హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career and Courses: తెలుగు వ‌ర్సిటీలో ఆ కోర్సుకు భ‌లే డిమాండ్‌.. కొత్త కోర్సులు ప్ర‌వేశ పెట్టిన యూనివ‌ర్సిటీ

Career and Courses: తెలుగు వ‌ర్సిటీలో ఆ కోర్సుకు భ‌లే డిమాండ్‌.. కొత్త కోర్సులు ప్ర‌వేశ పెట్టిన యూనివ‌ర్సిటీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Career and Courses | తెలుగుభాష, సాహిత్యరంగాల్లో విశేష కృషిచేస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ జ్యోతిషం కోర్సుకు చాలా డిమాండ్ ఉంది. ఈ కోర్సుకు సంబంధించి ప్ర‌తీ ఏటా పోటీ బాగా పెరుగుతోంది.

  తెలుగుభాష, సాహిత్యరంగాల్లో విశేష కృషిచేస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ జ్యోతిషం కోర్సుకు చాలా డిమాండ్ ఉంది. దేశంలో ఏ వర్సిటీలో లేని ఈ కోర్సును మన తెలుగు వర్సిటీ మాత్రమే ఈ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సులోనే 73 మంది ప్రవేశాలు పొందారు. మ్యూజిక్‌, డ్యాన్స్‌ వంటి కోర్సుల్లో విద్యార్థులు తక్కువగా చేరారు. ఎంఫిల్‌, పీహెచ్‌డీలలో నలుగురు చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

  కొత్త కోర్సులు

  ఈ సారి యూనివ‌ర్సిటీలో కొత్త‌గా మూడు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి లైబ్రరీసైన్స్‌ (బీసీజే, ఎంసీజే), యోగా (ఎంఏ యోగా),

  బీఎఫ్‌ఏ డిజైన్‌ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. త్వరలో నిర్వహించే అకడమిక్‌ సెనేట్‌ సమావేశంలో ఈ కోర్సులపై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విద్యాసంవత్సరంలోనే ఎంఎఫ్‌ఏ (మాస్టర్స్‌ ఇన్‌ శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్‌ మేకింగ్‌), ఎంఏ (చరిత్ర, కల్చర్‌ అండ్‌ టూరిజం) కోర్సులను ప్రవేశపెట్టారు.

  Job Mela: గుంటూరు నాగార్జున యూనివర్సిటిలో జాబ్ మేళా.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

  సింగరేణిలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

  భార‌త ప్ర‌భుత్వం, తెలంగాణ (Telangana)రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిస్తున్న ప్ర‌భుత్వ సంస్థ సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థ కొత్త‌గూడంలో ఉంది. ఇందులో పలు పోస్టుల భ‌ర్తీకి  దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విడుదలైన  నోటిఫికేష‌న్ (Notification) ద్వారా వివిధ పోస్టుల‌ను ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేయ‌నున్నారు. ఇంట‌ర్వ్యూకు హాజ‌రయ్యే అర్హులైన అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 45 ఏళ్లు మించి ఉండ‌కూడదు. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూల స‌మాచారం, నోటిఫికేష‌న్ వివ‌రాల కోసం అధికార‌కి వెబ్‌సైట్ https://scclmines.com/012022/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వ‌హిస్తారు.

  అర్హతలు..

  ఈ పోస్టులకు సంబంధించిన విభాగాల్లో  పి.జి. లో డిగ్రీ/DNB చేసి ఉండాలి. అంతే కాకుండా స్పెషలైజేషన్ కూడా చేసి ఉండాలి.

  Jobs in Andhra Pradesh: ప‌లు జిల్లాల్లో ఉద్యోగ అవ‌కాశాలు.. ద‌ర‌ఖాస్తుకు రేప‌టితో ఆఖ‌రు తేదీ

  ఎంపిక విధానం..

  - అర్హ‌తలు ఉన్న వారు నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రు అవ్వాలి.

  - మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

   ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 - ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

  Job Meal: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ మేళా.. ముందుగానే అప్లై చేసుకోవాలి

  Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://scclmines.com/012022/ ను సంద‌ర్శించాలి.

   Step 3 - అప్లై ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు ఫాంను నింపాలి.


  Step 4 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

  Step 5 - అనంత‌రం ఇంట‌ర్వ్యూ తేదీల్లో హాజ‌రు అవ్వాలి.

  Step 6 - ఇంట‌ర్వ్యూ తేదీలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వ‌హిస్తారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Career and Courses, EDUCATION, Telangana

  ఉత్తమ కథలు