Career Guidance: టెన్త్ తర్వాత చదవాల్సిన కోర్సులు ఇవే...

Career After 10th | మీరు టెన్త్ తర్వాత కెరీర్ ఎంచుకునే విషయంలో కాస్త అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఇష్టాలు, అభిరుచులకు తగ్గట్టుగానే కోర్సుల్ని ఎంచుకోవాలి.

news18-telugu
Updated: May 4, 2019, 4:12 PM IST
Career Guidance: టెన్త్ తర్వాత చదవాల్సిన కోర్సులు ఇవే...
Career Guidance: టెన్త్ తర్వాత చదవాల్సిన కోర్సులు ఇవే... (ప్రతీకాత్మక చిత్రం, image: PTI)
news18-telugu
Updated: May 4, 2019, 4:12 PM IST
పదోతరగతి... ప్రతి ఒక్కరి కెరీర్‌లో కీలకమైన మలుపు ఇది. పదో తరగతి పాసైన తర్వాతే కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే విద్యార్థులకు పదో తరగతి క్రాస్‌రోడ్స్ లాంటిది. టెన్త్ పాస్ కాగానే ఇక కెరీర్‌లో ఎటు వైపు అడుగులు వేయాలో అన్న డైలమా చాలామంది విద్యార్థుల్లో ఉంటుంది. టెన్త్ తర్వాత ఎంచుకునే కోర్సులే కెరీర్‌ను నిర్ణయిస్తాయి. అందుకే పదో తరగతి పాస్ కాగానే కోర్సుల్ని, కెరీర్‌ను ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన కోర్సుల్ని ఎంచుకుంటేనే కెరీర్ కూడా హ్యాపీగా సాగిపోతుంది. లేదంటే కెరీర్ గందరగోళంగా మారడం ఖాయం. మరి మీరు కూడా టెన్త్ తర్వాత ఏ కోర్సులు ఎంచుకోవాలి? కెరీర్ ఎలా తీర్చిదిద్దుకోవాలన్న డైలమాలో ఉన్నారా? అయితే ఈ కెరీర్ ఆప్షన్స్‌ని పరిశీలించండి.

టెన్త్ తర్వాత ఈ కోర్సులు ఎంచుకోవచ్చు


సైన్స్: మీకు సైన్స్ అంటే ఇష్టమా? అయితే టెన్త్ తర్వాత సైన్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌తో కోర్సులు చేయొచ్చు. ఇంటర్‌లో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ లాంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్, వైద్య రంగం వైపు వెళ్లాలనుకునేవాళ్లు సైన్స్ కోర్సుల తర్వాత ఎంసెట్, జేఈఈ, బిట్‌శాట్, నీట్ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందొచ్చు. మ్యాథ్స్, సైన్స్ ఇష్టమైతే ఈ కోర్సులు ఎంచుకోవచ్చు.

MPC - మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
MEC - మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్
MBPC - మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ


BiPC - బయాలజీ(బాటనీ, జూవాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీ
Loading...
Career Guidance, career after 10th, career options for tenth students, career options after 10th in science stream, after 10th courses for girl, career guidance after 10th, list of career options after 10th, career options after 10th in commerce, career options after 10th in arts, ssc results 2019 telangana, ssc results 2019 andhrapradesh, TS SSC Results 2019, AP SSC Results 2019, కెరీర్ గైడెన్స్, టెన్త్ తర్వాత, పదో తరగతి తర్వాత, 10 తర్వాత కోర్సులు, టెన్త్ తర్వాత కోర్సులు, ఇంటర్మీడియట్ కోర్సులు, టెన్త్ రిజల్ట్స్, పదోతరగతి ఫలితాలు, తెలంగాణ టెన్త్ రిజల్ట్స్, ఏపీ టెన్త్ రిజల్ట్స్
(ప్రతీకాత్మక చిత్రం)


కామర్స్: మీకు బిజినెస్ అంటే ఇష్టమా? అయితే కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. ఇంటర్‌లోనే సీఈసీ కోర్సులుంటాయి. చార్టెర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, అకౌంటెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లాంటి కెరీర్ కోసం కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవాలి. కామర్స్‌లో బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీ, బిజినెస్ లా లాంటి సబ్డెక్ట్స్ ఉంటాయి. కామర్స్ ఇష్టమైతే ఈ కోర్సులు ఎంచుకోవచ్చు.

