CAREER AND COURSES INTERESTED IN BANKING CAREER THESE FREE COURSES WILL BE USEFUL EVK
Career and Courses: బ్యాంకింగ్ కెరీర్‌పై ఆసక్తి ఉందా.. అయితే ఈ ఉచిత కోర్సుల వివరాలు..
(ప్రతీకాత్మక చిత్రం)
Career and Courses | చాలా మందికి బ్యాంకింగ్ కెరీర్‌పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఎలా బ్యాంకింగ్ రంగంలో నిలదొక్కుకోవాలి. మంచి అవకాశాలు రావాలంటే ఎటువంటి కోర్సులు చేయాలి అనే విషయాలు తెలుసుకోండి
చాలా మందికి బ్యాంకింగ్ కెరీర్‌పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఎలా బ్యాంకింగ్ రంగంలో నిలదొక్కుకోవాలి. మంచి అవకాశాలు రావాలంటే ఎటువంటి కోర్సులు చేయాలి అనే సందేహాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అలాంటి ఔత్సాహికులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు ఐదు మాసీవ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (MOOCs) ప్రారంభించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) నాలెడ్జ్ హబ్ ప్లాట్ఫామ్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవాలనుకునేవారు ఎవరైనా ఈ కోర్సులు చేయొచ్చు. మొత్తం ఐదు టాపిక్స్‌లో ఎస్బీఐ ఈ కోర్సుల్ని అందిస్తోంది.
ఏం నేర్చుకోవచ్చు...
బ్యాంకింగ్ ఫండమెంటల్స్, ఎంఎస్ఎంఈ లెండింగ్ ఇన్ ఎ నట్‌షెల్, ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా, ప్రియార్టీ సెక్టార్ లెండింగ్ నార్మ్స్, ఎన్ఆర్ఐ బిజినెస్ అండ్ కాంప్లయెన్స్ కోర్సుల్ని అందిస్తోంది. ఈ కోర్సులు అందించేందుకు ఎన్ఎస్ఈ అకాడమీతో ఎస్బీఐ ఒప్పందం చేసుకుంది.
Banking Fundamentals: బ్యాంకింగ్ ఫండమెంటల్స్ కోర్సు చేసేవారికి భారతదేశంలో బ్యాంకింగ్ విధానానికి సంబంధించిన పరిజ్ఞానం లభిస్తుంది. ఈ కోర్సును ఎవరైనా చేయొచ్చు.
MSME Lending in a Nutshell: మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, ఎస్ఎంఈ ఆంట్రప్రెన్యూర్స్, బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్, విద్యార్థుల కోసం రూపొందించిన కోర్సు ఇది. ఎంఎస్ఎంఈలకు లభించే రుణాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
Electronic Payment System in India: భారతదేశంలో ఎలక్ట్రానిక్, డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఈ పేమెంట్ విధానానికి సంబంధించిన పరిజ్ఞానం కోసం ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా కోర్సు చేయొచ్చు.
Priority Sector Lending Norms: వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణం, ఎంఎస్ఎంఈ లాంటి ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చే రుణాలకు సంబంధించిన వివరాలు, నియమనిబంధనలు తెలుసుకోవడానికి ప్రియార్టీ సెక్టార్ లెండింగ్ నార్మ్స్ కోర్సు చేయొచ్చు.
NRI Business & Compliance: నాన్ రెసిడెంట్ ఇండియన్ (NRI) వ్యాపారానికి సంబంధించిన నియమనిబంధనలు తెలుసుకోవడానికి ఎన్ఆర్ఐ బిజినెస్ అండ్ కాంప్లయెన్స్ కోర్సు చేయొచ్చు.
- ఈ ఐదు కోర్సులు మూడు నుంచి ఆరు వారాల డ్యూరేషన్‌తో ఉన్నాయి.
- రోజూ కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు సమయం వెచ్చించి ఈ కోర్సులు పూర్తి చేయొచ్చు. ఇవన్నీ ఉచిత కోర్సులే.
- విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఈ కోర్సుల ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో మరింత పరిజ్ఞానాన్ని పొందొచ్చు.
- బ్యాంకింగ్ సర్వీసెస్‌లో కెరీర్ రూపొందించుకోవాలనుకునేవారికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.