హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career and Courses: ఐఐటీలో బీఎస్సీ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌ కోర్సు.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం!

Career and Courses: ఐఐటీలో బీఎస్సీ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌ కోర్సు.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం!

Career and Courses | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్.. 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సువర్ణావకాశాన్ని కల్పించింది. ఎటువంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ లేకుండానే BScలో ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌ కోర్సు కోసం అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టింది.

ఇంకా చదవండి ...

  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్.. 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సువర్ణావకాశాన్ని కల్పించింది. సాధారణంగా ఐఐటీ (IIT) ల్లో ప్రవేశాలకు JEE రాయాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ లేకుండానే BScలో ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌ కోర్సు కోసం అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టింది. 11, 12వ తరగతి విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెసర్లు, కెరీర్‌లో విరామం తీసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐటీ మద్రాస్ తెలిపింది.

  2022 మే నాటికి 11వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు లేదా ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు మే 2022 టర్మ్ క్వాలిఫైయర్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేనందునా అర్హత ఉన్న ఎవరైనా ప్రోగ్రామ్‌‌లో చేరవచ్చు.

  JEE అడ్వాన్స్‌డ్ 2021 పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు 2022 మే నెలలో నిర్వహించే BSc ప్రోగ్రామ్‌లో డైరెక్ట్‌గా చేరవచ్చు. ఇందు కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 20, 2022గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు onlinedegree.iitm.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  దరఖాస్తు ప్రక్రియలో నాలుగు వారాల శిక్షణ ఉంటుంది. ఇందులో వీడియో లెక్చర్‌లు, వీక్లీ అసైన్‌మెంట్‌లు, చర్చా వేదిక, ప్రొఫెసర్లు- కోర్సు బోధకులతో ప్రత్యక్ష పరస్పర చర్యలు ఉంటాయి. దరఖాస్తుదారులు ఈ 4 వారాల కంటెంట్‌పై ఆధారపడిన అర్హత పరీక్షను వ్యక్తిగతంగా రాయాల్సి ఉంటుంది. కనీస కట్-ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు పొందినట్లయితే BScలో ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌ ప్రోగ్రామ్ చేయడానికి అర్హత సాధిస్తారు.)

  ఈ ప్రోగ్రామ్ కోసం అర్హత సాధించిన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌ (Scholarship) లు అందుబాటులో ఉన్నాయని ఐఐటీ మద్రాస్ తెలిపింది. ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి ప్రతి వారం పోర్టల్‌లో కంటెంట్ విడుదల కానుంది. పరీక్షల కోసం దేశంలోని 130 కంటే ఎక్కువ నగరాల్లో నిర్దేశిత కేంద్రాలలో వ్యక్తిగతంగా అభ్యర్థులు హాజరుకావలసి ఉంటుందని IIT మద్రాస్ పేర్కొంది.

  CUET 2022: నేటి నుంచి సీయూఈటీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు

  IIT మద్రాస్, CSR భాగస్వామ్యంతో అదనపు స్కాలర్‌షిప్‌లతో పాటు వార్షిక కుటుంబ ఆదాయం ఆధారంగా 75 శాతం వరకు ఫీజు మినహాయింపు అందించనుంది. ఐఐటీ మద్రాస్‌, బీఎస్సీ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌ ఇన్‌చార్జ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ మాట్లాడుతూ...ఈ కార్యక్రమం ద్వారా ఐఐటీలో చదవాలని కలలు కనే ప్రతి ఒక్కరికీ లేదా ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌ (DATA Science) ను కేరీర్‌గా ఎంచుకునే వారికి అత్యంత నాణ్యతతో కూడిన విద్యను అందించడానికి కృషి చేస్తామన్నారు. విద్యా రంగంలో ఇతర సంస్థలు మరిన్ని పెద్ద కార్యక్రమాలు చేపట్టడానికి ఈ ప్రోగ్రామ్ గేమ్ ఛేంజర్ అవుతుందని తంగరాజ్ అభిప్రాయపడ్డారు.

  Job Openings: హైదరాబాద్‌లోని ప్ర‌ముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

  మరో ఇన్-ఛార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ విఘ్నేష్ ముత్తు విజయన్ మాట్లాడుతూ.. BSc ప్రోగ్రామ్ డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్ కోసం తలుపులు తెరిచామన్నారు. ఇక్కడ నైపుణ్యం ఉన్న వనరులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. బ్యాక్‌గ్రౌండ్ ఎదైనా, ఏ వయస్సువారైనా సరే ఈ ప్రోగ్రామ్‌లో చేరవచ్చన్నారు. అలాగే JEE అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత పొందిన విద్యార్థులు సైతం ఈ ప్రోగ్రామ్‌లో చేరవచ్చన్నారు.

  First published:

  Tags: Career and Courses, IIT Madras

  ఉత్తమ కథలు