తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) పరిధిలో శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ శిల్పం ఆలయ శిల్పం సాంప్రదాయ శిల్పం ఆలయ శిల్ప కళాశాల.. 2022-23 విద్యా సంవత్సరానికి డిప్లొమా , సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. కోర్సులను సంబంధించి దరఖాస్తు ప్రక్రియ తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి జూలై 10, 2022 వరకు అవకాశం ఉంది.
ఆలయ నిర్మాణం (టెంపుల్ ఆర్కిటెక్చర్) కోర్సుల వివరాలు..
1.శిలాశిల్పం (స్టోన్ స్కల్ప్చర్)
2. సుధా శిల్పం(సుధా సకల్ప5)
3.లోహ శిల్పం (మెటల్ స్కల్ప్చర్)
4 దారు శిల్పం (వుడ్ స్కల్ప్చర్)
5. సంప్రదాయ వర్ణ చిత్ర లేఖనం
(ట్రెడిషనల్ పెయింటింగ్)
సంప్రదాయ కళలను పరిరక్షించి,వారసత్వాన్నిబకొనసాగించే లక్ష్యంతో తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణా సంస్థ నడుస్తోంది 1980లో సర్టిఫికెట్ కోర్సులతో మొదలైన ఈ కళాశాలలో 1986 నుంచి ఎస్బిటిఐటి స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నీక్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనుమతితో డిప్లొమా కోర్సులను కూడా ప్రారంభించారు.
ఈ సంస్థ వచ్చే విద్యా సంవత్సరంలో చేరదలుచుకున్న వారి కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 - ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.tirumala.org/ ను సందర్శించాలి.
Step 3 - నోటిఫికేషన్ చదివి దరఖాస్తు ఫాం డౌన్ లోడ్ చేసుకోవాలి.
Step 4 - తప్పులు లేకుండా ఫాంను నింపి అవసరమౌన డాక్యుమెంట్లు జత చేయాలి.
Step 5 - అప్లికేషన్ ఫాంను
శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణా సంస్థ అలిపిరి రోడ్ తిరుపతి.
ఆఫీసు ఫోన్ నెంబర్ 0877 2264637
వెబ్సైట్ svtsattd@yahoo.in అడ్రక్కు పంపాలి.
Step 6 - దరఖాస్తుకు జూలై 10, 2022 వరకు అవకాశం ఉంది.
ఉపాధి అవకాశాలు
డిప్లొమా చదివిన వారికి ఏపీ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయశాఖలో,పురావస్తుశాఖలో, టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఎస్వీ కళాశాలలో స్థపతులుగా, అధ్యపకులుగా డ్రాయింగ్ మాస్టారుగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో ఈ కళకు మంచి ఆదరణ ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.