హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career and Courses: ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు అవ‌స‌ర‌మ‌య్యేలా కొత్త కోర్సులు.. అంబేద్క‌ర్ వ‌ర్సిటీ నిర్ణ‌యం

Career and Courses: ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు అవ‌స‌ర‌మ‌య్యేలా కొత్త కోర్సులు.. అంబేద్క‌ర్ వ‌ర్సిటీ నిర్ణ‌యం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

New Courses | ప్ర‌తిష్ఠాత్మ‌క బీఆర్ అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విద్యాల‌యం (B.R.Ambedkar Open University) విద్యార్థుల‌కు ఉప‌యుక్తం ఉండేలా రెండు కొత్త కోర్సుల‌ను ప్ర‌శేపెడుతోంది. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి అంటే 2023-24 అకాడ‌మిక్ ఇయ‌ర్‌లో ఈ కోర్సుల‌ను ప్ర‌శేపెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇంకా చదవండి ...

ప్ర‌తిష్ఠాత్మ‌క బీఆర్ అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విద్యాల‌యం (B.R.Ambedkar Open University) విద్యార్థుల‌కు ఉప‌యుక్తం ఉండేలా రెండు కొత్త కోర్సుల‌ను ప్ర‌శేపెడుతోంది. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి అంటే 2023-24 అకాడ‌మిక్ ఇయ‌ర్‌లో ఈ కోర్సుల‌ను ప్ర‌శేపెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ రెండు కొత్త కోర్సులు బీఏలో అందుబాటులోకి తీసుకొస్తారు. జాగ్ర‌ఫీ, ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీ (International Study) కోర్సుల‌ను విద్యార్థుల కోసం కొత్త‌గా రూపొందించారు. ముఖ్యంగా ప్ర‌భుత్వ ఉద్యోగాలకు చ‌దివేవారికి జాగ్ర‌ఫీ, ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డ‌సీ్‌పూ ఎక్కు వ‌ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్‌-1 (Group-1) వంటి ప‌రీక్ష‌ల్లో ఈ విభాగా నుంచి ఎక్కుగా ప్ర‌భ్న‌లు అడుగుతుంటారు.

ISB: ఐఎస్‌బీ హైద‌రాబాద్‌లో ఫైనాన్స్ రంగంలో కొత్త కోర్సు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

ఆన్‌లైన్ కోర్సులు..

విద్యార్థుల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు బీఆర్ఏఓయూ (BRAOU) కొత్త విధానానికి శ్రీ‌కారం చుట్టింది. మారుతున్న‌కాలానికి అనుగుణంగా ఆన్‌లైన్ కోర్సులను ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఇప్ప‌టికే స్ట్రేస్ మెనేజ్‌మెంట్‌, జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ కోర్సుల‌ను ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్నారు. ఈ కోర్సులు చేసేవారికి టెలీ పాఠాల‌ను సిద్ధం చేసి అందిస్తున్నారు.

ఈ పాఠాల‌ను యూట్యూబ్‌, మొబైల్ యాప్‌ (Mobile App)ల ద్వారా అందుబాటులోకి తీసుకు రావాలి అని యూన‌విర్సిటీ ఆలోచిస్తోంది. అంతే కాకుండా స్వ‌యం పోర్ట‌ల్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్ కోర్సులు అందించే అవ‌కాశం ఉంది.

Jobs in Andhra Pradesh: హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే చాన్స్‌

కొత్తగా ప్ర‌వేశ‌పెట్టే కోర్సుల‌ను సైతం యూనివ‌ర్సిటీ స్వ‌యం పోర్ట‌ల్‌కు అనుసంధానం చేయ‌నున్నారు. అంతే కాకుండా ఆన్‌లైన్ కోర్సుల‌కు క్రెడిట్‌లు కేటాయించి అక‌డ‌మిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌తో అనుసంధానించనున్న‌ట్టు వీసీ సీతారామారావు తెలిపారు.

జూలైలో పీజీ ప‌రీక్ష‌లు

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల పరీక్షలు జులై నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పీజీ (ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, ఉర్దూ, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌), ఎంఏ, ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, సైకాలజీ), ఎంబీఏ, మాస్టర్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (ఎంఎల్‌ఐఎస్‌సీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (బీఎల్‌ఐఎస్‌సీ), అన్ని డిప్లొమాలు, సర్టిఫికెట్‌ కోర్సుల పరీక్షలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం.

CTET 2022: సీటెట్‌కు అప్లై చేస్తున్నారా? పరీక్ష విధానం, పాసింగ్ మార్క్స్ వంటి వివరాలు తెలుసుకోండి..

విద్యార్థులు యూనివ‌ర్సిటీ పోర్టల్‌ను సందర్శించి పరీక్షల రిజిస్ట్రేషన్‌ను ఓపెన్‌ చేసి విద్యార్థులు ఫీజును టీఎస్‌/ఏపీ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా లేదా డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో మాత్రమే చెల్లించాలి. పరీక్షలు ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ పోర్టల్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  అన్ని కోర్సుల పరీక్షల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేనెల 14 వరకు ఉంది.

First published:

Tags: Career and Courses, New courses, Online course, Online Education

ఉత్తమ కథలు