CEC - సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్
HEC - హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్ లేదా కామర్స్

Career Guidance, career after 10th, career options for tenth students, career options after 10th in science stream, after 10th courses for girl, career guidance after 10th, list of career options after 10th, career options after 10th in commerce, career options after 10th in arts, ssc results 2019 telangana, ssc results 2019 andhrapradesh, TS SSC Results 2019, AP SSC Results 2019, కెరీర్ గైడెన్స్, టెన్త్ తర్వాత, పదో తరగతి తర్వాత, 10 తర్వాత కోర్సులు, టెన్త్ తర్వాత కోర్సులు, ఇంటర్మీడియట్ కోర్సులు, టెన్త్ రిజల్ట్స్, పదోతరగతి ఫలితాలు, తెలంగాణ టెన్త్ రిజల్ట్స్, ఏపీ టెన్త్ రిజల్ట్స్
(ప్రతీకాత్మక చిత్రం)


ఆర్ట్స్: సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్, సోషియాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఇష్టమైతే ఆర్ట్స్ కోర్సులు ఎంచుకోవాలి. జర్నలిజమ్, లిటరేచర్, సోషల్ వర్క్, టీచింగ్ ఫీల్డ్స్‌లో కెరీర్ తీర్చిదిద్దుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, అరబిక్ లాంగ్వేజెస్ కోర్సులు చేయొచ్చు.

ప్రొఫెషనల్: పదో తరగతి తర్వాతే ప్రొఫెషనల్ కోర్సుల్నీ ఎంచుకోవచ్చు. డిప్లొమా, వొకేషనల్, సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, ఫిట్టర్, మెకానిక్, టెక్నీషియన్ కోర్సులు చేయొచ్చు. పాలిటెక్నిక్ ద్వారా టెక్నికల్ కోర్సులు చేయొచ్చు. టెక్నికల్ కోర్సులు ఇవే...

డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్
డిప్లొమా ఇన్ గార్మెంట్ టెక్నాలజీ
డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ కోర్స్
డిప్లొమా ఇన్ ఇన్స్యూరెన్స్ అండ్ మార్కెటింగ్
టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్
ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్
హోటల్ ఆపరేషన్స్ కోర్స్
డెంటల్ టెక్నీషియన్ కోర్స్

Career Guidance, career after 10th, career options for tenth students, career options after 10th in science stream, after 10th courses for girl, career guidance after 10th, list of career options after 10th, career options after 10th in commerce, career options after 10th in arts, ssc results 2019 telangana, ssc results 2019 andhrapradesh, TS SSC Results 2019, AP SSC Results 2019, కెరీర్ గైడెన్స్, టెన్త్ తర్వాత, పదో తరగతి తర్వాత, 10 తర్వాత కోర్సులు, టెన్త్ తర్వాత కోర్సులు, ఇంటర్మీడియట్ కోర్సులు, టెన్త్ రిజల్ట్స్, పదోతరగతి ఫలితాలు, తెలంగాణ టెన్త్ రిజల్ట్స్, ఏపీ టెన్త్ రిజల్ట్స్
(ప్రతీకాత్మక చిత్రం)


మీరు టెన్త్ తర్వాత కెరీర్ ఎంచుకునే విషయంలో కాస్త అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఇష్టాలు, అభిరుచులకు తగ్గట్టుగానే కోర్సుల్ని ఎంచుకోవాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఒత్తిడితో కోర్సుల్ని ఎంచుకుంటే తర్వాత కెరీర్‌‌లో ఇబ్బంది పడాల్సింది మీరే. అందుకే మీ అభిరుచితో పాటు మంచి భవిష్యత్తు ఉండే కెరీర్ ఎంచుకోవడం మంచిది. ఏమాత్రం అయోమయం ఉన్నా కెరీర్ కౌన్సిలర్‌ను కలిసి సలహాలు తీసుకోవాలి.

Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్

ఇవి కూడా చదవండి:

Smartphone: రూ.10,000 లోపు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...

PAN Card: పాన్ కార్డు దరఖాస్తు... ఈ 10 తప్పులు చేయొద్దు

HDFC Scholarship: పై చదువుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్... దరఖాస్తు ఇలా
First published: May 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...