CAREER AND COURSES DOING JOB TRIALS TRY THESE COURSES ARE USEFUL KNOW DETAILS EVK
Career and Courses: జాబ్ ట్రయల్స్ చేస్తున్నారా.. ఈ ఉచిత కోర్సులు ట్రై చేయండి ఉపయోగడతాయి..
ప్రతీకాత్మక చిత్రం
Career Courses | ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TATA Consultancy Services) గ్రాడ్యుయేట్స్‌కి శుభవార్త చెప్పింది. వారి కెరీర్ (Career)కు ఎంతో ఊతమిచ్చేలా పలు కోర్సులను ప్రవేశ పెట్టింది. రెజ్యూమ్ రైటింగ్, ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ఉచిత కోర్సులను అందిస్తోంది.
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TATA Consultancy Services) గ్రాడ్యుయేట్స్‌కి శుభవార్త చెప్పింది. వారి కెరీర్ (Career)కు ఎంతో ఊతమిచ్చేలా పలు కోర్సులను ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఉపయోగపడే కోర్సులు ఎక్కువగా ఉన్నాయి. ఈ కోర్సుల ద్వారా ఫ్రెషర్లు (Freshers), అండర్ గ్రాడ్యుయేట్ (UG), మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) వారి ఉపాధి నైపుణ్యాలను పదును పెట్టడానికి పొందవచ్చు. ఈ కోర్సుల దరఖాస్తుకు అధికారిక వెబ్సైట్ learning.tcsionhub.in ను సందర్శించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న ఇంగ్లీష్ (English)పై ప్రత్యేక కోర్సు అందిస్తోంది. ఇది పూర్తిగా ఆన్లైన్ (Online) రూపంలో కోర్సు అందిస్తున్నారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్..
ఈ కోర్సులో TCS మీకు “కమ్యూనికేషన్ అంటే ఏమిటి.. ఎలా కమ్యూనికేట్ చేయాలి. అనే అంశాలపై పట్టు కల్పిస్తుంది. మాట్లాడే విధానంపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తారు. కోర్సు మొత్తం పూర్తి అయిన తర్వాత అభ్యర్థి ఆన్లైన్ లేదా ప్రత్యక్ష ఇంటర్వ్యూలో బాగా కమ్యూనికేట్ చేసా సామర్థ్యాన్ని అందిజగలమని కోర్సు నిర్వాహకులు చెబుతున్నారు.
ఇది కేవలం ఉపాధి కోసం వెతికే విద్యార్థులకే కాకుండా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. చిన్న వ్యాపారాలు చేసే వారికి కూడా మెరగ్గా మాట్లాడేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం వారూ ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి వారం రోజులు. అంతే కాకుండా ప్రస్తుతం టీసీఎస్ ఈ కోర్సును ఉచితంగా అందిస్తోంది.
ఇంటర్వ్యూ స్కిల్స్ కోర్స్
ఇంటర్వ్యూ అనేది ప్రశ్నల ద్వారా ఒక వ్యక్తికి సంబంధించి సమాచారం తెలుసుకోవడంతోపాటు అతిని నైపుణ్యాలను అంచనా వేసే పని. ఈ ప్రక్రియలో ఆలోచనలను మార్పిడి కూడా ఉంటుంది. ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే మీలోని నైపుణ్యాన్ని ప్రదర్శించడాని ఇది సరైన వేదిక. కఠినమైన ఇంటర్వ్యూలను ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ కోర్సు మీకు సాయం చేస్తుంది.
ఈ కోర్సు ముఖ్యంగా ఫ్రెషర్స్ కోసం రూపొందించబడింది. వారు మెరుగైన ఉపాధి అవకాశాలు పొందడానికి ఈ కోర్సు (Course) చాలా అవసరం. వారికి అనుభవం ఇవ్వడంతోపాటు ఎలా ఇంటర్వ్యూని ఎదర్కోవాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.
అలాగే ఈ కోర్సు ఇప్పుడే ఉద్యోగంలో చేరిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ (Professional)తో పాటు వ్యాపారవేత్తలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ కోర్సు కాల వ్యవధి వారం రోజులు. ప్రస్తుతం ఈ కోర్సును ఉచితంగా అందిస్తున్నారు.
రెజ్యూమ్ రైటింగ్ అండ్ కవర్ లెటర్ కోర్స్..
అభ్యర్థిని చూడకుండా అతనిపై అంచనాకు రావడానికి ఎంతో ఉపయోగపడేది రెజ్యూమ్. దీన్ని రూపొందించడం ప్రతిభతో కూడుకున్న పని. ఈ విషయంత తెలియక చాలా మంది సరైన రెజ్యూమే (Resume) ప్రిపేర్ చేసుకోవడం లేదు. దాని ద్వారా ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. వారి కోసం టీసీఎస్ ప్రత్యేక రెజ్యూమ్ రైటింగ్ కోర్స్ అందిస్తోంది. ఈ కోర్స్ ఒక వారం పాటు ఉంటుంది. ప్రస్తుతం ఈ కోర్సును ఉచింగా అందిస్తున్నారు.
ఐఓటీ (IoT) అండ్ అప్లికేషన్ కోర్స్..
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (Internet of Things) అనేది కాస్త సంక్లిష్టమైన సబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు ఎంతో ఉపయోగ పడుతుంది. టీసీఎస్ ఈ కోర్సులో అందించే ఉదాహరణల కోసం పైథాన్‌ని ప్రాథమిక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (Programming Language) తోపాటు రాస్ప్బెర్రీ పై పరికరాన్ని ఎంచుకుంది. కోర్సు ఎనిమిది వారాలు ఉంటుంది. ప్రస్తుతం కోర్సు ధర రూ.17,700గా సంస్థ నిర్ణయించింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.