మార్కెటింగ్ మేనేజ్‌మెంట్(Marketing Management) అనేది ఒక విశాలమైన రంగం. దాని పరిధి ప్రతిచోటా కనిపిస్తుంది. సంస్థ యొక్క చాలా బాధ్యత మార్కెటింగ్ మేనేజర్‌పై(Marketing Manager) ఉంటుంది. కంపెనీకి లాభం వచ్చినా నష్టం(Profit Or Loss) వచ్చినా అది మార్కెటింగ్ పైనే(Marketing) అధారపడి ఉంటుంది. ఈ రంగంలో అనేక కెరీర్ అవకాశాలు(Career Opportunity) ఉన్నాయి. రానున్న కాలంలో ఈ రంగం మరింత విస్తరించనుంది. భారతదేశంలో అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగాలను సృష్టించే ప్రధాన రంగాలలో ఒకటి మార్కెటింగ్ రంగం. మార్కెటింగ్ రంగంలోకి(Marketing Sector) ప్రవేశించాలంటే కనీసం 50 నుంచి 55 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఆ తర్వాత గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశం లభిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు కూడా 55 శాతం మార్కులు ఉండాలి. ఆ తర్వాత పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా లభిస్తుంది. అందుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలో 55 నుంచి 60 శాతం మార్కులు ఉండటం తప్పనిసరి. రెండు స్థాయిలలో ప్రవేశ పరీక్షకు సదుపాయం ఉంది.
12 తర్వాత మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో కోర్సు..
12 తర్వాత మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు ఇందులో డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులు రెండింటినీ చేయవచ్చు. డిప్లొమా ఒక సంవత్సరం కాలవ్యవధి. ఇది మార్కెటింగ్‌కు సంబంధించిన ప్రాథమిక జ్ఞానం, నైపుణ్యాలను బోధిస్తుంది.
డిగ్రీ..
ఒక విద్యార్థి 12వ తరగతి తర్వాత మార్కెటింగ్ కోర్సును అభ్యసించాలనుకుంటే విద్యార్థి BA లేదా BBA గ్రాడ్యుయేషన్ చేయవచ్చు. గ్రాడ్యుయేట్ స్థాయిలో విద్యార్థులకు మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అధునాతన పరిజ్ఞానం అందించబడుతుంది. ఈ కోర్సు వ్యవధి మూడేళ్లు. గ్రాడ్యుయేషన్ తర్వాత, ఈ సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను కూడా అభ్యసించవచ్చు. దీని తర్వాత పీహెచ్‌డీ కోసం నమోదు చేసుకోవచ్చు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య..
మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో.. విద్యార్థులు MA లేదా MBA వంటి రెండు సంవత్సరాల పోస్ట్-గ్రాడ్యుయేషన్ కోర్సును తీసుకోవచ్చు. MBA మొదటి సంవత్సరంలో.. ఒక విద్యార్థి గ్రాడ్యుయేట్ అధ్యయనాలకు సంబంధించిన సబ్జెక్టులను చదవాలి. రెండో సంవత్సరంలో మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన చదువులు నేర్పిస్తారు. ఇది మార్కెటింగ్ కళను నేర్పుతుంది.
కోర్సులో ప్రవేశం ఎలా ..
MBAలో ప్రవేశం ప్రత్యక్ష అండ్ ప్రవేశ పరీక్ష ఆధారంగా చేయవచ్చు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మెరిట్ జాబితా ఆధారంగా ప్రవేశం జరుగుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి చాలా కృషి , సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం. ఈ పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష యొక్క ఫార్మాట్ చాలా విస్తృతమైనది. మార్కెటింగ్ రంగానికి సంబంధించిన అధ్యయనాలు, ఉద్యోగాలను అందించే వివిధ వెబ్‌సైట్‌ల ద్వారా ఈ పరీక్షల గురించి సమాచారాన్ని పొందవచ్చు.
ఉద్యోగావకాశాలు..
ఏ రంగం తీసుకున్నా మార్కెటింగ్ అవసరం. మార్కెటింగ్ చదివిన తర్వాత పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్ రంగం, కన్సల్టెన్సీ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసులు, డిపార్ట్‌మెంట్ స్టోర్లు, కంప్యూటర్ కంపెనీలు, ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్లు, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఈ రంగంలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో.. ఈ రంగంలో వార్షిక ప్యాకేజీ రూ.3 నుండి 4 లక్షలు. మార్కెటింగ్ మేనేజర్లు అనుభవం తర్వాత సంవత్సరానికి రూ. 8 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు సంపాదించవచ్చు.
మార్కెటింగ్ కోర్సులను అభ్యసించడానికి దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు
1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్.
2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బెంగళూరు.
3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కోల్‌కతా.
4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, లక్నో.
5. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై.
6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కోజికోడ్.
7. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్.
8. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ.
9. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ.
10. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లేబర్ రిలేషన్స్, జమ్‌దేష్‌పూర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Digital marketing, Govt Jobs 2022, JOBS, Marketing, Private Jobs