హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career and Courses: జాబ్ ట్ర‌య‌ల్స్ చేస్తున్నారా.. ఈ ఫ్రీ కోర్సు ఉప‌యోగప‌డుతుంది!

Career and Courses: జాబ్ ట్ర‌య‌ల్స్ చేస్తున్నారా.. ఈ ఫ్రీ కోర్సు ఉప‌యోగప‌డుతుంది!

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Career and Courses | జాబ్ ట్ర‌య‌ల్స్ చేస్తున్న ఉద్యోగార్థుల‌కు ఐఐటీ పాట్నా మంచి అవ‌కాశం ఇస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనే ఉచిత ఆన్‌లైన్ కోర్సును(Free Online Course) ప్రారంభించింది. మొత్తం 8 వారాల వ్యవధిలో ఈ కోర్సు విద్యార్థుల‌కు అందుబాటులో ఉంది.

ఇంకా చదవండి ...

లేటెస్ట్​ టెక్నాలజీస్(Latest Technology)​లో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాల దృష్ట్యా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొత్త కోర్సులను(New Courses) ప్రవేశపెడుతున్నాయి. తాజాగా ఐఐటీ పాట్నా (IIT Patna) క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనే ఉచిత ఆన్‌లైన్ కోర్సును(Free Online Course) ప్రారంభించింది. మొత్తం 8 వారాల వ్యవధి గల ఈ ఆన్​లైన్​ కోర్సు ద్వారా డేటా స్ట్రక్చర్స్​, అల్గారిథమ్‌లపై విద్యార్థులు పట్టు సాధించవచ్చు. ఈ కోర్సును స్వయం NPTEL సహకారంతో ఐఐటీ పాట్నా ఆఫర్​ చేస్తోంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్​పై పూర్తి స్థాయిలో పరిజ్ఞానం సాధించవచ్చు. క్లౌడ్స్​ లోపల సిస్టమ్స్ కాన్సెప్ట్‌లు ఎలా పని చేస్తాయనే విషయంపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. అంతే కాదు వీటిపై ఉద్యోగ అవకాశాలు కూడా లేకపోలేదు.

Jobs in Hyderabad: కేంద్ర సంస్థ‌లో ఉద్యోగ అవ‌కాశాలు.. వేత‌నం నెల‌కు రూ.40,000.. అర్హ‌త‌లు ఇవే!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నాలో కంప్యూటర్ సైన్స్ అండ్​ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్​గా పనిచేస్తున్న డాక్టర్ రాజీవ్ మిశ్రా ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి పీహెచ్​డీ పట్టా పొందారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయిలో ఎంటెక్​, MNIT అలహాబాద్​లో బీటెక్​ పూర్తి చేశారు.

ఏం నేర్పిస్తారు.. 

- ఈ కోర్సు ప్రాథమికంగా కంప్యూటింగ్ కాన్సెప్ట్‌లు, అల్గారిథమ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్​కు సంబంధించిన మాడ్యూల్స్​పై లోతైన అవగాహన కల్పిస్తుంది. కోర్సులో భాగంగా ఏమేం టాపిక్స్​ నేర్పిస్తారో తెలుసుకుందాం.

-  క్లౌడ్​ ఇంట్రడక్షన్​, వర్చువలైజేషన్, వర్చువల్ మెషీన్‌ టాపిక్స్​పై అవగాహన కల్పిస్తారు.

GATE Exam Jobs: "గేట్‌" ప‌రీక్ష క్లియ‌ర్ చేశారా.. అయితే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సినజాబ్స్ ఇవే!

- నెట్‌వర్క్ వర్చువలైజేషన్, జియో-డిస్ట్రిబ్యూటెడ్ క్లౌడ్‌లపై అవగాహన కల్పిస్తారు.

- క్లౌడ్, డిస్ట్రిబ్యూషన్​ సిస్టమ్స్​, ఇండస్ట్రీ సిస్టమ్​పై అవగాహన ఏర్పడుతుంది.

- క్లాసికల్ డిస్ట్రిబ్యూటెడ్​ అల్గారిథమ్స్​, ఇండస్ట్రీ సిస్టమ్స్​పై అవగాహన ఏర్పడుతుంది.

- క్లౌడ్​ స్టోరేజ్​ లేదా ఎస్​క్యూఎల్​పై అవగాహన ఏర్పడుతుంది.

- P2P సిస్టమ్​, ఇండస్ట్రీలో వాటి ఉపయోగం గురించి తెలియజేస్తారు.

- మ్యాప్​ రెడ్యూస్​, స్పార్క్​, అపాచీ కాఫ్కా క్లౌడ్​ అప్లికేషన్స్​పై అవగాహన ఏర్పడుతుంది.

కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్..

ఐఐటీ పాట్నా క్లౌడ్​ కంప్యూటింగ్​ కోర్సును జనవరి 24 నుంచి మార్చి 22 మధ్య ఎనిమిది వారాల పాటు నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఏప్రిల్ 23న పరీక్ష నిర్వహించి సర్టిఫికేట్‌ అందజేస్తారు. అయితే, దీని కోసం రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు మినహా కోర్సు కంటెంట్​ కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాల కోసం ఐఐటీ పాట్నా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు, అర్హ‌త‌లు, అప్లికేష‌న్ స‌మాచారం

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. .

Step 1 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://onlinecourses.nptel.ac.in/noc22_cs18/preview ను సంద‌ర్శించాలి.

Step 2 - అనంత‌రం Register ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.

Step 3 - క్లిక్ చేసిన త‌రువాత Sign up now ఆప్ష‌న్‌లోకి వెళ్లి ఫాం నింపాలి.

First published:

Tags: Career and Courses, IT jobs, New course, Online Education

ఉత్తమ కథలు