Career : 8వ తరగతి చదివితే చాలు.. కోర్సులో జాయిన్ చేసుకుని జాబ్ ఇస్తారు..

చాలామంది డిగ్రీలు చేస్తేనే మంచి జాబ్ వస్తుందనుకుంటారు. కానీ, కొన్నిసంస్థలు ఎనిమిది పాసైనా చాలు.. కోర్సులు తామే నేర్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.

Amala Ravula | news18-telugu
Updated: May 7, 2019, 12:26 PM IST
Career : 8వ తరగతి చదివితే చాలు.. కోర్సులో జాయిన్ చేసుకుని జాబ్ ఇస్తారు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: May 7, 2019, 12:26 PM IST
నిర్మాణరంగంలో ఉపాధి అవకాశాలు ఎప్పుడూ కూడా ఉంటాయి. అయితే, ఇందులోకి ఎలా వెళ్ళాలి.. ఏ కోర్సు నేర్చుకోవాలనే విషయం తెలియక చాలామంది అటువైపు మొగ్గుచూపరు.. అలాంటి వారి కోసమే స్కిల్స్‌కి సంబంధించిన కోర్సులను నేర్పించి ఉపాధిరంగంలో ప్రోత్సహిస్తోంది హైదరాబాద్‌లోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్’. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ కూడా అంతగా అవసరం లేదు. ఎనిమిదో తరగతి చాలు అని చెబుతున్నారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారికి కోర్స్ పూర్తిగా ఫ్రీ. జనరల్ అభ్యర్థులకు కూడా ఫీజు చాలా తక్కువగా ఉంటుంది.
ప్రవేశాలు : ప్రతి నెలా 1, 16 తారీఖున ప్రవేశాలు మొదలవుతాయి.
కోర్సులు : ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ప్రోగ్రామ్ , వెల్డింగ్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, స్టోర్ కీపర్, జనరల్ వర్క్స్, సూపర్ వైజర్, ఇతర కోర్సులు

కోర్స్ పూర్తయ్యాక అభ్యర్థులందరికీ పరీక్ష ఉంటుంది. ఈ మార్క్స్ ఆధారంగా సర్టిఫికెట్లు ఇస్తారు. ఇదే చాలా ముఖ్యం.
కోర్సుసమయం : మూడు నెలలు(శిక్షణ సమయంలో అభ్యర్థికి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయి)
ఇక్కడ మరో విశేషమేంటంటే శిక్షణ పూర్తైన తర్వాత కూడా మూడు నెలల పాటు వెయ్యి రూపాయల చొప్పున అకౌంట్‌లో వేస్తారు.


సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ : 8328622455, 9395102825
వెబ్‌సైట్ లింక్ : www.nac.edu.in

ఇవి కూడా చదవండి..

Govt Jobs : AIIMSలో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు, భారీగా జీతాలు..
First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...