Home /News /jobs /

CAREER AND COURSES SIX MONTHS NEW HYBRID COURSE IN BANKING KNOW APPLICATION PROCEDURE EVK

Career and Courses: బ్యాంకింగ్ రంగంలో ఆరు నెలల కొత్త‌ హైబ్రిడ్ కోర్సు.. అప్లికేష‌న్ విధానం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Career and Courses | బ్యాంకింగ్ రంగంలో ఆస‌క్తి ఉన్న విద్యార్థుల కోసం నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ బ్యాం క్ మేనేజ్మెంట్ (NIBM) కొత్త కోర్సు అందిస్తుంది. అదే Banking and Leadership for a Digital World ప్రొగ్రామ్.

    బ్యాంకింగ్ (Banking) రంగంలో ఆస‌క్తి ఉన్న విద్యార్థుల కోసం నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ బ్యాం క్ మేనేజ్మెంట్ (NIBM) కొత్త కోర్సు అందిస్తుంది. అదే Banking and Leadership for a Digital World ప్రొగ్రామ్. BFSI డొమైన్‌లు కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న బ్యాం కింగ్, ఫైనాన్స్, టెక్నాలజీ, క‌న్స‌ల్టింగ్‌కు చెందిన నిపుణులు ఆరు నెలల హైబ్రిడ్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్టెక్ కంపెనీ టాలెంట్ స్పిరిట్‌తో కలిసి ఈ కోర్సును ప్రారంభించింది. భ‌విష్య‌త్‌లో బ్యాంగింగ్ అవ‌స‌రాలు నైపుణ్యాల‌ను అందించేందుకు ఈ కోర్సురూపొందించారు. సంప్ర‌దాయ బ్యాంకింగ్ విధానంతోపాటు డిజిట‌ల్ సామ‌ర్థ్యాల‌ను మెరుగుప‌ర్చుకొనేలా ఈ కోర్సును రూపొందించారు.

    RRB NTPC Results: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రివైజ్డ్‌ ఫ‌లితాలు.. క‌ట్ ఆఫ్ వివ‌రాలు.. ఫ‌లితాలు ఇలా చెక్ చేసుకోండి

    ప్రోగ్రామ్ గురించి సెంట్రల్ డిపాజిటరీ సర్వీ సెస్ (ఇండియా) లిమిటెడ్ (CDSL) చైర్పర్సన్ BV చౌబల్ మాట్లాడారు. “బ్యాం కింగ్ పర్యా వరణ వ్యవస్థ గతంలో ఎన్నడూలేని విధంగా మారుతున్నందున అడ్వాన్స్డ్ ఎగ్జిక్యూ గ్జి టివ్ ప్రోగ్రామ్ సరైన సమయంలో అందుబాటులోకి వ‌చ్చింద‌న్నారు. ఆధునిక బ్యాం కర్లు విశ్లేషణాత్మక సామర్థ్యా లతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉద్యోగాలు ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

    Career and Courses: బ్యాంకింగ్ కెరీర్‌పై ఆస‌క్తి ఉందా.. అయితే ఈ ఉచిత కోర్సుల వివరాలు..

    రుగైన కస్టమర్ సేవ‌లు అందించేలా సామ‌ర్థ్యాల‌ను ఈ కోర్సు ద్వారా అందుకోవ‌చ్చ‌ని అన్నారు. ప్ర‌స్తుతం NIBM మరియు టాలెంట్ స్పిరిట్‌ (Talent Spirt)  అందించే ఈ ప్రోగ్రామ్ డిజిటల్ బ్యాం కింగ్ మరియు ఫైనాన్స్ ముఖ్య అంశాలను నేర్పిస్తుంద‌ని అన్నారు. ఆధునిక నాయకత్వ నైపుణ్యాలను పొందేం దుకు ఈ కోర్సు వీలు క‌ల్పిస్తుంద‌ని అన్నారు.

    ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..

    Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://talentsprint.com/programs.dpl#program=.NIBM ను సంద‌ర్శించాలి.

    Step 3: అనంత‌రం Banking and Leadership for a Digital World కాల‌మ్‌లోకి వెళ్లాలి.

    Govt jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌!

    Step 4: పేరు, ఈమెయిల్‌, ఫోన్ నంబ‌ర్ త‌దిత‌ర వివ‌రాలు న‌మోదు చేయాలి.

    Step 5: అనంత‌రం Apply Now బ‌ట‌న్ ప్రెస్ చేయాలి.

    Step 6 పూర్తి వివ‌రాల‌తో కూడిన బ్రౌచ‌ర్ అందిస్తారు.

    Step 7: బ్రౌచ‌ర్ ఆధారంగా ద‌ర‌ఖాస్తు ఫాం.. పూర్తి చేయాలి.

    కోర్సుకు సంబంధించిన క్లాస్‌లు జూలై నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Banking, Career and Courses, Online course, Online Education

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు