హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career In Agriculture: వ్యవసాయ రంగంలో మస్తు ఉద్యోగాలు.. మొదట్లోనే రూ.5 లక్షల వార్షిక ప్యాకేజీ..

Career In Agriculture: వ్యవసాయ రంగంలో మస్తు ఉద్యోగాలు.. మొదట్లోనే రూ.5 లక్షల వార్షిక ప్యాకేజీ..

Career In Agriculture: వ్యవసాయ రంగంలో మస్తు ఉద్యోగాలు.. మొదట్లోనే రూ.5 లక్షల వార్షిక ప్యాకేజీ..

Career In Agriculture: వ్యవసాయ రంగంలో మస్తు ఉద్యోగాలు.. మొదట్లోనే రూ.5 లక్షల వార్షిక ప్యాకేజీ..

మన భారతదేశం వ్యవసాయ దేశం. అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం నుంచి భారీ సహకారం అందుతోంది. వ్యవసాయ రంగం నేటి యుగంలో చాలా పెద్ద ఉపాధి వనరుగా పరిగణించబడుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

మన భారతదేశం వ్యవసాయ దేశం(Agriculture Country). అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం నుంచి భారీ సహకారం అందుతోంది. వ్యవసాయ రంగం నేటి యుగంలో చాలా పెద్ద ఉపాధి వనరుగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్(Agriculture Engineering) వంటి స్ట్రీమ్‌ల(Stream) నుండి చదువుతున్న యువతకు ఇది ఎంతగానో ఉదపయోగపడుతుంది. అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అనేది వ్యవసాయ రంగంలో ఉపయోగించే వ్యవసాయ పరికరాలు మరియు యంత్రాల తయారీ, రూపకల్పన, మెరుగుదలలతో వ్యవహరించే ఇంజనీరింగ్ శాఖ. వ్యవసాయ ఇంజినీరింగ్‌లో(Engineering) నైపుణ్యం కలిగిన విద్యార్థులు మరింత సమర్థవంతంగా పనిచేసే కొత్త వ్యవసాయ పరికరాలను రూపొందిస్తారు.

Government Job Notifications: TSPSCతో సహా.. ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఇవే..

వ్యవసాయ ఇంజనీర్ల ప్రధాన పాత్ర మెరుగైన ఇంజనీరింగ్ పద్ధతులు, ఆవిష్కరణలు, సాంకేతికత , పరికరాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరచడం. ఇది మంచి పంట ఉత్పత్తికి , వ్యవసాయంలో మంచి రాబడికి దారి తీస్తుంది. ఆధునిక టెక్నాలజీతో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఏకీకృతం చేయాలనే అభిరుచి ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ స్ట్రీమ్‌ను ఎంచుకోవాలి. రాబోయే సంవత్సరాల్లో, వ్యవసాయ ఇంజనీర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

కెరీర్ ఎంపిక ఎలా..

వ్యవసాయ ఇంజనీర్ల కోసం ప్రభుత్వ సంస్థల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం, వ్యవసాయంలో పరిశోధనా అభివృద్ధి కోసం ప్రైవేట్ రంగం పెద్ద సంఖ్యలో వ్యవసాయ ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ డిపార్ట్‌మెంట్, రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ వంటి అనేక ఇతర రంగాలలో అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ కోసం సృష్టించబడిన ఖాళీల కోసం వ్యవసాయ రంగంలో B.Tech , M.Tech విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియాలో చాలా కంపెనీలు వ్యవసాయ ఇంజనీర్ల కోసం ఎదురు చూస్తుంటాయి.

అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థులకు ప్రైవేట్ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా.. వ్యవసాయ ఇంజనీర్లు బోధనా రంగం వైపు కూడ వెళ్లొచ్చు. కొత్త వ్యవసాయం ఇంజనీర్లు తయారు అవ్వడానికి మీ వంతు సహకారాన్ని బోధన రూపేనా అందించొచ్చు. బోధనా రంగంలో కూడా మంచి జీతాలు ఇస్తున్న కాలీజీలు ఉన్నాయి.

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

జీతం..

ఈ రంగంలో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత విద్యార్థులు ప్రారంభ దశలో సంవత్సరానికి రూ. 3 నుండి రూ. 5 లక్షల వరకు సంపాదించవచ్చు. కాలక్రమేణా, ఈ రంగంలో అనుభవం ఆధారంగా జీతం పెరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వ సంస్థలో ఈ ఉద్యోగం సంపాదించుకుంటే ప్రారంభ జీతం నెలకు రూ. 50 నుండి 70 వేల రూపాయల వరకు ప్రారంభమవుతుంది. ఏ ఉద్యోగంలోనైనా మొదట్లో కొంచెం తక్కువ జీతం వస్తుందని గుర్తుంచుకోండి. అదే జీతం మీ పనితీరు.. అనుభంం ఆదారంగా కాలక్రమేణా జీతం పెరుగుతుంది.

Published by:Veera Babu
First published:

Tags: Agriculture, Career and Courses, JOBS, New Agriculture Acts

ఉత్తమ కథలు