CAREER GUIDANCE IF NEET 2021 NOT PASS THEN KNOW WHAT TO DO NEXT EVK
Career Guidance : నీట్ రాకున్నా.. వైద్య వృత్తిలో కొనసాగవచ్చు ఇలా
ప్రతీకాత్మక చిత్రం
Career Guidance : మెడిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్(హానర్స్) కోర్సుకు నీట్ తప్పని సరి చేశారు. ఈ నేపథ్యంలో నీట్ పాస్ కాకున్నా.. వైద్య రంగంలో చేయడానికి మంచి కోర్సులు ఉన్నాయి. వాటికి మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి.
మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష నీట్(National Entrance Exam) పాస్ కాకుంటే మంచి కెరీర్ ఆగిపోయినట్టు కాదు. వైద్య రంగం (Medical Field)లో ఎన్నో కోర్సులు మంచి కెరీర్ (Career)ను ఇస్తాయి. ఏటా పరీక్ష రాసిన వారిలో 56 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. నీట్ (NEET)లో క్వాలిఫై కాకపోయినా వైద్య విద్యనభ్యసించాలనే కోరిక కొందరిలో బలంగా ఉంటుంది. అటువంటి వారు ప్రత్యామ్నాయ మెడికల్ కోర్సుల (Optional Medical Courses) వైపు చూడవచ్చు. ఆ కోర్సుల గురించి తెలుసుకుందాం. ఈ కోర్సులకు ఇంటర్ (Inter)లో ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ , బయోలజీ (Biology) చదివిన ఔత్సాహికులు వీటికి అర్హులు.
ఫార్మసీ..
ఫార్మసీ కోర్సు చేయాలనుకొనే వారు బీఫార్మసీలో చేరాలి. చాలా కళాశాలల్లో బీఫార్మసీకి సంబంధించి విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అడ్మిషన్ పొందడానికి TSEAMCET, MHTCET, PUCET, BITSAT, KCET ఎంట్రెన్స్ టెస్టులు రాయాలి. ఈ కోర్సులు చేసిన వారికి ఫార్మాసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ అవకాశాలతో పాటు ఎన్నో సంస్థల్లో ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది.
ఫిజియోథెరపీ..
శరీర భాగాలకు సంబంధించిన కండరాల కదలికలు, ఆరోగ్య సమస్యలను ఫిజియోథెరపీ ద్వారానే పరిష్కరిస్తారు. ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులు. మార్కెట్ (Market)లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగాల్లో ఇది ఒకటి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సు చేస్తే బాగుంటుంది.
సైకాలజీ..
మనిషి మానసిక స్థితిగతులకు అధ్యయనం చేయడమే సైకాలజీ (మనస్తత్వశాస్త్రం). సైకాలజీలో బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) హానర్స్ చేయొచ్చు. ఇంటర్ (Inter)లో 50శాతం ఉత్తీర్ణత ఉన్నవారు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. ఈ కోర్సు చేసిన వారికి ఆస్పత్రుల్లో సైకాలజిస్ట్‌గా, స్కూల్లో పని చేయొచ్చు. ప్రైవేటుగా క్లినిక్ నిర్వహించుకోవచ్చు.
పోషకాహార నిపుణుడు/డైటీషియన్..
ప్రస్తుతం వైద్య రంగంలో పోషకాహార నిపుణుల అవసరం ఉంది. డైట్ కంట్రోలింగ్ (Diet Controlling) , ఆరోగ్యవంతమైన జీవన శైలి అవర్చు కోవడానికి డైటీషియన్ అవసరం. బ్యాచలర్ ఆఫ్ సైన్స్ లో న్యూట్రిషియన్ అండ్ డైటీషియన్ కోర్సు చేయొచ్చు. సర్టిఫైడ్ డైటీషియన్లకు అన్ని ఆస్పత్రుల్లో, క్లినిక్‌లతో పాటు క్రీడారంగంలోనూ ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
ఇవే కాకుండా ఇంటర్ పూర్తి చేసిన వారికి బీఎస్సీ జువాలజీ(జంతుశాస్త్రం), బీఎస్సీ బాటనీ, వైద్య రంగానికి సంబంధించి బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నీట్-2021 సెప్టెంబర్ 12,13 భాషల్లో నిర్వహించనున్నారు. గతంలో కంటే పరీక్షలో అడికే ప్రశ్నల సంఖ్య 180 నుంచి 200 వరకు పెంచారు.. విద్యార్థులు 180 ప్రశ్నలు రాయాలి.. అదనంగా ఇచ్చిన ప్రశ్నలు ప్రత్నామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్(హానర్స్) కోర్సుకు నీట్ తప్పని సరి చేశారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.