Home /News /jobs /

CAREER AND COURSES FREE COURSE AND JOB CHANCES IN CLOUD COMPUTING COURSE IN IIT EVK

Career and Courses: క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఐఐటీలో ఉచిత కోర్సు.. త‌ర్వాత జాబ్స్ చాన్స్‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Career and Courses | ఐఐటీ పాట్నా క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనే ఉచిత ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. మొత్తం 8 వారాల వ్యవధి గల ఈ ఆన్​లైన్​ కోర్సు ద్వారా డేటా స్ట్రక్చర్స్​, అల్గారిథమ్‌లపై విద్యార్థులు పట్టు సాధించవచ్చు. కోర్సు వివ‌రాలు..

ఇంకా చదవండి ...
    లేటెస్ట్​ టెక్నాలజీస్(Latest Technology)​లో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాల దృష్ట్యా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొత్త కోర్సులను(New Courses) ప్రవేశపెడుతున్నాయి. తాజాగా ఐఐటీ పాట్నా (IIT Patna) క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనే ఉచిత ఆన్‌లైన్ కోర్సును(Free Online Course) ప్రారంభించింది. మొత్తం 8 వారాల వ్యవధి గల ఈ ఆన్​లైన్​ కోర్సు ద్వారా డేటా స్ట్రక్చర్స్​, అల్గారిథమ్‌లపై విద్యార్థులు పట్టు సాధించవచ్చు. ఈ కోర్సును స్వయం NPTEL సహకారంతో ఐఐటీ పాట్నా ఆఫర్​ చేస్తోంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్​పై పూర్తి స్థాయిలో పరిజ్ఞానం సాధించవచ్చు. క్లౌడ్స్​ లోపల సిస్టమ్స్ కాన్సెప్ట్‌లు ఎలా పని చేస్తాయనే విషయంపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. అంతే కాదు వీటిపై ఉద్యోగ అవకాశాలు కూడా లేకపోలేదు.

    Job Openings: మెజారిటీ ఉద్యోగాలు.. ఆ కోర్సు చేసిన వారికే.. కంపెనీలో పెరుగుతున్న నియామ‌కాలు


    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నాలో కంప్యూటర్ సైన్స్ అండ్​ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్​గా పనిచేస్తున్న డాక్టర్ రాజీవ్ మిశ్రా ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి పీహెచ్​డీ పట్టా పొందారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయిలో ఎంటెక్​, MNIT అలహాబాద్​లో బీటెక్​ పూర్తి చేశారు.

    కోర్సు వివరాలు..

    ఈ కోర్సు ప్రాథమికంగా కంప్యూటింగ్ కాన్సెప్ట్‌లు, అల్గారిథమ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్​కు సంబంధించిన మాడ్యూల్స్​పై లోతైన అవగాహన కల్పిస్తుంది. కోర్సులో భాగంగా ఏమేం టాపిక్స్​ నేర్పిస్తారో తెలుసుకుందాం.

    Jobs in AP: విజ‌య‌వాడ హెచ్ఎఫ్‌డ‌బ్ల్యూలో ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ. 53,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    క్లౌడ్​ ఇంట్రడక్షన్​, వర్చువలైజేషన్, వర్చువల్ మెషీన్‌ టాపిక్స్​పై అవగాహన కల్పిస్తారు.

    నెట్‌వర్క్ వర్చువలైజేషన్, జియో-డిస్ట్రిబ్యూటెడ్ క్లౌడ్‌లపై అవగాహన కల్పిస్తారు.

    క్లౌడ్, డిస్ట్రిబ్యూషన్​ సిస్టమ్స్​, ఇండస్ట్రీ సిస్టమ్​పై అవగాహన ఏర్పడుతుంది.

    క్లాసికల్ డిస్ట్రిబ్యూటెడ్​ అల్గారిథమ్స్​, ఇండస్ట్రీ సిస్టమ్స్​పై అవగాహన ఏర్పడుతుంది.

    క్లౌడ్​ స్టోరేజ్​ లేదా ఎస్​క్యూఎల్​పై అవగాహన ఏర్పడుతుంది.

    P2P సిస్టమ్​, ఇండస్ట్రీలో వాటి ఉపయోగం గురించి తెలియజేస్తారు.

    మ్యాప్​ రెడ్యూస్​, స్పార్క్​, అపాచీ కాఫ్కా క్లౌడ్​ అప్లికేషన్స్​పై అవగాహన ఏర్పడుతుంది.

    అంతే కాకుండా..  గ్రామీణ విద్యార్థులను సైతం ఐటీ సెక్టార్​లో(IT Sector) నియమించుకునేలా ఉచిత ఆన్​లైన్​ కోర్సులను ఆఫర్​(Offer) చేస్తున్నాయి. తాజాగా, ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(​ఐఐటీ) మద్రాస్ డేటా సైన్స్​పై ఉచిత ఆన్​లైన్ ట్రైనింగ్​ కోర్సు(Online Training Course)ను ప్రారంభించింది. స్వయం NPTEL ప్లాట్‌ఫారమ్‌ సహకారంతో ఈ ఆన్​లైన్​ కోర్సును ఆఫర్​ చేస్తోంది. ‘
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Career and Courses, IIT, Online Education

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు