గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టిప్స్ పాటించండి..

ఇంతకుముందు లేనన్నీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్‌ని ఇరుప్రభుత్వాలు జారీ చేశాయి. దీంతో చాలామంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఎంతసేపు కోచింగ్, క్లాసులకి వెళ్లడంతోనే జాబ్ రాదు. అందుకు తగ్గ ప్రిపరేషన్ కూడా ఉండాలంటున్నారు నిపుణులు. ప్రభుత్వ కొలువు సంపాదించాలంటే కొన్నిపాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Amala Ravula | news18-telugu
Updated: May 7, 2019, 1:11 PM IST
గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టిప్స్ పాటించండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: May 7, 2019, 1:11 PM IST
ఇంతకుముందు లేనన్నీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్‌ని ఇరుప్రభుత్వాలు జారీ చేశాయి. దీంతో చాలామంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఎంతసేపు కోచింగ్, క్లాసులకి వెళ్లడంతోనే జాబ్ రాదు. అందుకు తగ్గ ప్రిపరేషన్ కూడా ఉండాలంటున్నారు నిపుణులు. ప్రభుత్వ కొలువు సంపాదించాలంటే కొన్నిపాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
* టైమ్‌టేబుల్ పెట్టుకుని చదవాలి. విషయంపై ఖచ్చితమైన అవగాహన ఉండాలి.
* ఇప్పుడు నిర్వహించే అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్‌లో రీజనింగ్, ఆర్థమేటిక్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి.

* రోజు తప్పనిసరిగా న్యూస్ పేపర్ చదవాలి. కరెంట్ ఇష్యూస్‌ తెలుసుకోవాలి.
* రాజ్యాంగం గురించి కనీస అవగాహన ముఖ్యం.
* భారత ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

* ఇంగ్లీష్ గ్రామర్‌పై పట్టుండాలి.
* ప్రభుత్వ పథకాలగురించి తెలుసుకోవాలి. ఏ పథకం ఎప్పుడూ, ఎందుకు, ఎవరికోసం, ఎవరు ప్రవేశపెట్టారనే వాటిపై కచ్చిత అవగాహన అవసరం.
* చాలామంది తక్కువ టైమ్ ఉందని.. ఎక్కువ సబ్జెక్ట్ చదవాలని త్వరత్వరగా చదువుతుంటారు. కానీ.. అందువల్ల ఉపయోగం ఉండదు. చదివేది కొన్ని సబ్జెక్ట్స్ అయినా.. వాటిని క్షుణ్ణంగా చదివితే మేలు.
ఇలా ఓ విధానంలో చదివితే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కష్టమైన పనేం కాదని నిపుణులు చెబుతున్నారు.
First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...