హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Free Coaching: ఎంసెట్‌, నీట్, జేఈఈ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఉచిత శిక్ష‌ణ‌

Free Coaching: ఎంసెట్‌, నీట్, జేఈఈ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఉచిత శిక్ష‌ణ‌

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Free Coaching | ఎంసెట్‌, నీట్, జేఈఈ త‌దిత‌ర ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే స‌ర్కారు కాలేజీల్లోని విద్యార్థుల‌కు ప్ర‌భుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ విద్యార్థుల కోసం ప్ర‌త్యేకంగా ఉచిత శిక్ష‌ణ ఇచ్చేందుకు ఇంట‌ర్ బోర్డు ఏర్పాట్లు చేసింది.

ఇంకా చదవండి ...

ఎంసెట్‌, నీట్, జేఈఈ త‌దిత‌ర ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే స‌ర్కారు కాలేజీల్లోని విద్యార్థుల‌కు ప్ర‌భుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ విద్యార్థుల కోసం ప్ర‌త్యేకంగా ఉచిత శిక్ష‌ణ ఇచ్చేందుకు ఇంట‌ర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. శిక్ష‌ణ‌ను మే చివ‌రి వారం నుంచి ఉచిత శిక్ష‌ణ ప్రారంభించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ శిక్ష‌ణ ఇవ్వాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. ఆన్‌లైన్ క్లౌడ్ ఎడ్జ్ సంస్థ స‌హ‌కారంతో ఉచిత శిక్ష‌ణ ఇస్తారు. అంతే కాకుండా జిల్లాల్లో 32 కోచింగ్ సెంట‌ర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్ర‌ణాళిల‌ను సిద్ధం చేశారు. మే 20,2022 లేదా మే 21, 2022వ తేదీ నుంచి ఉచిత శిక్ష‌ణ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. విద్యార్థులు tscie.rankr.io లింక్ ద్వారా ఇంట్లో ఉండి కోచింగ్ తీసుకోవ‌చ్చు.

గ‌త ఏడాది సైతం ఇదే త‌ర‌హా శిక్ష‌ణ ఇవ్వ‌గా రాష్ట్రంలో 20వేల మంది విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకున్నారు. అందులో 2,685మంది విద్యార్థులు ఉత్త‌మ ర్యాంక్ సాధించారు.

TSPSC Group-1: గ్రూప్‌-1కు వేల‌ల్లో ద‌ర‌ఖాస్తులు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌లో తెలుసుకోవాల్సిన విష‌యాలు..

నీట్ అభ్యర్థులకు యాప్ లో ఫ్రీ కోచింగ్, స్టడీ మెటీరియల్, మాక్ ఎగ్జామ్స్

దేశంలోనే అత్యంత పేరొందిన పోటీ పరీక్షల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) ఒకటి. మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ ఎగ్జామ్ (Exam) కు పోటీ విపరీతంగా ఉంటుంది. అయితే డాక్టర్ కావాలన్న కలతో లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు ఏళ్ల పాటు ప్రిపేర్ (NEET Preparation) అవుతూ ఉంటారు. చాలా మంది లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు.

TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్ ఓపెనింగ్స్‌.. అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

. అనేక మంది పేద విద్యార్థులు కోచింగ్ కోసం డబ్బులు ఖర్చు చేసే స్తోమత లేక ఇంట్లోనే ఉండి సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్, ఇతర పుస్తకాలతో వారు ప్రిపరేషన్ సాగిస్తారు. అయితే అలాంటి విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్. కేవలం ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నీట్ ఎగ్జామ్ కు ఇంట్లో నుంచే ఉచితంగా కోచింగ్ పొందే అవకాశం ఉంది. Affinity Education App మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తుంది.

First published:

Tags: Career and Courses, EDUCATION, Free coaching, Jee, Preparation

ఉత్తమ కథలు