేస్బుక్, ట్విట్టర్ , యూట్యూబ్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కంపెనీ ఉత్పత్తులను ప్రచారం చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ప్రకటనలు లేకుండా కంపెనీ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లదు. మీకు ఈ రంగంలో నైపుణ్యం ఉంటే, చాలా కంపెనీలు మిమ్మల్ని నిపుణుడిగా నియమించుకోవచ్చు.
వెబ్సైట్ ట్రాఫిక్ ప్లానర్..
ఈ రోజుల్లో ప్రతి కంపెనీ తమ వెబ్‌సైట్‌కి గరిష్ట ట్రాఫిక్ని కోరుకుంటోంది. ట్రాఫిక్‌ను పెంచడానికి, గరిష్ట మొత్తంలో ట్రాఫిక్‌ను తీసుకురావడమే పనిగా ఉండే ప్లానర్ అవసరం. అందుకోసం వెబ్సైట్లో ప్రకటనకు మరింత రీచ్ ఇచ్చే పని కూడా జరుగుతుంది. ఈ రంగంలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Career and Courses, JOBS, Telangana government jobs