Home /News /jobs /

CAREER IN MEDICAL COURSES WITHOUT NEET BSC NURSING AGRIBUSINESS NUTRITION BIOTECHNOLOGY AND OTHER COURSES DETAILS HERE VB

Career In Medical Courses: NEET లేకుండా కూడా వైద్య వృత్తిని చేపట్టోచ్చు.. రూ.లక్షల్లో జీతం.. ఎలా అంటే..

Career In Medical Courses: NEET లేకుండా కూడా వైద్య వృత్తిని చేపట్టోచ్చు.. రూ.లక్షల్లో జీతం.. ఎలా అంటే..

Career In Medical Courses: NEET లేకుండా కూడా వైద్య వృత్తిని చేపట్టోచ్చు.. రూ.లక్షల్లో జీతం.. ఎలా అంటే..

Career In Medical Courses: డాక్టర్‌గా ఎదగాలని.. రోగులకు సేవ చేయాలని చాలా మంది యువత కలలు కంటారు. ఈ కలను నిజం చేసుకోవడానికి పాఠశాల జీవితం నుండి చాలా కష్టపడి చదువుకుంటారు. కానీ ప్రస్తుత విద్యా విధానం ప్రకారం మెడికల్ బ్రాంచ్‌లో ప్రవేశం పొందాలంటే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి.

ఇంకా చదవండి ...
డాక్టర్‌గా(Doctor) ఎదగాలని.. రోగులకు సేవ చేయాలని చాలా మంది యువత కలలు కంటారు. ఈ కలను నిజం చేసుకోవడానికి పాఠశాల జీవితం నుండి చాలా కష్టపడి చదువుకుంటారు. కానీ ప్రస్తుత విద్యా విధానం ప్రకారం మెడికల్ బ్రాంచ్‌లో(Medical Branch) ప్రవేశం పొందాలంటే నీట్ పరీక్షలో(NEET Exam) ఉత్తీర్ణత తప్పనిసరి. 12వ తరగతి మార్కులు మరియు నీట్ మార్కుల ఆధారంగా.. సంబంధిత విద్యార్థులు MBBS లేదా BDS కోసం దేశంలోని అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. కొన్ని కారణాల వల్ల.. చాలా మంది విద్యార్థులు(Students) పరీక్షను సరిగ్గా రాయలేరు. అనుకున్నంత ర్యాంక్(Rank) రాకపోవచ్చు. ఇలాంటి వారు వైద్య వృత్తిలోకి వెళ్లేందుకు అవకాశం లేదనే భావనలో ఉంటారు. కానీ అలాంటి ఆలోచన తప్పు. పరీక్షలో బాగా ఉత్తీర్ణత సాధించకపోయినా సైన్స్ చదివి మంచి కెరీర్‌ను(Career) సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

Bank Jobs 2022: EXIM బ్యాంక్ లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా.. 


12వ తరగతి బోర్డు పరీక్షతో పాటు.. మెడికల్ స్ట్రీమ్‌లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు నీట్ పరీక్షకు సిద్ధమవుతారు. ఈ పరీక్ష లేకుండా కూడా వైద్య రంగంలో మంచి కెరీర్ ఎంచుకోవచ్చు. 12వ తరగతి పాసైన తర్వాత BSc బయోటెక్నాలజీ మీకు ఉత్తమ ఎంపిక. దీని కోసం పరీక్షలో బాగా ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేదు. ఈ బ్రాంచ్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మీరు బయోటెక్నాలజిస్ట్‌గా మంచి జీతంతో కూడిన ఉద్యోగం పొందవచ్చు.



ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ లేదా మ్యాథ్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణులైతే.. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సును అభ్యసించవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత స్టాఫ్ నర్స్, రిజిస్టర్డ్ నర్స్ (RN), నర్స్ టీచర్, వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్ కోర్సు కోసం పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో నీట్ పరీక్షలో మార్కుల ఆధారంగా బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. B.Sc నర్సింగ్ చేసిన తర్వాత సంవత్సరానికి రూ. 3 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ కోర్సు ముఖ్యంగా మహిళా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

IBPS Clerk Preparation Tips: ఐబీపీఎస్ పరీక్షలో Mathematics అంటే భయపడుతున్నారా.. ఇలా చేస్తే మార్కుల పంట పండినట్లే..


12వ తరగతి తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ కూడా మంచి ఎంపిక. ఈ కోర్సు దేశవ్యాప్తంగా అనేక కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో అందుబాటులో ఉంది. దీనికి ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత మీరు అగ్రోనమిస్ట్, అగ్రికల్చరల్ సైంటిస్ట్, అగ్రిబిజినెస్ తదితర రంగాల్లో పని చేయవచ్చు. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించినా లేదా మంచి వ్యాపారం చేసినా ఏడాదికి రూ. 9 నుంచి రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు.

12వ తరగతి తర్వాత బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్, హ్యూమన్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ కోర్సులు చేయవచ్చు. ఈ కోర్సులు మూడు, నాలుగేళ్లలో పూర్తవుతాయి. ఈ విద్య తర్వాత న్యూట్రిషనిస్ట్, ఫుడ్ టెక్నాలజిస్ట్ మరియు రీసెర్చ్‌గా పని చేయవచ్చు. ఈ ఉద్యోగం ద్వారా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Doctors, JOBS, NEET, NEET 2022, Neet exam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు