Home /News /jobs /

CAREER AND COURSES JEE NEET EXAMS FREE COACHING FOR POOR STUDENTS THERE ARE VARIOUS SCHEMES KNOW IT GH EVK

JEE, NEET Free Coaching: పేద విద్యార్థులకు జేఈఈ, నీట్ ఎగ్జామ్స్‌ ఫ్రీ కోచింగ్‌ ప‌థ‌కాలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Career and Courses | దేశవ్యాప్తంగా టాప్ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తుంటారు. ఈ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. అందరూ అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకొనే అవకాశం ఉండదు. డబ్బు ఖర్చు పెట్టుకోలేని వారి కోసం ఉచితంగా సన్నద్ధమ్యే కొన్ని మార్గాలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
దేశవ్యాప్తంగా టాప్ ఇంజినీరింగ్ (Engineering), మెడికల్ కాలేజీ (Medical College) ల్లో ప్రవేశాల కోసం జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తుంటారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం విద్యార్థులకు పెద్ద సవాలు. మరోపక్క ఈ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. అందరూ అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకొనే అవకాశం ఉండదు. డబ్బు ఖర్చు పెట్టుకోలేని వారి కోసం ఉచితంగా సన్నద్ధమ్యే కొన్ని మార్గాలు ఉన్నాయి. పలు రాష్ట్రాలు విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలను కూడా ప్రవేశపెట్టాయి.

స్వయం ప్లాట్‌ఫారమ్: ఈ పథకం కింద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS) విద్యార్థులు 9 నుంచి 12వ తరగతి పాఠాలను వినే అవకాశం ఉంది. అన్ని రకాల కోర్సులను ఇంటరాక్ట్‌ అయ్యే పద్ధతిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల కోసం ఉచితంగా వవీటిని అందిస్తున్నారు.

Career and Courses: లక్నో యూనివర్సిటీ స్పెషల్ కోర్సు.. యోగా, నేచురోపతిపై ఇంటిగ్రేటెడ్ కోర్సు ఆఫర్..

కోర్సులను ఉపయోగించుకోవడానికి అభ్యర్థులు స్వయం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. కోర్సులు పూర్తిగా ఉచితమైనప్పటికీ, చివరి ప్రొక్టెడ్ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తరువాత స్వయం సర్టిఫికేట్ అందిస్తారు. ఇంట్లో ఇంటర్నెట్ సదుపాయం లేని అభ్యర్థులు వివిధ రకాల DTH ఛానెల్‌ల్లో అందుబాటులో ఉన్న పాఠాలను వినియోగించుకోవచ్చు.

ఢిల్లీ ప్రభుత్వ జైభీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన
ఢిల్లీలో నివసిస్తున్న SC, ST, OBC విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. 10, 12వ తరగతులు ఉత్తీర్ణత సాధించి.. వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.6 లక్షలకు మించని విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
విద్యార్థుల విద్యార్హత ఆధారంగా కోచింగ్ సంస్థ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించినవారు కోచింగ్ కోసం ఎంపిక చేస్తారు.

Govt Jobs 2022: సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో జాబ్స్‌.. నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌, అర్హ‌త‌

ఈ పథకం కింద అవగాహన కుదుర్చుకొన్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలను స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటనలను జారీ చేయనున్నారు. పథకం నిబంధనల ప్రకారం అర్హులైన SC అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోచింగ్ సెంటర్లు ఆహ్వానించనున్నాయి.

రాజస్థాన్ ప్రభుత్వ ఆఆస్పత్రి కోచింగ్:
రాజస్థాన్‌‌లో నివసిస్తున్న విద్యార్థుల కోసం అక్కడి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అకడమిక్ పరీక్షల్లో 85 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన SC, ST, OBC, EWS విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అలాగే వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2.5 లక్షలకు మించి ఉండకూడదు. అర్హులైన అభ్యర్థులు రాజస్థాన్‌ రాష్ర్ట సర్కార్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

హర్యానా ప్రభుత్వ సూపర్ 100 పథకం:
10వ తరగతి పరీక్షల్లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందు కోసం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థులకు బోర్డింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు.

గ్రామీణ విద్యార్థుల కోసం ఉత్తర్‌ప్రదేశ్ అభ్యుదయ్ యోజన
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు.. UPSC, CSE, JEE మెయిన్, NEET, NDA, CDS తదితర పోటీ పరీక్షల్లో శిక్షణ అందించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు.

Army Jobs 2022: ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం

ఒడిశా చత్ర ప్రోస్థాన్ యోజన:
ఒడిషాలోని ST విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ అందించడానికి ఈ పథకాన్ని అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది.10వ తరగతిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

కర్ణాటక ముఖ్యమంత్రి విద్యార్థి మార్గదర్శిని:
ఇటీవలే ఈ పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రిజర్వ్‌డ్ వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. JEE/NEET కోసం 12వ తరగతి సైన్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Published by:Sharath Chandra
First published:

Tags: Career and Courses, EDUCATION, Jee, NEET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు