హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career Guidance : షార్ట్ ట‌ర్మ్ కోర్సుల‌తో.. లాంగ్ ట‌ర్మ్ కెరీర్‌

Career Guidance : షార్ట్ ట‌ర్మ్ కోర్సుల‌తో.. లాంగ్ ట‌ర్మ్ కెరీర్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంట‌ర్ (Inter), 12వ త‌ర‌గ‌తి పూర్తి చేసిన విద్యార్థుల‌కు డిగ్రీ (Degree)లో చేర‌డం చాలా మంది చేస్తున్నారు. అయితే గ్రాడ్యుయేష‌న్ (Graduation) పూర్తి కాకుండానే షార్ట్ ట‌ర్మ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. త‌క్కువ ఖ‌ర్చుతో షార్ట్ ట‌ర్మ్ కోర్సులు (Short Term Courses) పూర్తి చేయ‌వ‌చ్చు. ఈ కోర్సుల వివ‌రాలు ఇవే..

ఇంకా చదవండి ...

  ఇంట‌ర్ (Inter), 12వ త‌ర‌గ‌తి పూర్తి చేసిన విద్యార్థుల‌కు డిగ్రీ (Degree)లో చేర‌డం చాలా మంది చేస్తున్నారు. అయితే గ్రాడ్యుయేష‌న్ (Graduation) పూర్తి కాకుండానే షార్ట్ ట‌ర్మ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. త‌క్కువ ఖ‌ర్చుతో షార్ట్ ట‌ర్మ్ కోర్సు లు (Short Term Courses) పూర్తి చేయ‌వ‌చ్చు. ఈ కోర్సులు త‌క్కువ ఆర్థిక వెసులుబాటు ఉన్న వారికి ఈ కోర్సులు భ‌విష్య‌త్‌లో ఉపాధి అవ‌కాశాల‌ను అందిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌ (Market)లో ఉన్న కోర్సుల డిమాండ్ భ‌విష్య‌త్ దృష్ట్యా ఐదు కోర్సుల వివ‌రాలు తెలుసుకొందాం. ఈ కోర్సుల ఖ‌ర్చు రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు అవుతుంది. ఈ కోర్సుకు పెట్టిన పెట్టుబ‌డి కేవ‌లం సంవ‌త్స‌రంలో తిరిగి సంపాదించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

  జిమ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ (Gym Instructor) :

  క‌రోనా కార‌ణంగా చాలా మంది ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం మార్కెట్‌లో జిమ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌ల‌కు మంచి డిమాండ్ (Demand) ఉంది. ఎవ‌రైన ఇంట‌ర్ త‌రువాత లేదా గ్రాడ్యుయేష‌న్ త‌రువాత చ‌దువు మ‌ధ్య‌లో మానేసిన వారికి ఈ కోర్సు ఉపాధి అవ‌కాశాలు అందించ‌నుంది. ఈ కోర్సు ఆరు నెల‌ల పాటు ఉంటుంది. దీని ద్వారా త్వ‌ర‌గా ఉపాధి అవ‌కాశం ఉంటుంది.

  IIT JAM 2022 : ఐఐటీలో PhD, MSc, MSc-PhD ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం.. మూడు రోజులే గ‌డువు


  యోగా ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌ (Yoga Instructor):

  దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం యోగాకు దేశ‌వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కోవిడ్ త‌ర్వాత యోగా బోధ‌కుల అవ‌స‌రం బాగా పెరిగింది. త‌క్కువ స‌మ‌యంలో యోగా ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ కోర్సు చేస్తే త్వ‌ర‌గా ఉపాధి అవ‌కాశాలు పొంద‌వ‌చ్చు. ఎక్క‌డైన పెద్ద ఆర్గ‌నైజేష‌న్‌లో ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌గా వెళ్లవ‌చ్చు. లేదా సొంతంగా చిన్న యోగా సెంట‌ర్ ప్రారంభించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం జిమ్‌, యోగా కేంద్రాల‌కు మంచి డిమాండ్ ఉంది. దీని ద్వారా ఎక్కువగా ఉపాధి అవ‌కాశాలు ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు.

  ఇంటీరియర్ డిజైనింగ్ (Interior Designing):

  ఫిజిక‌ల్ ట్రైనింగ్ ద్వారా క‌ష్టమైన కోర్సులే కాకుండా కాస్త సృజ‌నాత్మ‌క మేళ‌వింపు క‌లిగిన కోర్సు ఇంటీరియ‌ర్ డిజైనింగ్‌. ఇది వృత్తి ప‌రంగా మంచి కోర్సు పూర్తి చేసి వారు 6 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసి, ఆపై ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థలో చేరితే మంచి డిమాండ్ ఉంటుంది. అంతే కాకుండా సొంత‌ వ్యాపారాన్ని ప్రారంభించే అవ‌కాశం కూడా ఉంటుంది. ఈ కోర్స‌కు డిప్ల‌మా స‌ర్టిఫికెట్ ఉంటుంది. ఈ స‌ర్టిఫికెట్ ద్వారా ప్ర‌ముఖ కంపెనీల‌లో ఉద్యోగ అవ‌కాశాల‌ను అందుకోవ‌చ్చు.

  IBPS Clerk 2021 : ఇలా చేస్తే బ్యాంక్ కొలువు మీదే.. ఐబీపీఎస్ ప్రిప‌రేష‌న్ ప్లాన్‌


  కంప్యూటర్ ప్రోగ్రామింగ్ (Computer Programming) :

  ఇంట‌ర పూర్త‌యి వారు ఉన్న‌త విద్య చ‌ద‌వ‌డం క‌ష్టంగా ఉన్నా.. లేదా గ్రాడ్యుయేష‌న్‌తోపాటు అద‌నంగా కోర్సు చేయాల‌నుకొన్నా కంప్యూట‌ర్ సంబంధిత కోర్సు ద్వారా లాభం ఎక్కువ‌గా ఉంటుంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్ లేదా యాప్ డిజైనింగ్‌పై ఆసక్తి ఉంటే, మీరు ఈ రంగంలో సర్టిఫికెట్ లేదా డిప్లొమా కోర్సును ఎంచుకోవచ్చు. స్వల్పకాలిక కోర్సులు చాలా తక్కువ ఫీజులతో లభిస్తాయి మరియు కోర్సు పూర్తయిన తర్వాత మీరు సులభంగా ఉద్యోగం పొందవచ్చు.

  యానిమేషన్ మరియు మల్టీమీడియా (Animation and Multimedia):

  యానిమేషన్ మరియు మల్టీమీడియా కోర్సులు కాస్త ఖ‌రీదైన‌వి. ఈ కోర్సు చేసిన వారికి ఉపాధి అవ‌కాశాలు కాస్త ఎక్కువే ఉంటాయి. మీరు కోర్సు పూర్తి చేసి స‌ర్టిఫికెట్ సంపాదిస్తే మెరుగైన కెరీర్ అవ‌కాశాలు మీకు ల‌భిస్తాయి. కోర్సుతో పాటు మీ సృజ‌నాత్మ‌క‌త సామ‌ర్థ్యం మీకు కెరీర్‌లో ఎద‌గ‌డానికి ఎంతో ఉపాయ‌గ‌ప‌డ‌తాయి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: CAREER, EDUCATION, Intermediate, New course, Students

  ఉత్తమ కథలు