Home /News /jobs /

CAREER AND COURSES LUCKNOW UNIVERSITY SPECIAL COURSE INTEGRATED COURSE OFFER ON YOGA AND NATUROPATHY GH EVK

Career and Courses: లక్నో యూనివర్సిటీ స్పెషల్ కోర్సు.. యోగా, నేచురోపతిపై ఇంటిగ్రేటెడ్ కోర్సు ఆఫర్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Career and Courses | 2022-23 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి యోగా, నేచురోపతిలపై ఐదేళ్ల ప్రొషెషనల్ ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెట్టనుంది లక్నో యూనివర్సిటీ. అనేక వ్యాధులను నయం చేయడంలో యోగా ఆసనాల పాత్ర, వాటి ప్రయోజనాలపై ప్రధానంగా బోధించనున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు..

ఇంకా చదవండి ...
2022-23 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి యోగా (Yoga), నేచురోపతిలపై ఐదేళ్ల ప్రొషెషనల్ ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెట్టనుంది లక్నో యూనివర్సిటీ. అనేక వ్యాధులను నయం చేయడంలో యోగా ఆసనాల పాత్ర, వాటి ప్రయోజనాలపై ప్రధానంగా బోధించనున్నారు. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అర్హతలు
బయాలజీ (Biology) ప్రధాన సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సు ప్రవేశానికి అర్హులు. యోగా, ప్రత్యామ్నాయ మెడిసిన్ ఫ్యాకల్టీ రూపొందించిన పాఠాలతో‌ పాటు ప్రకృతివైద్యం చికిత్స పద్ధతులను కూడా బోధించనున్నారు. యోగా అండ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్స్‌ ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్‌ ప్రొఫెసర్‌ నవీన్‌ ఖరే మాట్లాడుతూ... 50 సీట్లతో ఫస్ట్ సెషన్ కోర్సును ప్రారంభిస్తామన్నారు. ఇందు కోసం రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

Govt Jobs 2022: సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో జాబ్స్‌.. నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌, అర్హ‌త‌

యోగా దర్శనం, మూలాలతో పాటు ఇతర అంశాలను బోధించనున్నారు. అదేవిధంగా నీరు, నేల, సూర్యకిరణాలు, ఉపవాసం, డైట్ థెరపీని ఉపయోగించి చికిత్స చేసే ప్రకృతివైద్య పద్ధతులపై ఈ కోర్సు ద్వారా దృష్టిసారించనున్నట్లు ఫ్యాకల్టీ కో-రిజినేటర్ డాక్టర్ అమర్జీత్ యాదవ్ తెలిపారు. కోర్సు కోసం లక్నో యూనివర్సిటీలో కొత్త తరగతి గదులను ప్రారంభించడంతో పాటు యోగా నేచురోపతి హాస్పిటల్‌ను కూడా ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్టుపై ప్రాక్జికల్ నాలెడ్జ్ పెరుగుతుందన్నారు.

అండర్ గ్రాడ్యుయేట్ (Graduate)  విద్యార్థుల కోసం యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. అదేవిధంగా యోగాపై అవగాహన కోసం అనేక స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సులను సైతం లక్నో యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఈ సర్టిఫికేట్ కోర్సు మూడు నెలల పాటు జరగనుంది. ఇందుకు ఫీజు రూపంలో రూ. 6500 చెల్లించాల్సి ఉంటుంది.

కాగా, లక్నో యూనివర్సిటీ కొత్త అకడమిక్ సెషన్ కోసం అడ్మిషన్ ప్రక్రియను ఇంకా ప్రకటించలేదు. గత సంవత్సరం UG అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ మార్చి9న ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది... యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో అడ్మిషన్ ఆలస్యం కావచ్చు. అయితే వివిధ కోర్సుల్లో ప్రవేశానికి లక్నో యూనివర్సిటీ జూన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

Army Jobs 2022: ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం

మరోవైపు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై లక్నో యూనివర్సిటీ స్వల్పకాలిక కోర్సును ఆఫర్ చేస్తోంది. సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పేరుతో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. కేవలం ఏడు రోజులు మాత్రమే జరిగే ఈ కోర్సు మార్చి 24 నుంచి ప్రారంభమై.. మార్చి 30న ముగియనుంది. ఈ కోర్సు చేయడానికి కేవలం 40 మందికి మాత్రమే అవకాశం ఉంది. కోర్సుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను వర్సిటీ ప్రకటించింది. మార్చి 24న జాతీయ విద్యావిధానం-2020పై వివరణాత్మకంగా బోధించనున్నారు. మార్చి 25న ఉన్నత విద్యలోని సమస్యలు, సవాళ్లు.. మార్చి26న డిజిటల్, వర్చువల్ విద్యపై బోధించనున్నారు. మార్చి27న ఫీల్డ్ విజిట్ ఉంటుందని లక్నో వర్సిటీ తెలిపింది.
Published by:Sharath Chandra
First published:

Tags: Career and Courses, EDUCATION, New course, Online course

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు